
బాల్యవివాహాలను అరికట్టాలి
ఆదిలాబాద్‌టౌన్: బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బాలికా సాధికారత అభివృద్ధికి సంస్థ చేస్తున్న కృషి ని అభినందించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జ రిగితే 1098కు సమాచారం ఇవ్వాలని సూచించా రు. సంస్థ డైరెక్టర్ రమేశ్ రాజశేఖర్‌రెడ్డి, జిల్లా మేనేజర్ శ్రీకాంత్, డీసీపీవో రాజేంద్రప్రసాద్, డైట్ ప్రి న్సిపల్ కిరణ్‌కుమార్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సతీశ్, సెక్టోరియల్ అధికారులు సుజాత్ ఖాన్, రఘురమణ, శ్యామ్‌సుందర్, నర్సయ్య, రాజేశ్వర్, శ్రీకాంత్‌గౌడ్, ప్రవీణ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.