మా పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో కర్రసాములో శిక్షణ పొందుతున్నాను. కర్రసాము అంటే నాకు చాలా ఇష్టం. ఈ వేసవి సెలవుల్లో కర్రసాము శిక్షణ పూర్తి చేసుకుంటుండడం సంతోషంగా ఉంది. మాస్టర్ సులభమైన పద్ధతిలో శిక్షణ ఇస్తుండగా నేను చాలా బాగా నేర్చుకుంటున్నాను. – సహర్ష్
కర్రసాముతోపాటు యోగా కూడా..
సమ్మర్ క్యాంప్‌లో యోగా, కర్రసాము, చిత్రలేఖంలో శిక్షణ ఇస్తున్నారు. నేను యోగా, కర్రసాము శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. రెండు తరగతుల మధ్య కొంత సమయం ఉండగా యోగా, కర్రసాము నేర్చుకుంటున్నాను. తరగతులు చక్కగా నిర్వహిస్తున్నారు. సులభంగా నేర్పిస్తున్నారు. – సీహెచ్ శ్రీనిధి


