
వైఎస్సార్‌కు ఘన నివాళి
కైలాస్‌నగర్: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయిన మహానేత దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ అని మున్సిపల్ మాజీ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు గుడిపల్లి నగేశ్ అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రజాసేవభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు హాజరై వైఎస్సార్ చిత్ర ప టానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలకు, పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆదిలాబాద్‌కు రిమ్స్‌తో పాటు పలు ప్రాజెక్టులను తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని గుర్తు చేశారు. ఇందులో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భూపెల్లి శ్రీధర్, నాయకులు గిమ్మ సంతోష్, ఆనంద్‌రావు, ప్రవీణ్‌రెడ్డి, దేవిదాస్‌చారి, సంజయ్‌రెడ్డి, శ్రీలేఖ, షబానా, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
● మహానేత సేవలను స్మరించుకున్న కాంగ్రెస్ నాయకులు