మహిళలపై వేధింపులు అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలపై వేధింపులు అరికట్టాలి

Published Thu, Dec 14 2023 12:00 AM | Last Updated on Thu, Dec 14 2023 12:00 AM

మాట్లాడుతున్న సంక్షేమ అధికారి మిల్కా
 - Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: మహిళలపై వేధింపులు, హింస అరికట్టాలని జిల్లా సంక్షేమ అధికారి మిల్కా అన్నా రు. సఖీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రచారోద్య మం ముగింపు కార్యక్రమాన్ని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో భార్యభర్తలు స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. అసమానతలు తొలగిపోవాలంటే చదువు, జ్ఞానంతోనే సాధ్యమవుతుందన్నారు. డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే మాట్లాడుతూ.. మహిళలు, యువతులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. దళిత సీ్త్రశక్తి జాతీయ కన్వీనర్‌ ఝాన్సీరాణి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నగేష్‌, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు ఈశ్వరిబాయి తదితరులు మాట్లాడారు. స్మార్ట్‌ ఫోన్‌ లాభనష్టాలు, తదితర విషయాలను వివరించారు. కార్యక్రమంలో డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్‌, సీడబ్ల్యూసీ చైర్మన్‌ వెంకటస్వామి, సభ్యులు సమీరుల్లా ఖాన్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సాధన, డీఈవో ప్రణీత, మహిళా సాధికారత కోఆర్డినేటర్‌ యశోద, సఖీ కేంద్రం నిర్వాహకురాలు సరస్వతి, చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌ సతీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement