దళారులకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

దళారులకు చెక్‌!

Nov 2 2025 9:01 AM | Updated on Nov 2 2025 9:01 AM

దళారు

దళారులకు చెక్‌!

‘ఇందిరమ్మ’ బిల్లులకు పైరవీలు కమీషన్ల కోసం వేధిస్తున్న వైనం ఇవ్వద్దంటున్న ఉన్నతాధికారులు ఫిర్యాదు చేయాలంటూ సూచన బిల్లులు సకాలంలో చేతికందేనా?

కైలాస్‌నగర్‌: ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో ద ళారులు, పైరవీకారుల జోక్యానికి చెక్‌పెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం సంస్కరణలు చేపట్టింది. అధికారుల చు ట్టూ తిరుగుతూ అవస్థలు పడకుండా లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ ప్రగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని వినియోగంపై అ ధికారులు క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. దశలవారీగా ఇంటి నిర్మాణ వివరాలు యాప్‌లో నమోదు చేయడం ద్వారా సులభంగా బిల్లులు పొందే వెసులుబాటు కలగనుంది.

ఏం చేయాలంటే..

లబ్ధిదారులు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా గూగుల్‌ ప్లేస్టోర్‌లో ప్రభుత్వం రూపొందించిన ‘ఇందిరమ్మ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఆధార్‌ నంబర్‌తో లింక్‌ ఉ న్న మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలి. ఆ నంబర్‌ కు నాలుగంకెల ఓటీపీ నంబర్‌ వస్తుంది. దాని ఆ ధారంగా లబ్ధిదారు తమ ఇంటి నిర్మాణ వివరాలు ఆ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుందని హౌసింగ్‌శాఖ ఏఈ ఎండీ నసీర్‌ అహ్మద్‌ తెలిపారు.

బేస్మెంట్‌ దశలో..

ఇంటి నిర్మాణం బేస్మెంట్‌ దశలో ఉంటే లబ్ధిదారు ఎఫ్‌ఎస్‌సీ నంబర్‌, మొబైల్‌ నంబర్‌, బ్యాంక్‌ అకౌంట్‌ నంబర్‌, ఆ నెంబర్‌ను సరిపోల్చేలా పాస్‌బుక్‌ అప్‌లోడ్‌ చేయాలి. ఇంటి నిర్మాణం కొత్తదా.. లేదా పాతదా.. ప్లింత్‌ ఏరియా స్క్వేర్‌ ఫీట్లలో, బేస్మెంట్‌ పూర్తి అయ్యిందా.. లేదా అనే వివరాలు నమోదు చేసి ఆ ఫొటోలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

రూప్‌ లెవెల్‌లో..

ఇంటి నిర్మాణం రూప్‌ లెవెల్‌కు చేరాకా రూప్‌ గోడ ల వరకు నిర్మాణం జరిగిందా.. తలుపులు, కిటికీలు ఏర్పాటు చేశారా.. బేస్మెంట్‌కు టెక్నాలజీని వాడుకున్నారా.. అనే వివరాలు నమోదు చేయాలి. అలాగే రూప్‌ లెవెల్‌కు సంబంధించిన నిర్మాణం నాలుగు వైపులతో కూడిన ఫొటోలను అప్‌లోడ్‌ చేయాలి. ఈ వివరాలన్నింటినీ నమోదు చేసి సబ్‌మిట్‌ చేస్తే అది హౌసింగ్‌శాఖ ఏఈ లాగిన్‌కు వెళ్తుంది. ఆయన వాటిని ధ్రువీకరించి ఓకే చేస్తే హౌసింగ్‌ పీడీకి వెళ్తుంది. పీడీ వెరిఫై చేసి ఓకే చేస్తే కలెక్టర్‌ ద్వారా హౌసింగ్‌ ఎండీ లాగిన్‌కు వెళ్తుంది. ఆన్‌లైన్‌లో కావడంతో ఈ ప్రక్రియ సకాలంలో సులభతరంగా పూ ర్తవుతుంది. లబ్ధిదారులు జాగ్రత్తగా వ్యవహరించి వెబ్‌సైట్‌లో సూచించినట్లుగా వివరాలు నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

డబ్బులు అడిగితే ఫిర్యాదు ఇలా..

బిల్లుల కోసం ఎవరైనా డబ్బులు అడిగినా, బిల్లుల మంజూరులో ఇబ్బందులకు గురిచేసినా ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ ఫ్రీ నంబర్‌ 18005995991కు లబ్ధిదారులు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నంబర్‌కు వివరాలు తెలిపినట్లయితే రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి వెళ్లి చర్యలు చేపట్టేందుకు అవకాశముంటుంది. ఈ నంబర్‌తో కలెక్టర్‌, స్థానిక సంస్థల అడిషనల్‌ కలెక్టర్‌ను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశముంది.

జిల్లాలోని ఇందిరమ్మ ఇళ్ల సమాచారం

మంజూరైన ఇళ్లు 15,896

మార్కౌట్‌ ఇచ్చినవి 9,187

బేస్మెంట్‌ లెవెల్‌లో.. 4,397

రూప్‌ లెవెల్‌లో.. 1,407

రూప్‌ కంప్లీటెడ్‌.. 477

పూర్తయినవి 6

సద్వినియోగం చేసుకోవాలి

ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణ ప్రగతి వివరాలు పంచాయతీ కార్యదర్శులు, వార్డు ప్రత్యేకాధికారులు వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. అయితే.. కొన్ని చోట్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు అడిగినట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో లబ్ధిదారులే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి.

– ఎండీ నసీర్‌ అహ్మద్‌, హౌసింగ్‌ ఏఈ

దళారులకు చెక్‌!1
1/1

దళారులకు చెక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement