ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన వ్యక్తిపై కేసు | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన వ్యక్తిపై కేసు

Published Sun, May 19 2024 10:00 AM

ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన వ్యక్తిపై కేసు

ఆదిలాబాద్‌టౌన్‌: ట్రిపుల్‌ తలాక్‌ చెప్పిన వ్యక్తిపై ఆదిలాబాద్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమో దు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ జి.శ్రీనివాస్‌ తెలిపారు. శనివారం వివరాలను వెల్లడించారు. శనివారం ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదిలాబాద్‌ పట్టణంలోని కేఆర్‌కే కాలనీకి చెందిన జాస్మీన్‌ అనే మహిళకు 2017లో అబ్దుల్‌ అతీక్‌తో వి వాహమైంది. దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు న్నా రు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండడంతో గతేడాది ఫిబ్రవరిలో అబ్దుల్‌ అతీక్‌పై వేధింపుల కేసు నమోదైంది. భర్త నుంచి దూరంగా ఉంటున్న ఆమె మెయింటెనెన్స్‌ కోసం కోర్టులో కేసు వేయగా నెలకు రూ.7వేల చొప్పున ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. నాలుగు నెలలుగా డబ్బులు ఇవ్వకుండా ఆమెకు ట్రిపుల్‌ తలాక్‌ ఇస్తున్నట్లుగా ఈ నెల 11న వాట్సాప్‌ ద్వారా రెండు నిమిషాల నిడివి గల సందేశం పంపించాడు. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. దీంతో ఆవేదనకు గురైన బాధితురాలు శనివారం మహిళా పోలీస్‌ స్టేషన్‌ అధికారులను ఆశ్రయించింది. 2019లోనే ప్రభుత్వం ట్రిపుల్‌ తలాక్‌ ను రద్దు చేస్తూ ప్రత్యేక చట్టం తీసుకోచ్చిన విషయం తెల్సిందే. దీంతో అతీక్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఇన్‌స్పెక్టర్‌ వివరించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement