ఉత్సాహంగా రగ్బీ ఎంపిక పోటీలు
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ అండర్–14, 17 బాల,బాలికల రగ్బీ ఎంపిక పోటీలు శనివారం నిర్వహించారు. పోటీలను కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర పాల్, పోటీల కన్వీనర్ సాయికుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్‌స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. జోనల్ లెవెల్ పోటీలు ఈ నెల 3న ఇందిరాప్రియదర్శిని స్టేడియంలోనే నిర్వహించనున్నట్లు వివరించారు. పూర్తి వివరాలకు 9848429890 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.


