విత్తన కొరత లేకుండా చర్యలు | Sakshi
Sakshi News home page

విత్తన కొరత లేకుండా చర్యలు

Published Mon, May 20 2024 11:45 AM

విత్తన కొరత లేకుండా చర్యలు

● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో డిమాండ్‌ గల విత్తన కొరత ఏర్పడకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య అ న్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో పట్టణంలోని సీడ్‌ డీలర్లతో ఆదివారం సమావేశం నిర్వహించారు. డీలర్ల వద్ద అందుబా టులో ఉన్న వివిధ రకాల విత్తనాలు, రోజువారీ గా క్రయ, విక్రయాల వివరాలు అడిగి తెలుసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృత్రి మ విత్తన కొరత సృష్టించే డీలర్లను ఉపేక్షించబో మని, అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల డిమాండ్‌ మేరకు వారి కి అవసరమైన విత్తనాలను మార్కెట్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయా కంపెనీలకు ఇండెంట్‌ పంపించి ఎప్పటికప్పుడు తెప్పించాలన్నా రు. శాఖాపరంగానూ ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లి రైతులకు అవసరమైన విత్తనాలను అందుబా టులో ఉంచేలా చూస్తామన్నారు. జిల్లా రైతులకు మాత్రమే ఆధార్‌ కార్డు ఆధారంగా విత్తనాలు విక్రయించాలని ఆదేశించారు. మహారాష్ట్ర రైతులకు వి త్తనాలు అమ్మితే చర్యలు తప్పవన్నారు. జూన్‌ మొదటి వారం వరకు రైతులు విత్తనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, అప్పటివరకు దుకాణాల్లో సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలన్నారు. సమావేశంలో ఏడీఏ రమేశ్‌, డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement