పురుగు మందు డబ్బాలతో అన్నదాతల నిరసన | Sakshi
Sakshi News home page

పురుగు మందు డబ్బాలతో అన్నదాతల నిరసన

Published Sun, May 19 2024 10:00 AM

పురుగు మందు డబ్బాలతో అన్నదాతల నిరసన

ఆదిలాబాద్‌: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్‌ హెడ్‌ పోస్టాఫీస్‌ ఎదుట శనివారం అన్నదాతలు ఆందోళనకు దిగారు. గత మార్చిలో సీసీఐ ద్వారా పత్తి విక్రయించిన అన్నదాతలకు సంబంధించిన నగదును ఐపీపీబీ మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఈ విషయమై రైతుల ఫిర్యాదు మేరకు సదరు మేనేజర్‌పై కేసు నమోదు చేశారు. నెలలు గడుస్తున్నా తమ ఖాతాల్లోకి నగదు జమ కావడం లేదని అన్నదాతలు పురుగుమందు డబ్బాలతో నిరసన చేపట్టారు. పోస్టల్‌ అధికారులు గతంలోనే నెల తర్వాత ఖాతాలో డబ్బులు జమవుతాయని చెప్పినప్పటికీ ఇంతవరకు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 రోజులపాటు వేచి చూడాలని అధికారులు చెబుతున్నారని, పంట సాగు కాలం సమీపిస్తున్న దృష్ట్యా వీలైనంత త్వరగా నగదును తమ ఖాతాల్లో జమచేసి న్యాయం చేయాలని కోరారు. లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పోస్టల్‌ అధికారుల హామీతో ఆందోళన విరమించారు.

పోస్టాఫీస్‌ ఎదుట ఆందోళన

Advertisement
 
Advertisement
 
Advertisement