ఎయిడ్స్‌ రోగులను ఆదరించాలి | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ రోగులను ఆదరించాలి

Published Mon, May 20 2024 11:45 AM

ఎయిడ్స్‌ రోగులను ఆదరించాలి

ఆదిలాబాద్‌టౌన్‌: ఎయిడ్స్‌ రోగులను వివక్షకు గురి చేయకుండా ఆదరించాలని జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి డాక్టర్‌ గజానంద్‌ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ క్యాండిలైట్‌ మెమోరియల్‌ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఎయిడ్స్‌ బాధితులకు సంఘీభావంతో పాటు మృతిచెందిన వారికి ఆదివారం ని వాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా మే నెల మూడో ఆదివారం ఎయిడ్స్‌ మృతులను స్మరిస్తూ కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరుగుతుందన్నారు. హెచ్‌ఐవీ బారిన పడకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్త పడాలని సూచించారు. బాధితుల కోసం ప్రభుత్వ పరంగా అనేక సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ పారా మెడికల్‌ అధికారులు వామన్‌రావు, రమేశ్‌, ఎల్టీ రమణాచారి, సిబ్బంది సతీశ్‌, రాజశేఖర్‌, మజీద్‌, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సరిత, నాగరాజు, సురేఖ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement