ప్రణాళికతో ఆడితే గెలుపు మనదే
టీమిండియాలో బ్యాటర్లంతా మంచి ఫామ్‌లో ఉండడం శుభపరిణామం. మరోవైపు స్పిన్ బౌలింగ్ అటాక్ చాలా బాగుంది. అంతేకాకుండా పాటిల్ స్టేడియంలో ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లు ఎక్కువగా జరిగాయి. ఆ స్టేడియంలో సాధన చేసి మ్యాచ్‌లు ఆడిన మన జట్టు ప్లేయర్లకు ఇది ఎంతో సానుకూల అంశం. ఇది జట్టు విజయంపై ప్రభావం చూపవచ్చు. మరోవైపు టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ తీసుకుని ఛేజింగ్‌కు ప్రాధాన్యతనిస్తే గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్లేయర్లంతా సమష్టిగా, మంచి ప్రణాళికతో ఆడితే విజయం మనదే.
– నరోత్తంరెడ్డి, క్రికెట్ కోచ్, ఆదిలాబాద్


