క్లుప్తంగా | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Wed, May 22 2024 4:10 AM

-

గంజాయి స్వాధీనం

బజార్‌హత్నూర్‌: మండలంలోని టెంబి గ్రామంలో పంట చేనులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయిని మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన ఉర్వత జలీంషా పంట పొలంలో తనిఖీ చేయగా 500 గ్రాముల (రూ.12వేలు) గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

దాడిచేసిన ఇద్దరిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన శ్రీకాంత్‌, అరుణ్‌, సతీష్‌పై దాడి చేసిన రవితేజ, చెప్పు అనే వ్యక్తులపై టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై లాల్‌సింగ్‌ నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 20న క్రాంతినగర్‌ రోడ్డుపై అడ్డంగా రవితేజ, చెప్పు అనే ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్‌ చేశారు. ఆ రోడ్డు గుండా వెళ్తున్న శ్రీకాంత్‌, అరుణ్‌ వాహనం వారికి తాకగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారు. వీరితో పాటు మరో వ్యక్తి సతీష్‌పై కూడా దాడికి దిగారు. శ్రీకాంత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement