
సకల హంగులతో.. భరంపూర్
తలమడుగు మండలంలోని భరంపూ ర్ జెడ్పీ ఉన్నత పాఠఽశాలలో ఆధునాతన హంగులతో కూడిన విద్యాబోధన అందిస్తున్నారు. కంప్యూటర్ విద్యతో పాటు డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. వేసవి సెలవుల్లో సైతం విద్యార్థులకు హాకీ, డ్యాన్స్ ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతీ ఆదివారం విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ కల్పిస్తున్నారు. ఇందులో ప్రభుత్వమిచ్చిన యూనిఫాంలే కాకుండా విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఉంది. ఇందులో 256 మంది విద్యార్థులుండగా ఈ ఏడాది 53 మంది అడ్మిషన్ పొందినట్లు హెచ్‌ఎం ప్రత్యూష తెలిపారు. బాలసభ నిర్వహణ, ప్రొజెక్టర్ ద్వారా విద్యాబోధన, ఐఎఫ్‌డీ డిజిటల్ ప్యానెల్ సౌకర్యాలు ఇక్కడ ప్రత్యేకత చాటుతున్నాయి.