‘ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి’ | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి’

Published Mon, May 27 2024 3:40 PM

-

ఆదిలాబాద్‌టౌన్‌: పాఠశాల విద్యాశాఖ కా ర్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఫిజికల్‌ సైన్స్‌ఫోరం టీచర్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విద్యాసాగర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ ప్రకటనలో తెలి పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6, 7 తరగతులకు భౌతికశాస్త్రం ఉపాధ్యాయులు గణితం బోధించాలని విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 8, 9, 10 తరగతుల భౌతిక రసాయన శాస్త్రం పాఠ్యాంశాల పనిభారం దృష్టిలో ఉంచుకొని 2017లో అప్పటి విద్యాశాఖ కమిషనర్‌ ఆర్‌సీ నం.77 విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు జేఈఈ, ఐఐటీ, నీట్‌ తదితర రకాల పోటీ పరీక్షలకు రసాయన శాస్త్రం కీలకమైన సబ్జెక్టు అని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement