
ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు
● ఎంపీ నగేశ్
ఆదిలాబాద్‌రూరల్: విద్యార్థులు ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. మండలంలోని మామిడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వన మహోత్సవంలో భాగంగా ఆవరణలో మొక్క నా టారు.అనంతరం ఈఏడాది పదో తరగతిలో అత్యు త్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ఏకా గ్రతతో ఇష్టపడి చదివితే భవిష్యత్‌లో ఉన్నత స్థా నాలు అధిరోహించవచ్చన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చా రు. ఇందులో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ జెడ్పీటీసీ మడావి రాజు, ప్రధానోపాధ్యాయులు శైలజ, అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ గులాబ్, మధుసూదన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.