సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారు | - | Sakshi
Sakshi News home page

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారు

Dec 2 2025 8:09 AM | Updated on Dec 2 2025 8:09 AM

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారు

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారు

● ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిఽధిలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.18.70 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ● పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట గల స్థలంలో రూ.1.75 కోట్ల వ్యయంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయన్ను ఐఓసీఎల్‌ పెట్రోల్‌ బంక్‌కు భూమిపూజ. ● సీఎస్‌ఆర్‌ నిధులు కోటి రూపాయలతో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన. ● నూతన కలెక్టరేట్‌ భవనం వద్ద రూ.2.31 కోట్ల వ్యయంతో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన. ● పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఎదుట రూ.2.60 కోట్ల వ్యయంతో నిర్మించిన డీఎస్పీ, సీఐ, ఎస్సై క్వార్టర్లు, రూ.11.93 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏఆర్‌ డీఎస్పీ, అడ్మిన్‌ డీఎస్పీ, ఆర్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, ఏఆర్‌ఎస్‌ఐ, హెచ్‌సీ, పీసీ క్వార్టర్లను ప్రారంభిస్తారు. ● రూ.2కోట్ల వ్యయంతో సాత్నాల బస్టాండ్‌ సమీపంలో నిర్మించిన భరోసా సెంటర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ● ఆదిలాబాద్‌ పట్టణంలోని 160 ఎస్‌ఎల్‌ఎఫ్‌లకు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.19.69 కోట్ల చెక్కులను మహిళా సభ్యులకు అందజేయనున్నారు. ● పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు సంబంధించి ఐవోసీఎల్‌ ప్రతినిధులు–మెప్మా మధ్య ఎంవోయూ ఆర్డర్‌ను అందజేస్తారు.

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జిల్లా కేంద్రంలోని ఐపీ స్టేడియంలో బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

కైలాస్‌నగర్‌: సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన షెడ్యూల్‌ అధికారికంగా ఖరారైంది. రెండేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 4న ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి రానున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇందుకోసం ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. అనంతరం అక్కడే బహిరంగసభ నిర్వహించనున్నారు. ఇందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్‌, కాన్వాయ్‌ మార్గం సభ వేదిక, పోలీస్‌ బందోబస్తు, పార్కింగ్‌, వేదికపై అతిథుల సిట్టింగ్‌ వంటి ఏర్పాట్లపై అధికారులతో చర్చించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు శ్యామల దేవి, రాజేశ్వర్‌, ఆర్డీవో స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.

ఽశంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు

సీఎం పర్యటన సాగుతుందిలా..

మధ్యాహ్నం 1.20 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 2గంటలకు జిల్లా కేంద్రంలోని ఎరోడ్రమ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 2.10 గంటలకు ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుంటారు. 2.10 నుంచి 2.35 వరకు పోలీస్‌ క్వార్టర్స్‌, భరోసా సెంటర్‌ను ప్రారంభిస్తారు. 2:35కు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకు చేరుకుంటారు. 2:40 వరకు శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 3.55 గంటలకు హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు.

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

కై లాస్‌నగర్‌: ఈ నెల 4న జరిగే సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటన విజయవంతం చేసేలా అన్ని ఽశాఖల అధికారులు సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాజర్షి షా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎస్పీ అఖిల్‌ మహాజన్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దన్నారు. స్టేజ్‌ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, పార్కింగ్‌, తాగునీరు, విద్యుత్‌ సరఫరా వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలన్నారు. పర్యటన రోజున అధికారులు క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement