జిల్లాకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు

Nov 2 2025 9:01 AM | Updated on Nov 2 2025 9:01 AM

జిల్ల

జిల్లాకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు

● ఈనెల 7వరకు జిల్లాలో పరిశీలన ● ప్రజలతో మమేకం కావాలన్న కలెక్టర్‌

కైలాస్‌నగర్‌: ఐఆర్‌ఎస్‌, ఐపీఎస్‌, ఐఈఎస్‌, ఐఎస్‌ ఎస్‌ లాంటి ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీసెస్‌కు సంబంధించి 16మంది అధికారుల బృందం శిక్షణ కో సం శనివారం జిల్లాకు చేరుకుంది. హైదరాబాద్‌లో ని ఎంసీహెచ్‌ఆర్‌డీ నుంచి ప్రత్యేక బస్సులో అధికా రులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజర్షి షా వారితో సమావేశమయ్యారు. తొలుత జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులను వారికి పరిచయం చేశారు. అనంతరం సంబంధిత అధికారులు పరిచ యం చేసుకున్నారు. వారి రాష్ట్రం, సర్వీస్‌ తదితర వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వృత్తిపరంగా కొత్త అంశాలను నే ర్చుకునేందుకు జిల్లా ఎంతో అనుకూలమైందని తె లిపారు. తెలంగాణ కశ్మీర్‌గా పిలువబడే ఈ ప్రాంతంలో వివిధ మతాలు, కులాల ప్రజలు సామరస్యంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇక్కడి గిరిజ నుల్లో వివిధ తెగలు ఉన్నాయని ఆదివాసీలు కొము రం భీమ్‌ను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని తె లిపారు. సన్నబియ్యం పంపిణీ, భూ భారతి రెవె న్యూ చట్టం, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ చట్టాల గురించి వారికి వివరించారు. కేటాయించిన గ్రామాల్లో ప్రజలతో మమేకమై అక్కడి స్థితిగతులపై అధ్యయనం చేయాలని, ఆ గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్‌సీలు, రైతువేదికలు, పంచాయతీ కార్యాలయాలను సందర్శించి అ క్కడ అందిస్తున్న సేవలను పరిశీలించాలని తెలిపా రు. ఆయా గ్రామాల పూర్తి సమాచారంతో కూడిన నివేదికలను వారికి అందజేశారు. అధికారుల క్షేత్ర పర్యటనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అనంతరం మూడు బృందాలుగా నేరడిగొండ మండలం కుమారి, తాంసి మండలం బండలనాగపూర్‌, తలమడుగు మండలం సుంకిడి గ్రామాలకు వారు వెళ్లారు. ఈ నెల 4వరకు ఆయా గ్రామాల్లో ఉండి పరిశీలించనున్న అధి కారులు అదేరోజు సాయంత్రం జిల్లా కేంద్రానికి చే రుకుంటారు. మరుసటిరోజు నుంచి ఆదిలాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో పర్యటించనున్నారు. జిల్లా అ టవీ అధికారి ప్రశాంత్‌ బాజీరావ్‌ పాటిల్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, అడిషనల్‌ ఎస్పీ కాజల్‌ సింగ్‌, ట్రైనీ కలెక్టర్‌ సలోని చాబ్రా, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

నేరడిగొండ మండలం కుమారిలో..

నేరడిగొండ: మండలంలోని కుమారి గ్రామంలో సివిల్‌ సర్వీసెస్‌ శిక్షణ అధికారులు రిషిత కుమా రి, మయంక్‌ ముద్గిల్‌, ఆషిష్‌ బిష్ణోయి, అంత్ర మదాన్‌, ఓంశుక్లా పర్యటించారు. గ్రామంలో నా లుగు రోజులపాటు ఉండి ప్రజల జీవన ప్రమాణాలు, ప్రభుత్వ పథకాల అమలు స్థితిగతుల గురించి సమీక్షించనున్నారు. ఇందులో భాగంగా మొదటిరోజు గ్రామ స్థాయిలో ప్రజల జీవన పరి స్థితులు, అభివృద్ధి అవసరాలు, ప్రభుత్వ పథకాల ప్రభావం లాంటి అంశాలను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో శేఖర్‌, ఎంపీవో శ్యామ్‌సుందర్‌రెడ్డి తదితరులున్నారు.

జిల్లాకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు1
1/1

జిల్లాకు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement