వరల్డ్ కప్ గెలిస్తే గొప్ప భవిష్యత్
ఉమెన్స్ క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరడం భారతీయ ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో గొప్ప విజయం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లతో ఉమెన్స్ క్రికెట్‌పై ఆసక్తి పెరిగింది. ఎంతోమంది మాలాంటి జూనియర్ క్రికెటర్లు ఆట ఆడటానికి ముందుకువస్తున్నారు. నాలోని ఆసక్తిని గమనించి మా తల్లిదండ్రులు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈసారి మన ఉమెన్స్ జట్టు ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిస్తే దేశంలో ఉమెన్ క్రికెట్‌కు ఎంతో ఆదరణ పెరుగుతుంది. క్రికెట్ ఆటను ఎంచుకోవాలనుకునే బాలికలు, యువతులకు గొప్ప భవిష్యత్ ఉంటుంది.
– గంటా శ్రీహర్షిణి, క్రికెటర్, ఆదిలాబాద్


