నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Published Wed, May 22 2024 4:10 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ఆదిలాబాద్‌రూరల్‌: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్‌ దిలీప్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని అంకోలి, అనుకుంట గ్రామాల్లోని విత్తన షాపులను తనిఖీ చేశారు. స్టాక్‌ రిజిస్టర్‌, విత్తన ప్యాకెట్‌లపై ఉన్న లాట్‌ నంబర్‌, షాప్‌ డోర్‌ నంబర్‌, బిల్‌ బుక్‌, తదితర వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన షాపులలో అందుబాటులో ఏఏ విత్తనాలు, ఎన్ని అందుబాటులో ఉన్నాయో స్టాక్‌ బోర్డుపై రాయాలన్నారు. మండలంలోని రైతులు విత్తనాల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కావాల్సిన విత్తనాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు లైసెన్స్‌ కలిగిన దుకాణాల వద్దనే విత్తనాలు తీసుకోవాలన్నారు. విత్తనాలు తీసుకునేటప్పుడు బిల్‌ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి అష్రఫ్‌, ఏఎస్సై సునీత, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement