ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న   జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌  - Sakshi

కైలాస్‌నగర్‌: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మహానీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఆయా కార్యాలయాల్లో పండగ వాతావరణం కనిపించింది. అమరవీరుల త్యా గాలను స్మరించుకున్నారు. జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.ఉదయ్‌కుమార్‌రెడ్డి, మున్సి పల్‌ కార్యాలయంలో చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ జాతీయ జెండా ఆవిష్కరించారు. డీఆర్డీఏ కార్యాలయంలో డీఆర్డీవో కిషన్‌, జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో ప్రణీత, విద్యుత్‌శాఖ కార్యాలయంలో ఎస్‌ఈ సంపత్‌ కుమార్‌, వైద్యారోగ్యశాఖలో డీఎంహెచ్‌వో రాథోడ్‌ నరేందర్‌, ఐసీడీఎస్‌లో పీడీ మిల్కా, సంక్షేమశాఖల కార్యాలయ సముదాయంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శంకర్‌ త్రివర్ణ పతకాన్ని ఎగురవేశారు. అలాగే ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ రాజేందర్‌ నాయక్‌, వ్యవసాయశాఖ కార్యాలయంలో డీఏవో పుల్లయ్య, ఉద్యానవనశాఖ కార్యాలయంలో ఏడీ శ్రీనివాస్‌ రెడ్డి , మార్కెటింగ్‌ కార్యాలయంలో ఏడీ శ్రీనివాస్‌, పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో జిల్లా పశుసంవర్దకశాఖ అధికారి బి.కిషన్‌, మత్స్యశాఖ కార్యాలయంలో మత్స్యశాఖ అఽభివృద్ధి అధి కారి వై.సాంబశివరావు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా శాఖ ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దరఖాస్తు చేసుకోండి

కైలాస్‌నగర్‌: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలోని చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ విభాగంలో ఔ ట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేసేందుకు అసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ ఒకటి, కౌన్సెలర్‌ ఒకటి, సూపర్‌ వైజర్‌ 3 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్హతలు, దరఖాస్తు వివరాల కోసం adilabad. telangana. gov.in/ adilabad. nic. inలో సంప్రదించాలని సూచించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 13లోపు జిల్లా కేంద్రంలోని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top