ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

Published Sat, Dec 2 2023 1:46 AM

నరహరిగౌడ్‌(ఫైల్‌) - Sakshi

జైపూర్‌: జైపూర్‌ మండలం షెట్‌పల్లి గ్రామానికి చెందిన కొరకొప్పుల నరహరిగౌడ్‌(27) ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఉపేందర్‌రావు తెలిపారు. నరహరి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు స్వగ్రామమైన షెట్‌పల్లి గ్రామానికి వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పో లీసులు తెలిపారు. మృతుడికి 13 రోజుల పాప ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement