ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | Sakshi
Sakshi News home page

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Published Mon, May 27 2024 3:45 PM

ఆరు ఇ

బేల: పెన్‌గంగ ఇసుక దందాపై ఈ నెల 24, 25, 26 తేదీల్లో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై జిల్లా మైనింగ్‌ శాఖ ఎట్టకేలకు స్పందించింది. మండలంలోని కాంగార్‌పూర్‌ గ్రామ శివారులోని పెన్‌గంగ క్వారీ వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను మైనింగ్‌శాఖ టెక్నికల్‌ అసిస్టెంట్‌ రమేశ్‌ పవార్‌ ఆదివారం పట్టుకున్నారు. వాహనాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మైనింగ్‌శాఖ ఏడీకి నివేదించినట్లు ఆయన తెలిపారు. అయితే ముందస్తు సమాచారంతో ఇసుక తోడుతున్న ప్రత్యేక మిషన్‌, టిప్పర్లను ఇసుకాసురులు అక్కడి నుంచి తప్పించినట్లు వినికిడి. సమీపంలోని శ్మశానవాటిక వైపునకు తరలించి అధికారుల కంటబడకుండా దాచిపెట్టారని సమాచారం.

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
1/2

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
2/2

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement