Viral video
-
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
మీడియాపై నోరుపారేసుకున్న జయరాం
అనంతపురం, సాక్షి: జర్నలిస్టులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు(Guntakal) టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ బహిరంగంగా ఆయన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో.. ‘‘జర్నలిస్టులను(Journalists) రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ గుమ్మనూరు జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. తక్షణమే ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పాలి’’ అని ఏపీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ చౌదరి డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయన క్షమాపణలు చెప్పకపోతే ధర్నాకు దిగుతామని జర్నలిస్టులు హెచ్చరిస్తున్నారు. ‘‘నాపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకు అన్నీ తెలుసు.. నేను ఏదైనా చేస్తా. నాపైన, నా కుటుంబ సభ్యులపైనా వార్తలు రాస్తే ఖబడ్దార్.. తాట తీస్తా. నేను అన్నీ చేసి వచ్చినోడ్ని.. ఏం రాసుకుంటారో రాసుకోండి’’ అంటూ ఓ కార్యక్రమంలో జర్నలిస్టులపై గుమ్మనూరు హెచ్చరికలు జారీ చేశారు.జయరాం ఆగడాలు మితిమీరిపోతున్నాయ్!జర్నలిస్టులపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి స్పందించారు. ‘‘మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే జయరాం వార్నింగ్ ఇవ్వడం దుర్మార్గం. వాస్తవాలు రాసే జర్నలిస్టు లను రైలు పట్టాలపై పడుకోబెతారా?. ఆయన ఆగడాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై గుంతకల్లు పోలీసుల దాడి చేశారు. రాష్ట్రంలో లాండ్ అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యింది. బాధితులపైనే హత్యాయత్నం కేసు కేసులు నమోదు చేస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల చెప్పు చేతుల్లో పోలీసులు పనిచేస్తున్నారు అని అనంతవెంకటరామిరెడ్డి మండిపడ్డారు. -
Mahakumbh 2025 : డస్కీ బ్యూటీ, ‘ఏంజలీనా జోలీ’ వైరల్ వీడియో
ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవోపేతంగా సాగుతు మహాకుంభమేళా సాగుతోంది, పవిత్ర త్రివేణిసంగమానికి కోట్లదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తజన సందోహం భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను సంతరించు కుంటోంది. ఈ మేళాలో ఇప్పటికే దేశానికి చెందిన సాధువులతో పాటు, విదేశాలకుచెందిన సాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా పూసల దండలు అమ్ముకునే అమ్మాయి ఇంటర్నెట్ను ఆకర్షిస్తోంది.ఇండోర్ నుండి మహాకుంభమేళాకు వచ్చిన యువతి నెట్టింట సంచలనంగా మారింది. ఆమె తేనె రంగు కళ్లతో డస్కీ బ్యూటీ వెలిగిపోతోంది. కోటేరు ముక్కు, చంద్రబింబం లాంటి మోము, తేజస్సుతో వెలిగిపోతున్న కళ్లు ‘మోనాలిసా’ ను తలపిస్తోంది. ఆమె ప్రశాంతమైన చిరునవ్వుతో, పొడవాటి, సిల్కీ, జడ జుట్టు అద్బుతమైన ఆమె సౌందర్యానికి మరింత వన్నెతీసుకొచ్చింది.దీంతో మేళాకు హాజరయ్యే ఫోటోగ్రాఫర్లు, వ్లాగర్లు, ఆమెతో సెల్ఫీలు , వీడియోల కోసం ఎగబడుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లను మంత్ర ముగ్దుల్ని చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోనాలిసా ఆఫ్ మహాకుంభ్’, ‘ఏంజలీనా జోలీ’, ‘‘ఎంత అందమైన కళ్లు’’, ‘చాలా అందంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు ‘‘ఎందుకలా ఆమె వెంటపడుతున్నారు.. సిగ్గుచేటు" అంటూ మరికొంతమంది కమెంట్ చేశారు. (Maha Kumbh Mela 2025: ‘కండల బాబా’ స్పెషల్ ఎట్రాక్షన్, ఎవరీ బాహుబలి)కాగా ఈ ఏడాది మహాకుంభమేళాలో ఐఐటీ బాబా, విదేశీ బాబా,అందమైన సాధ్వి, కండల బాబా ఇలా చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభమేళాలో ఆకట్టుకున్నసంగతి తెలిసిందే.एक गरीब लड़की इंदौर(MP) से महाकुंभ आती है, मालाएं बेचती है और दिन के 2 से ढाई हजार कमा लेती है।ये मेले हमारी सांस्कृतिक पहचान ही नहीं बल्कि आर्थिक समृद्धि के भी प्रतीक हैं। pic.twitter.com/BGhwuFbm0D— 𝙼𝚛 𝚃𝚢𝚊𝚐𝚒 (@mktyaggi) January 17, 2025 పన్నెండేళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా ఈ ఏడాది జనవరి 13 సోమవారం ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. మొత్తం 45 రోజులపాటు సాగే ఈ ఆధ్యాత్మిక వేడుకలో పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాదిమంది తరలి వస్తున్నారు. इनसे मिलिए ये हैं महाकुंभ मेला में माला बेचने वाली वायरल गर्ल मोनालिसा.. इनकी आंखे बहुत सुंदर है.. इसको कहते हैं किस्मत बदलते देर नहीं लगती.. #महाकुम्भ_अमृत_स्नान #महाकुंभ2025 #MahaKumbhMela2025 pic.twitter.com/Et87nnpRql— 🌿🕊️RACHNA MEENA 🌿❤️ (@RACHNAMEENA34) January 18, 2025 -
36,000 అడుగుల ఎత్తులో ‘ఛాయ్.. ఛాయ్..’
‘ఛాయ్.. ఛాయ్.. టీ కావాలా మేడమ్.. సర్ ఛాయ్ ఇమ్మంటారా?’ సాధారణంగా బస్సు స్టాప్లోనో లేదా రైళ్లలోనూ ఇలా టీ సర్వ్ చేయడం చూస్తూంటారు. కానీ ఏకంగా 36,000 అడుగుల ఎత్తులో టీ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది.. విమానంలో టీ సర్వ్ చేసి ఓ వ్యక్తి తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఈమేరకు తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఇండిగో విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ ప్రయాణికుడు తన సీటులో నుంచి లేచి ‘ఛాయ్.. ఛాయ్..’ అంటు తోటి ప్రయాణికులకు టీ సర్వ్ చేశాడు. అందుకు మరో ప్రయాణికుడు సాయం చేశాడు. డిస్పోజబుల్ గ్లాస్లో తోటి ప్యాసింజర్లకు టీను అందిస్తున్నట్లు తీసిన వీడియోను ఎయిర్‌క్రూ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by Aviation/CabinCrew's HUB 🇮🇳 (@aircrew.in)ఇదీ చదవండి: ఆన్లైన్ ఉన్నా చివరకు షోరూంలోనే..‘ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని వారు టీ ఎలా తీసుకుళ్లుంటారు?’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘ఒక భారతీయుడు మాత్రమే టీని ఎప్పుడైనా ఎక్కడైనా సర్వ్ చేయగలడు’ అని మరో వ్యక్తి రిప్లై ఇచ్చాడు. -
నీ కష్టం పగోడికి క్కూడా రాకూడదు మచ్చా... వైరల్ వీడియో
సాధారణంగా పెళ్లి కాని ప్రసాదులు ఏం చేస్తారు? పెళ్లిళ్ల పేరయ్యలనో, పెళ్లిళ్లు కుదిర్చే వెబ్‌సైట్లనో ఆశ్రయిస్తారు. అదీ కాదంటే స్నేహితుల ద్వారానో తనకు కావాల్సిన అమ్మాయిని వెతుక్కుంటారు. కానీ ఒక యువకుడు వెరైటీగా ప్రయత్నించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట నవ్వులు పూయిస్తోంది. స్టోరీ ఏంటంటే... రైళ్లలో చాయ్, సమోసాలు, పల్లీలు వగైరాలు అమ్ముకోవడం చూస్తాం.కానీ ఒక మెట్రో ట్రైన్లో ఉన్నట్టుండి ఒక యువకుడు గట్టి, గట్టిగా అరుస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. తీరా అతను మాట్లాడుతున్నదేంటో అర్థమై పగలబడి నవ్వేశారు. అంతేకాదు అమ్మాయిలు కూడా ముసి ముసినవ్వులు కోవడం ఈ వీడియోలో చూడొచ్చు. "మీ రోజుకి అంతరాయం కలిగించినందుకు క్షమించండి. నేను డ్రగ్స్ వాడను నాకు పిల్లలు లేరు. కానీ, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఐ లవ్ అమెరికా, ప్లీజ్ నన్ను వరైనా నన్ను వివాహం చేసుకోండి. తద్వారా అమెరికాలో ఉండగలను. నాకు మంచి వంట వచ్చు. మంచిగా మాలిష్ చేయడం వచ్చు. డిస్కో సంగీతం వింటాను’’ ఇలా సాగుతుండి అతగాడి అభ్యర్థన. ‘‘నాకు మీ డబ్బు అవసరం లేదు, నా డబ్బు కూడా మీకే ఇస్తాను. మంచి బట్టలు, బూట్లు కొనుగోలు చేసుకోవచ్చు అంటూ ఆఫర్ ఇచ్చేశాడు. అయినా ఎవరూ స్పందించకపోవడంతో.. ఆడా, మగా ఎవరైనా, నాకు ఆఫర్ చేయడానికి సమాన అవకాశాలు’’ అనడంతో అక్కడున్నవారంతా గొల్లుమన్నారు. దీంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందించారు.‘‘హిల్లేరియస్, ఇతగాడు మంచి సేల్స్ మేన్, తనను తాను అమ్మేసుకుంటున్నాడు’’ అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. వీళ్లను చూసి ‘‘మీకు భలే హ్యాపీగా ఉండాది గదా’’ అని పుష్ప స్టైల్లో ఉడుక్కుంటున్నారట పెళ్లి కాని ప్రసాదులు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గెయెంకా ఈ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియో ప్రామాణికత, మూలంపై స్పష్టత లేదు. యూఎస్ లో పరిస్థితి ఇదీ అంటూ ఆయన ట్వీట్ చేశారు. In trains in India, people sell chai, toys, combs, samosa, etc. But in USA ??? Watch & enjoy ................. ! 😄😜😃 pic.twitter.com/dfXcEOEbOh— Harsh Goenka (@hvgoenka) December 12, 2024 -
యూట్యూబ్‌లో నెమలికూర వంటకం
తంగళ్లపల్లి (సిరిసిల్ల): జాతీయ పక్షిని చంపడం చట్టరీత్యా నేరం. అయితే ఓ యూట్యూబర్ ఏకంగా ‘ట్రెడిషినల్ పికాక్ కర్రీ రెసిపీ’ అంటూ తన యూ ట్యూబ్ చానల్లో పోస్టు చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కోడం ప్రణయ్‌కుమార్ అనే వ్యక్తి కొన్నా ళ్లుగా శ్రీటీవి అనే యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నాడు.అయితే శనివారం తన యూట్యూబ్ చానల్లో ‘నెమలి కూర సంప్రదాయ పద్ధతిలో ఎలా వండాలి’ అంటూ పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ విస్తుపోయారు. అంతేకాకుండా అడవిపంది కూర వండటం గురించిన వీడియో కూడా సదరు యూట్యూబ్ చానల్లో దర్శనమివ్వడం గమనార్హం. పోలీసులు, అటవీశాఖ అధికారులు ఈ వీడియోపై నిజానిజాలు తెలుసుకొని సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. -
హీరో రానా క్యూట్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్.. వీడియో వైరల్
టాలీవుడ్ హీరో రానా పేరు చెప్పగానే అందరికీ 'బాహుబలి' సినిమా గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత ఎందుకో కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. కొన్నాళ్ల క్రితం 'రానా నాయుడు' సిరీస్‌లో నటించాడు. యాక్టింగ్ చేయనప్పటికీ నిర్మాణం, ఇతర తెలుగు సినిమాల్ని ప్రమోట్ చేసే విషయంలో ముందుంటాడు. ఇదంతా పక్కనబెడితే తాజాగా రానా ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: 'హాట్ స్పాట్' సినిమా రివ్యూ (ఓటీటీ))తాజాగా ఓ హోటల్లో స్టే చేసేందుకు రానాకు అక్కడ సిబ్బంది పుష్ప గుచ్చంతో పాటు శాలువా బహుకరించారు. అందరిలానే వాటిని తీసుకుని పక్కనవాళ్లకు ఇచ్చేయకుండా తనకు ఎవరైతే ఇచ్చారో ఆ మహిళా సిబ్బందికే ఫ్లవర్ బొకే ఇచ్చి, శాలువా కూడా తన చేతులతో కప్పేశాడు. దీన్ని చూసి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం రానా ఫ్రెండ్లీ నేచర్‌ని మెచ్చుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)Actor @RanaDaggubati in his natural habitat off screen 🤩#RanaDaggubati #Rana #Tollywood #PopperStopTelugu pic.twitter.com/FiCISww8Ip— Popper Stop Telugu (@PopperstopTel) July 22, 2024 -
ఇన్‌స్టా పోస్ట్ వైరల్ కావాలంటే.. సీఈఓ సూచన
ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఇన్‌స్టాగ్రామ్‌కు చాలా క్రేజ్ ఉంది. ఏదైనా పోస్ట్ వైరల్‌గా మారాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయాల్సిందే. అయితే ఎన్ని పోస్ట్‌లు పెట్టినా రీచ్ ఎక్కువగా రావడం లేదనుకునేవారికి ఇన్స్టాగ్రామ్ సీఈఓ ఆడమ్ మొస్సేరి కొన్ని చిట్కాలు చెబుతూ వీడియో పోస్ట్ చేశారు. అదికాస్త వైరల్‌గా మారింది.ఆయన వీడియోలో మాట్లాడుతూ..‘సాధారణంగా మనం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో లేదా ఫొటో వైరల్‌గా మారాలని కోరుకుంటాం. మన కంటెంట్ ఎక్కువ మందికి చేరాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఏదైనా కంటెంట్‌ను పోస్ట్ చేసి అలా వదిలేయకుండా నిత్యం కామెంట్లను పరిశీలిస్తుండాలి. మన ఫాలోవర్లు, ఇతరులు మన కంటెంట్ తీరుపై చాలా విలువైన కామెంట్లు చేస్తారు. వారీ ఆలోచన విధానం ఎలా ఉందో అర్థం చేసుకుని దానికి తగిన కంటెంట్‌ను ఇవ్వడానికి ప్రయత్నించాలి. పోస్ట్ అప్లోడ్ చేసిన తర్వాత కనీసం రెండు వారాలపాటు కామెంట్లను ట్రాక్ చేయాలి. వాటికి తగిన రిప్లై ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Adam Mosseri (@mosseri) -
మరీ ఓవర్ చేయకు: పంత్ క్యాచ్.. రోహిత్ రియాక్షన్ వైరల్
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. అమెరికా వేదికగా లీగ్ దశలో ఓటమన్నదే ఎరుగుక ముందుకు సాగిన రోహిత్ సేన.. వెస్టిండీస్‌లో జరుగుతున్న సూపర్-8లోనూ శుభారంభం చేసింది.గ్రూప్-1లో భాగంగా అఫ్గనిస్తాన్ గురువారం నాటి మ్యాచ్‌లో జయభేరి మోగించింది. అఫ్గన్ జట్టును 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(28 బంతుల్లో 53) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ- వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అఫ్గన్ ఇన్నింగ్స్‌లో పంత్- రోహిత్ క్యాచ్‌ల విషయంలో పోటాపోటీగా తలపడ్డారు.బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో పంత్ మొత్తంగా మూడు క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ రెండు క్యాచ్‌లు పట్టాడు. అఫ్గనిస్తాన్ ఇన్నింగ్స్ పదకొండో ఓవర్‌ను కుల్దీప్ యాదవ్ వేశాడు.ఈ క్రమంలో రెండో బంతిని అఫ్గన్ బ్యాటర్ గుల్బదిన్ నయీబ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. కుల్దీప్ వేసిన గూగ్లీని ఆడబోయి బంతిని గాల్లోకి లేపాడు. క్యాచ్‌కు ఆస్కారం ఉన్న నేపథ్యంలో పంత్ పరిగెత్తుకు వెళ్లి బంతిని అందుకున్నాడు.ఆ సమయంలో రోహిత్ కూడా పంత్‌కు సమీపంలోనే ఉండగా.. ఎగ్జైట్మెంట్లో పంత్ అతడి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సంతోషం పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘ఈ క్యాచ్ నీదేలే.. నేనేమీ అడ్డుపడను’’ అన్నట్లుగా రోహిత్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్‌గా మారింది.కాగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో పంత్.. రహ్మనుల్లా గుర్బాజ్(11), గుల్బదిన్ నయీబ్(17), నవీన్ ఉల్ హక్(0) క్యాచ్‌లు అందుకోగా.. రోహిత్ శర్మ ఇబ్రహీం జద్రాన్(8), నూర్ అహ్మద్(12) ఇచ్చిన క్యాచ్‌లను ఒడిసిపట్టాడు. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
ఉల్కాపాతం.. ఈ పేరు చాలామందికి తెలియంది కాదు. ఆకాశం నుంచి ప్రకాశవంతంగా దూసుకొస్తూ.. భూమ్మీద మీద పడే సమయంలో అవి మెరుస్తూ అద్భుతాన్ని తలపిస్తుంటాయి. అయితే.. తాజాగా శనివారం రాత్రి అలాంటి అనుభూతిని పొందారు స్పెయిన్, పోర్చుగల్ ప్రజలు. స్పెయిన్, పొరుగు దేశం పొర్చుగల్ ప్రజలు శనివారం రాత్రి ఆకాశంలో అరుదైన కాంతిని వీక్షించారు. నీలి రంగులో మెరుస్తూ ఉల్క ఒకటి భూమ్మీదకు రయ్‌మని దూసుకొచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వాహనాల్లో వెళ్లే వాళ్లు, పార్టీలు చేసుకునేవాళ్లు.. అనుకోకుండా ఆ దృశ్యాలను బంధించారు. Tires, Cascais, Portugal. ☄️#Tires #Cascais#Portugal #Fireball #Meteor #meteoro #meteorito #España#Spainpic.twitter.com/HDtnhQEYG7— Mr. Shaz (@Wh_So_Serious) May 19, 2024అవి చూసి భూమ్మీదకు సూపర్ పవర్ ఏదైనా దూసుకొచ్చిందా? అంటూ ఆశ్చర్యపోతున్నారు పలువురు. తోక చుక్కలు, ఉల్కాపాతంను కనివినీ ఎరుగని ఒక జనరేషన్ అయితే.. ఈ దృశ్యాల్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. ఇది ఏలియన్ల పనేనా?.. సూపర్ పవర్ ఏదైనా భూమ్మీదకు వచ్చిందా? అంటూ తమదైన ఎగ్జయిట్‌మెంట్‌ను ప్రదర్శిస్తోంది. A meteor lit up the sky with bright light during the night in Portugal and Spain.Source: X#Meteor #Spain #Portugal #Fireball #Sky #DTNext #DTnextNews pic.twitter.com/09Ma6GO0sg— DT Next (@dt_next) May 19, 2024అయితే ఆ ఉల్క ఎక్కడ పడిందనేదానిపై ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే కొందరు మాత్రం కాస్ట్రో డెయిర్లో పడిందని, మరికొందరేమో పిన్హెయిరోలో పడిందని చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. JUST IN: Meteor spotted in the skies over Spain and Portugal.This is insane.Early reports claim that the blue flash could be seen darting through the night sky for hundreds of kilometers.At the moment, it has not been confirmed if it hit the Earth’s surface however some… pic.twitter.com/PNMs2CDkW9— Collin Rugg (@CollinRugg) May 19, 2024 రెండు వారాల కిందటే.. అక్కడి ఖగోళ శాస్త్రవేత్తలు ఉల్క పడొచ్చని అంచనా వేశారు. హెలీ తోకచుక్క నుంచి వెలువడే శకలాల కారణంగా రాబోయే రోజుల్లో ఉల్కాపాతం ఎక్కువే ఉండొచ్చని వాళ్లు అంచనా వేస్తున్నారు. -
ఆ దేవుడు పిలుస్తున్నాడు..నటి పవిత్ర ఆఖరి ఇన్‌స్టా పోస్ట్, వీడియో వైరల్
కన్నడ బుల్లితెర నటి పవిత్రా జయరామ్ అకాల మరణం పరిశ్రమ వర్గాలను, తోటి నటీనటులను సహోద్యోగులు,అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రినయని తిలోత్తమ పాత్రతో తెలుగు వారికి దగ్గరైన పవిత్ర మరణంపై పలువురు సంతాపం ప్రకటించారు. అయితే చనిపోయిందన్న వార్త వెలుగులోకి రావడానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జవిత్ర జయరామ్ చందర్ చివరి ఇన్‌స్టా పోస్ట్ ఒకటి వైరల్ మారింది. నటుడు, భర్త చందూతో కలిసి చేసిన రీల్ నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.త్రినయని సీరియల్లో సోదరుడిగా నటించిన భర్త చల్లా చందుని ట్యాగ్‌ని చేస్తూ ఆమె చివరి ఇన్‌స్టా పోస్ట్ ఇది. "నా ప్రేమ ఎప్పుడూ నీదే పాపా @chandrakanth_artist మిస్ యూ పాపా ఎందుకు అంత ఏడుస్తున్నావు నన్ను నీతోనే వున్నారా పిచ్చోడా లవ్ యు మామా" అని క్యాప్షన్ ఉన్న పోస్ట్ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar) అలాగే ‘‘ఆల్వేస్ మై లవ్ ఫర్ యూ మామా, లవ్ యూ సో మచ్.. చాలా సమయం నీతో గడపాలని అనుకున్నా.. కానీ, ఆ దేవుడు పిలుస్తున్నాడు.. నాన్నా, నువ్వ టైమ్‌కి తిను’’ అంటూ మరో పోస్ట్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ వెల్లువెత్తాయి. ఆమె చనిపోయిన తరువాత పోస్ట్‌లు ఎలా పెడుతున్నారు అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఆమె భర్త చందూనే పోస్ట్ చేస్తున్నాడు మరికొంతమంది కమెంట్ చేయడం గమనార్హం. మదర్స్ డే రోజు విషాదం ఆర్ఐపీ పవిత్ర అంటూ చాలామంది నెటిజన్లు స్పందించారు. కన్నడిగులు మిమ్మల్ని గుర్తుంచుకుంటూ ఉంటారు.. ఓం శాంతి పవిత్ర మామ్ అంటూ కన్నడ ఫ్యాన్స్ సంతాపం ప్రకటించారు. త్రినయని సీరియల్లో పవిత్ర ఆన్-స్క్రీన్ సోదరుడు పరశురామ్‌గా చంద్రకాంత్ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@pavithrajayaram_chandar)పవిత్రా జయరాం మృతిపై నటుడు సమీప్ ఆచార్య సంతాపం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన విచారాన్ని వ్యక్తం చేశారు. “మీరు ఇక లేరనే వార్తతో మేల్కొన్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. నా తొలి ఆన్‌స్క్రీన్ తల్లి, మీరు ఎప్పుడూ ప్రత్యేకమే.” అంటూ పోస్ట్ చేశారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లోని మెహబూబా నగర్ సమీపంలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో చంద్రకాంత్‌తో అపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ తదితరులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. -
ఈ కొరియన్ ఖవ్వాలీ విన్నారో.. వహ్వా వహ్వా..! అనక తప్పదు!
పాపులర్ ‘కె–పాప్’ మనకు సుపరిచితం. మరి ‘కె–ఖవ్వాలి అంటే?’ అని అడిగితే ‘అదేమిటీ!’ అని మిక్కిలి ఆశ్చర్యపోయేవారితో పాటు ‘ఎక్కడి ఖవ్వాలీ? ఎక్కడి కొరియా’ అని దూరాభారాలను కూడా లెక్కవేసే వాళ్లు ఉంటారు. ‘కొరియన్ సింగర్స్ సింగింగ్ ఖవ్వాలి’ ట్యాగ్‌లైన్‌తో పోస్ట్ చేసిన ఈ ‘కె –ఖవ్వాలి’ వీడియో వైరల్ అయింది. కల్చరల్ ఎక్స్చేంజ్కు అద్దం పట్టే ఈ వీడియోలో కొరియన్ గాయకులు సంప్రదాయక ఖవ్వాలి మెలోడీలను అద్భుతంగా ఆలపించే దృశ్యం, హార్మోని సుమధుర శబ్దం నెటిజనుల చేత ‘వహ్వా వహ్వా’ అనిపిస్తోంది. ‘బ్యూటీఫుల్ కల్చరల్ ఎక్స్చేంజ్’ లాంటి ప్రశంసలు కామెంట్ సెక్షన్లో కనిపించాయి. ఇవి చదవండి: ప్రముఖ కొరియన్ సింగర్ అనుమానాస్పద మరణం: షాక్‌లో ఫ్యాన్స్ -
Virat Kohli: ఇంటర్నెట్లో క్యూటెస్ట్ వీడియో
ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. విరాట్ తన మెరుపు ఇన్నింగ్స్‌కు ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న అనంతరం విరాట్ లండన్‌లో ఉంటున్న తన కుటుంబంతో వీడియో కాల్ మాట్లాడాడు. Virat Kohli talking to Anushka Sharma and Vamika after won the match. - CUTEST VIDEO OF THE DAY. ❤️ pic.twitter.com/srREuiqS8u — CricketMAN2 (@ImTanujSingh) March 25, 2024 కోహ్లి తన కుటుంబంపై ముద్దుల వర్షం కురిపిస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో సందడి చేస్తుంది. కోహ్లి ఇటీవలే రెండో బిడ్డకు తండ్రైన విషయం తెలిసిందే. కోహ్లి భార్య అనుష్క ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది. కోహ్లి దంపతులు ఆ పిల్లాడికి అకాయ్ అని నామకరణం చేశాడు. కోహ్లి దంపతులకు ఇదివరకే ఓ అమ్మాయి ఉంది. ఆమె పేరు వామిక. THE VINTAGE KING KOHLI...!!!!! 🐐 One of the Greatest Post Match Interview by any Cricketer in the History - King Kohli You're the GOAT. pic.twitter.com/cZ331UXGlI — CricketMAN2 (@ImTanujSingh) March 26, 2024 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం ప్రజెంటేటర్ హర్షా భోగ్లేతో కోహ్లి మాట్లాడిన మాటలు కూడా ప్రస్తుతం వైరలవుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో తన వ్యక్తిగత అనుభవాల (లండన్) గురించి హర్షా కోహ్లిని అడుగగా.. ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. రెండో సారి తండ్రైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది తనకు తన కుటుంబానికి మరపురాని అనుభూతి. కుటుంబంతో కలిసి టైమ్ స్పెండ్ చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది. తమను గుర్తు పట్టని ప్రదేశంలో సాధారణ జీవనం గడిపే అవకాశం దొరికింది. ఇందుకు దేవుడికి కృతజ్ఞతలని కోహ్లి తెలిపాడు. క్రికెట్‌కు సంబంధించి కోహ్లి మాట్లాడుతూ.. అంతిమంగా గణాంకాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. జ్ఞాపకాలను మాత్రమే నెమరు వేసుకుంటారు. రాహుల్ ద్రవిడ్ చెప్పేది ఇదే. ఆర్సీబీ అభిమానుల నుంచి నాకు లభిస్తున్న ప్రేమ, ప్రశంసలు, మద్దతు అద్భుతమైనవి. ఇవి నేనెప్పటికీ మరచిపోలేనని కోహ్లి అన్నాడు. ఇదే సందర్భంగా కోహ్లి మరిన్ని ఆసక్తికర అంశాల గురించి కూడా ప్రస్తావించాడు. విశ్వవ్యాప్తంగా టీ20 ఫార్మాట్ ప్రమోషన్ కోసం తన పేరు ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ఇది ఇంకా రెండో మ్యాచ్ మాత్రమే ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని ఆర్సీబీ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. హర్షా భోగ్లే విరాట్‌కు ఆరెంజ్ క్యాప్ అందజేశాడు. -
USA: మాస్కో ఉగ్ర దాడులు.. ట్రంప్ పాత వీడియో వైరల్
వాషింగ్టన్: రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రవాదుల దాడులపై అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడినట్లుగా చెబుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ట్రంప్ మాజీ అధ్యక్షుడు ఒబామాపై విమర్శల దాడి చేశారు. ‘ఒబామా ఐసిస్ ఫౌండర్. ఐసిస్ ఆయనను గౌరవిస్తోంది. ఐసిస్ కో ఫౌండర్ హిల్లరీ క్లింటన్’ అని వీడియోలో ట్రంప్ సంచలన ఆరోపణలు చేశారు. ఇది మాస్కో దాడుల తర్వాత ట్రంప్ స్పందన అని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది తాజా వీడియో కాదని, మాస్కో దాడులపై ట్రంప్ మాట్లాడిన వీడియో కాదని తేలింది. ఈ వీడియో 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడిన వీడియో అని, దీనిని మాస్కోలో తాజాగా జరిగిన ఐసిస్ మారణహోమానికి ముడిపెట్టి మళ్లీ వైరల్ చేస్తున్నారని తేల్చారు. మాస్కోలో శనివారం(మార్చ్ 23) జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులపై ట్రంప్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. Big Statement By Donald Trump. He said, "Obama is the fuckin founder of ISIS. I'll never let you go Obama "#Russia #Moskau #MoscowAttack pic.twitter.com/4dRJRY5Phu — Umair Ali (@UmairAli_7) March 23, 2024 ఇదీ చదవండి.. అమెరికాలో నరమాంస భక్షకుడు -
ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!!
"ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారింది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఏ మూలనున్న వారితోనైనా స్నేహించే, సంభాషించే అవకాశం దొరుకుతోంది. మరోవైపు ముక్కూమొహం తెలియని వారిపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేసి, బాధపెట్టి ఆనందించే ట్రోల్స్ అనే ప్రత్యేక జాతిని సృష్టించింది. చక్కగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లిష్ మాట్లాడిన బెండపూడి విద్యార్థులను, పిల్లలని కూడా చూడకుండా విపరీతంగా ట్రోల్ చేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి స్థలాన్ని పొందిన వివాహితను అసభ్య పదజాలంతో ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారు. సినీ తారలు, రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్.. వారని వీరని లేదు, అందరూ ట్రోలింగ్ బారిన పడ్డవారే!" అదోరకమైన శాడిజం.. జీవితంలో ఎలాంటి గుర్తింపులేని, ఎవరూ పట్టించుకోని వ్యక్తులకు ఆన్లైన్లో ఐడెంటిటీ బయటపడకుండా మాట్లాడగలగటం ధైర్యాన్నిస్తుంది. తమను ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతోనే నోటికొచ్చినట్లు అసభ్యంగా మాట్లాడుతుంటారు. నిజానికి వీరిలో లోతైన అభద్రత ఉంటుంది. దాన్నుంచి బయట పడేందుకు, ఇతరుల అటెన్షన్‌ను పొందేందుకు ట్రోలింగ్‌ను ఒక సాధనంగా చేసుకుంటారు. ఎమోషనల్ కంట్రోల్ లేనివారు కూడా ట్రోలింగ్‌ను ఎంచుకుంటారు. ట్రోల్స్‌లో నార్సిసిజం, మాకియవెల్లియనిజం, శాడిజం ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. నార్సిసిజం అంటే విపరీతమైన స్వీయప్రేమ. వీరికి విపరీతమైన అటెన్షన్ కావాలి. దానికోసం ఇతరులను ట్రోల్ చేస్తుంటారు. మన రియాక్షన్ నుంచి వారికి కావాల్సిన అటెన్షన్ పొందుతారు. మాకియ వెల్లియన్ ట్రోల్స్ మానిప్యులేట్ చేయడానికి అబద్ధాలు, మోసం ఉపయోగిస్తారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం ఉండదు. ఇతరులు బాధపడుతుంటే లేదా బాధపెట్టి ఆనందించడమే శాడిజం. శాడిస్ట్ ట్రోల్స్ సంబంధంలేని అంశాలలో కూడా చేరి బాధపెట్టి ఆనందిస్తుంటారు. బలమైన కోటను నిర్మించుకోవాలి.. పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ట్రోలింగ్ తప్పలేదని, మీరు ఒంటరి కాదని గుర్తించండి. ట్రోలింగ్ ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా, మీ చుట్టూ బలమైన కోటను నిర్మించుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. మీరు సున్నిత మనస్కులైతే సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ ఉన్నా, ట్రోలింగ్ జరుగుతున్నంతకాలం డియాక్టివేట్ చేసుకోవాలి. ట్రోల్‌కు ప్రతిస్పందించడమంటే మృగానికి ఆహారం అందివ్వడమే. వారు కోరుకునే గుర్తింపు వారికి అందివ్వడమే. అందువల్ల కష్టమైనప్పటికీ ట్రోల్స్‌ను విస్మరించడమే వారి నుంచి తప్పించుకునే మార్గం. అప్పుడే వారు నిరాయుధులవుతారు, ఆకలితో అలమటిస్తారు. ట్రోల్స్‌ను నిరోధించడానికి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందించిన రిపోర్టింగ్ మెకానిజాన్ని ఉపయోగించండి. వారిని బ్లాక్ చేయండి, రిపోర్ట్ చేయండి, వారి అకౌంట్ డిలీట్ అయ్యేలా రిపోర్ట్ చేయండి. ట్రోలింగ్ మీ కంటే ట్రోల్ గురించి ఎక్కువగా వెల్లడిస్తుంది. వారి నీచ మనస్తత్వం అందరికీ తెలిసేలా చేస్తుంది. అందువల్ల ట్రోల్స్ గురించి బాధపడకండి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉంచుకోకండి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఆన్లైన్ గ్రూపుల మద్దతు తీసుకోండి. మీ విలువను మీకు గుర్తు చేయగల, మీకు సహాయం చేయగల వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి. ట్రోలింగ్ వల్ల ఆందోళన, నిరాశ, దిగులు, ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్టును సంప్రదించండి. ట్రోల్స్ 2 రకాలు.. ట్రోలింగ్ చేసేవారిని ట్రోల్ అంటారు. వీరు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటారు. వ్యక్తిగతంగా ఇతరులను ట్రోల్ చేసి ఆనందించేవారు. వీరివల్ల కాస్తంత బాధే తప్ప ప్రమాదం ఉండదు. కానీ ఒక సంస్థ కోసమో, రాజకీయ పార్టీ కోసమో వ్యవస్థీకృతంగా ట్రోల్ చేసేవారు ప్రమాదకరంగా ఉంటారు. ఎందుకంటే వారిలో ఒకరు ట్రోలింగ్ మొదలుపెడితే వందల్లో, వేలల్లో, లక్షల్లో ట్రోల్ చేస్తారు. వారికి ఆయా సంస్థ లేదా పార్టీల మద్దతు కూడా ఉండటంతో విపరీతంగా రెచ్చిపోతారు. ఇవి కొన్నిసార్లు ఆన్లైన్ యుద్ధాలుగా మారవచ్చు. ట్రోలింగ్ సంకేతాలను గుర్తించాలి.. ట్రోల్స్ నుంచి తప్పించుకోవాలంటే ముందు వారి లక్షణాలను, ప్రవర్తనను గుర్తించాలి. అప్పుడే వారికి దూరంగా ఉండవచ్చు. అందుకే వాటిని గుర్తించడం అవసరం. మీతో గొడవపడటం, మిమ్మల్ని రెచ్చగొట్టి, బాధపడేలా చేయడమే ట్రోల్స్ లక్ష్యం. అందుకోసం అవమానకమైన భాష ఉపయోగిస్తారు వాస్తవాలను వక్రీకకరిస్తారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించి, సామాజిక ఉద్రిక్తతలను సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. చర్చను వాదనగా మారుస్తారు. మీ రూపం, విలువలు, విశ్వాసాలను కించపరుస్తూ మాట్లాడతారు. కొందరు మరింత దిగజారి బూతులు కూడా తిడతారు. — సైకాలజిస్ట్ విశేష్ (psy.vishesh@gmail.com) ఇవి చదవండి: Usha Mehta: వెండి తెర మీద రహస్య రేడియో -
# RCB: మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు!
ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ... నెట్టింట ఎక్కడ చూసినా ఇదే పేరు దర్శనమిస్తోంది. పదహారేళ్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పురుషుల జట్టుకు సాధ్యం కాని ఘనతను మహిళా జట్టు సాధించింది. వుమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే ట్రోఫీ గెలిచి.. ‘‘ఇస్ సాలా కప్ నమదే’’ అని ప్రతి ఏడాది సందడి చేసే బెంగళూరు ఫ్యాన్స్.. ‘‘ఇస్ సాలా కప్ నమ్దూ’’ అంటూ సగర్వంగా తలెత్తుకునేలా చేసింది. సమిష్టి కృషితో ఆర్సీబీని టైటిల్ విజేతగా నిలిపింది స్మృతి మంధాన సేన. No we’re not crying, you are 😭pic.twitter.com/Nb9TKf5NFw — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 ఈ నేపథ్యంలో బెంగళూరు వుమెన్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా గ్లెన్ మాక్స్వెల్, దినేశ్ కార్తిక్ తదితరులు స్మృతి సేన సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఆర్సీబీ సైతం.. ‘‘మేమేం ఏడ్వటం లేదు... అబ్బే ఇవి కన్నీళ్లుకావు’’ అన్నట్లుగా వీడియోను షేర్ చేసింది. Going down in the history books 📙🏆 pic.twitter.com/OrQkgRailK — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 మరోవైపు.. అదే సమయంలో అభిమానులు మాత్రం.. ‘‘లేడీస్ ఫస్ట్’ అనే నానుడిని ఆర్సీబీ మహిళలు నిజం చేశారు.. ఇక మిగిలింది మెన్స్ టీమ్’’ అంటూ ఫాఫ్ డుప్లెసిస్ బృందానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నెటిజన్లు.. తమదైన శైలిలో మీమ్స్ సృష్టించి ఆర్సీబీ పురుషుల జట్టును ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట నవ్వులు పూయిస్తున్న ఆ మీమ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!! 18 🤝 18 📸: JioCinema pic.twitter.com/0SDwzLHvRM — Royal Challengers Bangalore (@RCBTweets) March 17, 2024 RCB fans entering the office tomorrow#WPL2024 #WPLFinal #RCB pic.twitter.com/SKbaWNwqbN — ನಗಲಾರದೆ 𝕏 ಅಳಲಾರದೆ (@UppinaKai) March 17, 2024 Oreyy 😂 pic.twitter.com/FyEMLpAWws — Likhit MSDian (@LIKHITRTF) March 17, 2024 pic.twitter.com/93FufawCOn — t-riser (@techsaturation) March 17, 2024 కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ మహిళా జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిని తొలుత 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. 19.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించి WPL 2024 చాంపియన్‌గా అవతరించింది. చదవండి: WPL 2024: ప్రియుడితో కలిసి ట్రోఫీతో ఫోజులిచ్చిన మంధాన.. ఫోటో వైరల్ Every RCB Fan right now 🥺😭pic.twitter.com/CLS1MDrEeZ — Vikas (@VikasKA01) March 17, 2024 -
బ్యూటిఫుల్ లవ్లీ ఫ్యామిలీ
పెళ్లి వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా ఉంటారు. పెళ్లికి వచ్చిన అతిథులను పలకరించడం, పెళ్ళి పనులు చూసుకోవడంతోనే సరిపోతుంది. ‘టైమే బంగారమాయెనే’ అనుకునే సమయం లోనూ ఒక పెళ్లిలో వధువు తల్లిదండ్రులు చేసిన డ్యాన్స్ వీడియో వీర లెవెల్లో వైరల్ అయింది. స్టైలిష్ బ్లాక్ అండ్ గోల్డెన్ చీరలో వధువు తల్లి, స్మార్ట్ త్రీ పీస్ సూట్లో తండ్రి వేదికపై వివిధ హావభావాలతో చేసిన డ్యాన్స్ ‘వావ్’ అనిపించింది. స్టేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో బాల్యం నుంచి కాలేజీ స్టూడెంట్ వరకు వధువుకు సంబంధించిన రకరకాల విజువల్స్ కనిపిస్తూ కనువిందు చేస్తుంటాయి. ‘బ్యూటీఫుల్... లవ్లీ ఫ్యామిలీ’ లాంటి కామెంట్స్ ఎన్నో యూజర్ల నుంచి వెల్లువెత్తాయి. -
అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!
మనం రెస్టారెంట్‌కి వెళ్లితే బిల్ తోపాటు బాగా సర్వింగ్ చేసిన వ్యక్తికి కాస్త టిప్ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన.. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్‌లోని మిచిగాన్‌లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కి మార్క్ అనే వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్ ఫాస్ట్‌కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్ ఈ విషయం మేనేజర్‌కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్ మేనేజర్ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్ టిప్పింగ్ కల్చర్ సర్వే ప్రకారం..యూఎస్‌లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. View this post on Instagram A post shared by Mason Jar Cafe (@masonjarcafe_) (చదవండి: ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?) -
చీరకట్టులో జిమ్ వర్క్ఔట్స్!
ఇటీవల కాలంలో చీర ధరించడాన్నే ట్రెండీగా ఫాలో అవుతోంది యువత. అందులోనూ చీర కట్టులో స్కూటర్ నడపడం, లేదా వ్యాయామాలు చేసి ఆశ్చర్యపరుస్తున్నారు. నెటింట కూడా అలాంటి వీడియోలకే మంచి ఆదరణ ఉందని చెప్పొచ్చు. అంతేగాదు చీర కట్టులో ఎలాంటి పనులైన సునాయాసంగా చెయ్యొచ్చని నిరూపిస్తున్నారు. ఇక్కడ కూడా ఓ ఫిటెనెస్ కోచ్ చీరకట్టులో వర్క్ఔట్లు చేసి అందర్నీ ఆకర్షించింది. శారీ వర్కవుట్ వీడియోలతో ఇంటర్నెట్లో ఫేమ్ అయింది ఫిట్నెస్ కోచ్ రీనాసింగ్. చీరకట్టుతో ఫుష్–అప్స్, పుల్–అప్స్, స్వ్కాట్స్, జంప్స్లాంటి ఎక్సర్సైజులు చేస్తూ నెటిజనులను ఆకట్టుకొంటుంది. పాత, కొత్తా అనే తేడా లేకుండా ఆమె వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీనాసింగ్ తాజా వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 21.3 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ‘వర్కవుట్ల సమయంలో సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలని సిఫారసు చేసినప్పటికీ సౌకర్యంగా అనిపిస్తే చీర ధరించి వ్యాయామాలు చేయడం పొరపాటేమీ కాదు. అయితే గ్రిప్ తప్పకుండా ఉండడానికి అవసరమైన ఫుట్‌వేర్ ధరించాలి’ అంటుంది యోగా ట్రైనర్ అనూష రామ్. View this post on Instagram A post shared by Reena Singh (@reenasinghfitness) (చదవండి: మీరు ప్రేమిస్తున్న వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే..!) -
బిగ్‌బాస్ ఫైనలిస్టుని సన్మానించిన ఎస్ఐకి బదిలీ
యశవంతపుర: బిగ్‌బాస్ రియాలిటీ షో లో ఫైనల్స్‌కు చేరిన వర్తూరు సంతోష్‌ను బెంగళూరులో ఎస్ఐగా పని చేసే తిమ్మరాయప్ప సన్మానించారు. ఇది సబబు కాదంటూ పోలీసు కమిషనర్ దయానంద.. ఆ ఎస్ఐని వర్తూరు పీఎస్ నుంచి ఆడుగోడికి బదిలీ కానుక ఇచ్చారు. బిగ్‌బాస్‌లో పేరుగాంచిన సంతోష్‌కు అనేక మంది అభిమానులు ఉన్నారు. గతంలో మెడలో పులిగోరు వేసుకోవడంతో అతనిపై కేసు కూడా అయి జైలుకెళ్లి వచ్చాడు. అలాంటి వ్యక్తికి యూనిఫాంలో ఉన్న ఎస్ఐ గంధమాల వేసి మైసూరు పేటాతో సత్కరించడం, ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ కాగా అనేకమంది ఎస్ఐని తప్పుబట్టారు. -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్‌లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్‌లో మోస్ట్ వాంటెడ్‌గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్‌పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్‌ను భారత్ వాంటెడ్‌గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్‌కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే?
సింహం, పులి, చిరుత.. వీటి పేర్లు వినగానే మన మనసులో ఎక్కడో భయం నెలకొంటుంది. ఒకవేళ ఈ అటవీ జంతువులు ఎదురైతే ఎవరైనా సరే ఒక్క ఉదుటున పరుగులందుకుంటారు. ఈ ప్రమాదకరమైన జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ ఇంటర్నెట్లో దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఆ వీడియోలో తొలుత ఒక వ్యక్తి రహదారి గుండా హాయిగా నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తాడు. ఇంతలో అకస్మాత్తుగా ఒక పులి అతని ముందు నుంచి వేగంగా పరుగులు తీస్తూ వెళుతుంది. దానిని చూసి ఆ వ్యక్తి షాకవుతాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోను షేర్ చేసిన ఆయన దాని క్యాప్షన్‌లో ఇలా రాశారు. ‘ఇతను అందరికన్నా అదృష్టవంతుడైన వాడా? టైగర్ అతనిని చూసి అస్సలు స్పందించలేదు..’ అని రాశారు. కేవలం 41 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోను డిసెంబర్ 8న ఎక్స్‌లో షేర్ చేయగా, దీనిపై వ్యూవర్స్ రకరకాలుగా తమ స్పందనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను 4 లక్షల 76 వేల మంది వీక్షించగా, 5 వేల మందికి పైగా వ్యూవర్స్ ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్.. ‘సర్, ఇది ఉత్తరాఖండ్ ప్రజలకు సాధారణమైన అంశం’ అని రాశారు. మరొకరు ‘ఆ టైగర్ ఉపవాస దీక్షలో ఉంది’ అని రాశారు. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులెవరు? సస్పెన్స్ వీడేదెన్నడు? Is he the luckiest man alive. Tiger seems least bothered. From Corbett. pic.twitter.com/ZPOwXvTmTL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) December 8, 2023 -
రైల్లో సీటు కింద... విమానంలో నెత్తి మీద
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సీజన్ లో కోల్‌కతాకు చెందిన ఒక గృహిణి తాను నవ్వడమే కాక అమితాబ్‌ను విపరీతంగా నవ్వించింది. కేబీసీ వల్ల మొదటిసారి విమానం ఎక్కిన ఆమె రైల్లోలాగా చీటికి మాటికి సీటు కింద చూసుకుంటూ లగేజీ ఉందా లేదాననే హైరానా విమానంలో లేకపోవడం తనకు నచ్చిందని చెప్పింది. ఇంకా సరదా కబుర్లు చెప్పి అమితాబ్‌ను నవ్వించిన అలోకిక భట్టాచార్య వైరల్ వీడియో గురించి.... సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తాజా సిరీస్ తాజా ఎపిసోడ్లో కోల్‌కటాకు చెందిన అలోకిక భట్టాచార్య అనే గృహిణి అమితాబ్‌నే కాక ప్రేక్షకులను చాలా నవ్వించింది. ఆమె క్లిప్పింగ్‌ను అమితాబ్‌తో పాటు ఇతరులు ‘ఎక్స్’లో షేర్ చేయడంతో నెటిజన్లు ముచ్చటపడుతున్నారు. గత 17 ఏళ్లుగా ప్రయత్నిస్తే ఇప్పటికి కేబీసీలో పాల్గొనే అవకాశం దొరికిన అలోకిక ‘జై కేబీసీ’ నినాదంతో హాట్సీట్లో కూచుంది. ‘మీ ప్రయాణం ఎలా సాగింది?’ అని అమితాబ్ అడిగితే ‘కేబీసీ పుణ్యమా అని మొదటిసారి విమానం ఎక్కాను. మాలాంటి వాళ్లం రైలెక్కి ప్రతి పది నిమిషాలకూ ఒకసారి సీటు కింద లగేజ్ ఉందా లేదా చూసుకుంటాం. అర్ధరాత్రి మెలకువ వచ్చినా మొదట సీటు కిందే చూస్తాం. విమానంలో ఆ బాధ లేదు. లగేజ్ నెత్తి మీద పెట్టారు. పోతుందనే భయం వేయలేదు’ అనేసరికి అమితాబ్ చాలా నవ్వాడు. ‘కేబీసీ వాళ్లు ఎలాంటి ప్రశ్నలు వెతికి ఇస్తున్నారంటే నేనసలు ఏమైనా చదువుకున్నానా అని సందేహం వస్తోంది’ అని నవ్వించిందామె. ‘నువ్విలా నువ్వుతుంటే మీ అత్తగారు ఏమీ అనదా?’ అంటే ‘అంటుంది. కాని నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని ఎప్పుడూ నవ్వుతుంటాను. అదే నా ఆరోగ్య రహస్యం. మూడు పూటలా అన్నం, పప్పు, చేపలు తింటూ కూడా సన్నగా ఎలా ఉన్నానో చూడండి. ఫ్రీగా. కొంతమంది ఇలా ఉండటానికి డబ్బు కట్టి జిమ్ చేస్తుంటారు’ అని నవ్వించిందామె. అలోకిక ఈ ఆటలో పన్నెండున్నర లక్షలు గెలిచి ఆట నుంచి విరమించుకుంది. ఆ మొత్తం ఆమెకు చాలా ముఖ్యమైనదే. కాని అమితాబ్‌తో నవ్వులు చిందించడం అంతకంటే ముఖ్యంగా ఆమె భావించింది. This clip of #KBC is so very endearing! Her innocent, Joyous State of being is infectious. @SrBachchan Sahab is equally amazing.. Now Watch it and get infected with Joy! pic.twitter.com/5ylvrUGhlH — Adil hussain (@_AdilHussain) December 1, 2023 -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: కీలక పరిణామం, ఇది వాడి పనేనా?
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో ఘటనలో కీలక పరిణామంచోట చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు బిహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా ఆ యువకుడిని ప్రశ్నించినట్టు అధికారులు బుధవారం వెల్లడించారు. నిందిత యువకుడి సోషల్ మీడియా ఖాతానుండే అప్లోడ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తరువాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ యువకుడికి పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. మరోవైపు విచారణ సందర్భంగా వేరే ఇన్‌స్టా ఖాతానుంచి ఆ వీడియోను తాను డౌన్లోడ్ చేసుకున్నట్లు యువకుడు చెప్పినప్పటికీ, విచారణ కొనసాగుతుందని సంబంధిత సీనియర్ అధికారులు తెలిపారు. (వర్క్ ఫ్రం హోం, ఆదాయంపై సంచలన సర్వే:ఆ దిగ్గజాలు ఇపుడేమంటాయో?) మొబైల్ ఫోన్‌తో సహా బిహార్‌కు చెందిన యువకుడిని ఐఎఫ్ఎస్ఓ యూనిట్ ముందు హాజరుకావాలని పోలీసులు అదేశించారు. అలాగే FIR నమోదు చేసిన వెంటనే, IFSO యూనిట్ కూడా నిందితుడిని గుర్తించడానికి URL ఇతర వివరాల కోసం సోషల్ మీడియా దిగ్గజం, ఫేస్బుక్ మాతృసంస్థ మెటాకు లేఖ రాసింది. ఇది ఇలా ఉంటే ఈ ఘటనలో నవంబర్ 10న, ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (IFSO)లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 465 (ఫోర్జరీకి శిక్ష) , 469 (పరువుకు భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఫోర్జరీ) , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్లు 66C , 66E కింద ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ యూనిట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. (దీపావళి తరువాత పసిడి పరుగు: డాలర్ ఢమాల్) కాగా నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో ఆన్లైన్లో మహిళల సెక్యూరిటీపై ఆందోళన రేపింది. బిగ్‌బీ అమితాబ్ సహా పలువురు నటీ నటులు, ఇతర సెలబ్రిటీలు ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. చివరికి కేంద్ర ఐటీ శాఖ కూడా స్పందించి మరోసారి సోషల్ మీడియా సంస్థలు ఐటీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని గుర్తు చేసింది. (చాలా బాధ కలిగింది, ప్రతీదీ నిజం కాదు..ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు!) -
వారానికి 70 గంటల పని: ఇన్ఫో ‘సిస్’ వీడియో వైరల్.. మీ పొట్ట చెక్కలే!
70 hour work week remark hilarious video viral భారతీయు యువత వారానికి 70 గంటలు పని పనిచేయాలన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వ్యాఖ్యలు పెను దుమారాన్నే రాజేశాయి. కొంతమంది కంపెనీల ప్రతినిధులు, నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పించగా, పలువురు ఐటీ దిగ్గజాలు ఇన్ఫీ మూర్తికి మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ప్రధానంగా ఇండస్ట్రీలో మహిళా ఉద్యోగులపై వివక్షపై ఎక్కువ చర్చ నడిచింది. ఇంటా బయటా మహిళా ఉద్యోగుల పనిగంటలు, వారికి లభిస్తున్న గుర్తింపు, అందుతున్న వేతనం తదితర విషయాలు చర్చనీయాంశమైనాయి. ఈ నేపథ్యంలోనే ఇంటర్నెట్లో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. ఇన్ఫీ ‘సిస్’ పేరుతో వైరల్ అవుతున్న ఈ వీడియోను వ్యాపారవేత్త హర్ష గోయెంకా ఎక్స్(ట్విటర్)లో షేర్ చేశారు. 70-80-90 గంటలు పనిచేస్తున్నారు గృహిణులు దగ్గర మొదలు పెట్టి.. నారాయణ ..నారాయణ.. అంటూ ఇన్ఫో ‘సిస్’ మీకు ఇన్ఫో ఇస్తోంది బ్రో.. అంటూ తనదైన యాక్సెంట్‌తో సాగిన ఈ వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. ఈ హిలేరియస్ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. వావ్.. నిజం చెప్పారు. గృహిణులు 70 నుండి 80 గంటలు పని చేస్తారు.. లవ్ యూ ఫర్ అండర్ స్టాండింగ్ .. ఇన్ఫో ‘సిస్’ అని ఒక యూజర్ కమెంట్ చేశారు. ఇది నూటికి నూరు శాతం, ఈ వీడియోను ఇన్ఫీ మూర్తి అంకుల్ చూడాలి అని మరొకరు వ్యాఖ్యానించడం విశేషం Info sis giving you info on 70 hour week! 😂😂 pic.twitter.com/rh6Jw1n2TD — Harsh Goenka (@hvgoenka) November 6, 2023 -
HYD: పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ !
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. పోలీస్ వాహనంతో.. అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇద్దరు పోలీస్ అధికారులు షూట్లో పాల్గొన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పుడు. ఎస్సై భావనతో ఏఆర్ ఎస్సై రావూరి కిషోర్ వివాహం ఆగష్టు 26వ తేదీన జరిగింది. అయితే.. వివాహానికి ముందు ఈ జంట వెడ్డింగ్ షూట్ నిర్వహించింది. రకరకాల లొకేషన్లో షూట్లో పాల్గొంది ఆ టైంలో ఆ కాబోయే జంట. అంత వరకు పర్వాలేదు. అయితే షూట్ ఆరంభంలోనే.. మూడు సింహాలను చూపించి, ఇద్దరూ సినిమా లెవల్లో వాహనాల నుంచి కిందకు దిగి.. పీఎస్ బయట షూట్లో పాల్గొన్నారు. దీంతో యూనిఫాంలో అదీ పోలీస్ వాహనంతో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై విమర్శలు మొదలయ్యాయి. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దీనిపై ఉన్నతాధికారుల స్పందన తెలియాల్సి ఉంది. -
కాలం కలిసి వస్తే డంప్‌యార్డ్ కూడా నందనవనం అవుతుంది!
కాలం కలిసే వస్తే... కంపు కొట్టే డంపు యార్డ్ కూడా కనుల విందు చేసే పార్క్ అవుతుంది. రాజస్థాన్‌లోని రాజ్‌గఢ్‌లో ఒక డంప్ యార్డ్ ఉండేది. దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల నుంచి నడిచి వెళ్లాలంటే జనాలు జడుసుకునేవారు. అలాంటి చోటుకు ఇప్పుడు జనాలు వెదుక్కుంటు వస్తున్నారు. దీనికి కారణం ఈ డంప్‌యార్డ్‌ను మున్సిపాలిటీ సిబ్బంది అందమైన పార్క్‌గా తయారుచేయడమే. వాటర్ ఫౌంటెన్లు, పచ్చటి గడ్డితో ఈ పార్క్ కనువిందు చేస్తోంది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సవిత దావియా ఈ క్లిప్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. ‘ఎన్నో పట్టణాలలో ఎన్నో డంప్‌యార్డ్‌లు భయపెడుతున్నాయి. అవి కూడా ఇలాగే నందనవనంలా మారితే ఎంత బాగుంటుంది’ అంటూ ఒక ఎక్స్ యూజర్ స్పందించాడు. A former dumpyard converted to this public park on Municipality land by #ForestDept #Churu in 3 months#Motivation - Kids like mine hv a place to go, staff learnt new skill, dept got recognition & a public asset created 🌿#urban #Forestry@ParveenKaswan@RajGovOfficial pic.twitter.com/SG0OVigORS — God's Favourite Child (@Savi_IFS) September 7, 2023 (చదవండి: బహుముఖ ప్రజ్ఞాశాలి! ఒకటి రెండు కాదు!.. ఏకంగా 34 సబ్జెక్టుల్లో టాపర్) -
ఈ ఇల్లు చూస్తే నిజంగా అదృష్టవంతులం అనుకుంటారు! ఎందుకంటే..
Tiny 1 BHK Flat In Mumbai: భారతదేశంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబయి (Mumbai) అగ్రస్థానంలో ఉంది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో ఇళ్లు చాలా ఖరీదైనదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ ఇల్లు కొన్నాలన్నా, అద్దెకు తీసుకోవాలన్నా చాలా కష్టం. అందుకే ఇక్కడ ప్రజలు అత్యంత ఇరుకు అపార్ట్మెంట్లలో నివసిస్తుంటారు. ఇటీవల ఒక ఇన్స్టాగ్రామ్ (Instagram) యూజర్ ముంబైలోని వన్ బీహెచ్‌కే (1 BHK) ఫ్లాట్ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన యూజర్లు.. ఇదెక్కడి ఇల్లురా బాబూ.. అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి ఇంట్లో ఉండనందుకు నిజంగా చాలా అదృష్టమంతులమంటూ కామెంట్లు చేస్తున్నారు. సుమిత్ పాల్వే అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ హౌస్ టూర్ వీడియోను షేర్ చేశాడు. ఇది సౌత్ బాంబే కాబట్టి ఇరుకు ఇళ్లకు రాజీ పడాల్సిందే అంటూ ఆ వీడియో ప్రారంభంలోనే పేర్కొన్నాడు. అత్యంత చిన్నది, ఇరుకైనది అయిన ఆ ఇంటిని చూపించడానికి చాలా కష్టపడ్డాడు ఆ యువకుడు. అత్యంత ఖరీదైన దక్షిణ ముంబైలో రూ. 2.5 కోట్లు పెట్టి కొనే అపార్ట్మెంట్లు కూడా ఇలాగే ఇరుగ్గా ఉంటాయని, రాజీ పడక తప్పదని వివరించాడు. View this post on Instagram A post shared by SUMIT PALVE (@me_palve) -
ఐఫోన్ కావాలంటే కొనుక్కోవాలికానీ కొరికితే ఎలా? వింత చోరీ వీడియో వైరల్!
iPhone theft: యాపిల్ ఐఫోన్ (Apple iPhone)15 త్వరలో లాంచ్ కాబోతోంది. యమా క్రేజ్ ఉండే ఐఫోన్లు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. అయితే ఇది అప్డేట్లకు సంబంధించినది కాదు.. ఐఫోన్ చోరీకి సంబంధించినది. ఖరీదైన ఐఫోన్ల చోరీల గురించి తరచూ వింటుంటాం. ఈమధ్య ఈ ఫోన్ల దొంగతనాలు సృజనాత్మకంగా మారాయి. అలాంటిదే చైనాలో ఒకటి తాజాగా జరిగింది. ఆ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. చైనాలోని ఓ యాపిల్ స్టోర్‌లో సుమారు రూ. 80,000 విలువ చేసే ఐఫోన్ 14 ఫ్లస్ (iPhone 14 Plus)ని చాకచక్యంగా దొంగిలించింది ఓ మహిళ. స్టోర్‌లో డిస్ప్లేకు ఉంచిన ఫోన్‌ను యాంటీ-థెఫ్ట్ కేబుల్‌ను కొరికేసి తన బ్యాగులో వేసుకుంది. అలారం స్టోర్ సిబ్బంది గుర్తించలేకపోయారు. చోరీ జరిగిన అరగంట తర్వాత చూసుకున్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆ మహిళను అరెస్ట్ చేశారు. VIDEO: MUJER SE ROBA UN IPHONE A MORDIDAS Una cámara de seguridad captó el momento en que mujer roba un #iPhone de exhibición a mordidas en una Apple Store en #China. En las imágenes se puede apreciar a la fémina acercándose de manera disimulada a la mesa donde se encontraban… pic.twitter.com/eC7E6poeUy — El Dato Noticias Morelos (@eldatomx) September 2, 2023 -
మెట్రోలో జిమ్నాస్టిక్ స్టైల్లో యువతి స్టంట్స్.. వీడియో వైరల్..
నగరాల్లో వేగంగా, సురక్షితంగా ప్రయాణించడానికి మెట్రో ప్రయాణం సులభతరం. అలాంటి మెట్రోలో డ్యాన్సులు చేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్న వీడియోలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి మెట్రోలో ఏదో ఒక విచిత్రమైన పని చేసి వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. మెట్రో ప్రయాణీకులతో రద్దీగా ఉంది. కొందరు ప్రయాణీకులు నిలబడి ఉన్నారు. అందరూ చూస్తుండగానే ఓ యువతి జిమ్నాస్టిక్ స్టైల్లో స్టంట్స్ చేసింది. ఎంతో నైపుణ్యం కలిగినట్లుగా చాకచక్యంగా ప్రదర్శన ఇచ్చింది. ఈ దృశ్యాలను చూస్తున్న ప్రయాణికులు కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయారు. యువతి ప్రదర్శన చేస్తుండగా.. మరో వ్యక్తి ఫొన్లో ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడు. View this post on Instagram A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_) ఈ వీడియోను మిశా శర్మా అనే యూజర్ తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. ఇది కాస్త వైరల్ అయింది. 5.2 లక్షల వ్యూస్ వచ్చాయి. 45 వేల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోలోని ఘటన ఎక్కడ జరిగిందని పలువురు నెటిజన్లు ప్రశ్నలు వేయగా.. ఓ వ్యక్తి రాజస్థాన్ అని తెలపారు. దీనిపై మరో యూజర్ స్పందిస్తూ.. బెంగళూరులో జరిగిందని వెల్లడించారు. ఆ వీడియో తీసే క్రమంలో తాను మెట్రోలోనే ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇండియా తరుపన ఆడితే మెడల్ తేవొచ్చు.. ఇక్కడ చేస్తూ టైం వేస్టు చేయొద్దని మరో వ్యక్తి కామెంట్ పెట్టాడు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీ బైక్ రైడ్.. ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రులు.. -
ఇదేందిది.. ఒక్క బైక్‌పై ఏడుగురా?.. ఆఖరోడు అలా కూర్చున్నాడేంటి?
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ లేక్కలేనన్ని చర్యలు చేపడుతోంది. అయినా కొందరు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలను ఇష్టమొచ్చినట్లు నడుపుతున్నారు. తాజగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. ఈ బైక్‌పై ఒకరో, ఇద్దరో కాదు ఏకంగా ఏగుగురు కుర్రాళ్లు రయ్యిమని దూసుకుపోతున్నారు. పైగా వారు తామేదో ఘనకార్యం చేశామన్నట్టు ఫీలవుతున్నారు. ఈ వీడియో యూపీలోని హాపూర్‌కు చెందినదని తెలుస్తోంది. ఏడుగురు కుర్రాళ్లు నిర్భయంగా బైక్‌పై కూర్చుని ప్రయాణించడాన్ని వీడియోలో చూడవచ్చు. వారిలో చివరనున్న కుర్రాడు ముందునున్న కుర్రాడిపై ఎక్కి కూర్చున్నాడు. 22 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో బైక్‌పై కూర్చున్న కుర్రాళ్ల తీరు చూస్తే ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. అయితే ఆ బైక్‌పై ఉన్నవారితో కించిత్తు ఆందోళన కూడా లేకపోవడం విశేషం. ఈ వీడియోను చూసినవారంతా ఆ కుర్రాళ్లపై పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను @Akshara117 అనే ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇది కూడా చదవండి: పంద్రాగస్టుకు ఇంటికి మువ్వన్నెల జెండా.. ఫ్రీ డెలివరీ.. బుకింగ్ ఇలా.. Video of 7 people riding a bike in #Hapur goes viral, raising questions on the working style of Hapur police. #Viralvideo pic.twitter.com/wfMfjkOkdF — Akshara (@Akshara117) August 9, 2023 -
మణిపూర్ హింస.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బాధిత మహిళలు
ఇంఫాల్: మణిపూర్‌లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయబద్ధమైన, నిష్పక్షపాత ధోరణిలో విచారణ జరిపించాలని అభ్యర్ధించారు. మణిపూర్ అల్లర్లు మొదలైన మరుసటి రోజున ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వలసపోతున్న ఇద్దరు మహిళలను మొదట వివస్త్రులను చేసి తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన జరిగి రెండు నెలలు దాటినా కూడా వీడియో బయటకు వచ్చేంతవరకు దర్యాప్తు ప్రారంభం కాకపోవడమే అనేక అనుమానాలకు తావిస్తోంది. సుప్రీంకోర్టు కూడా వీడియో విషయంపై చాలా సీరియస్ అయ్యింది. ఇది పూర్తిగా రాజ్యాంగ వైఫల్యమేనని జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మణిపూర్ సంఘటన తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మీకు చేతకాకపోతే చెప్పండి మేమే రంగంలోకి దిగుతామని హెచ్చరించింది కూడా. రాష్ట్రంలో మహిళల భద్రత విషయమై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పటికప్పుడు అక్కడి పురోగతి గురించి తమకు తెలపాలని కూడా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిపి మణిపూర్ వీడియో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును కోరగా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు మణిపూర్ పోలీసులు. ఇదిలా ఉండగా నగ్నంగా ఊరేగించబడిన మహిళలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఇది కూడా చదవండి: కేరళలో దారుణం.. ఐదేళ్ల బాలిక రేప్, హత్య.. -
రద్దీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న డ్రైవర్‌లెస్ కారు.. నెటిజన్లు ఫిదా..!
బెంగళూరు: బెంగళూరు రోడ్లపై డ్రైవర్ లేకుండా నడుస్తున్న ఓ వింత ఆకారంలో ఉన్న వాహనం స్థానికుల్నిఆశ్చర్యానికి గురిచేసింది. ఇదేదో బాలీవుడ్ మూవీలో కారు ఆకారంలో ఉన్న వాహనంలా ఉందని ఓ యూజర్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ బెంగళూరు అనే క్యాప్షన్‌ను జతచేసి పోస్టు చేశాడు. ఈ కారును చూసిన నెటిజన్లు ఇదేంటీ ఇలా ఉందని? ప్రశ్నించారు. డ్రైవర్ లేకుండా ఎలా ఇంత ట్రాఫిక్‌లో నడుస్తోందని ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కారుని జీప్యాడ్ అని అంటారని ఓ యూజర్ క్లారిటీ ఇచ్చాడు. సెల్ఫ్ డ్రైవింగ్ కారుని మైనస్ జీరో అనే అంకుర సంస్థ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని మైనస్ జీరో సంస్థ తన ఇన్‌స్టా పేజీలో వివరంగా పేర్కొంది. ఇప్పటికే రెండు సార్లు ఈ వాహనం రోడ్లపై కనిపించిందని బెంగుళూరు వాసులు తెలిపారు. టెస్టింగ్‌లో భాగంగానే ఇలా రోడ్లపై కారు ప్రత్యక్షమైనట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి అటానమస్ వాహనం. On the streets of Bengaluru. @peakbengaluru pic.twitter.com/VtahXpa6Mh — anirudh ravishankar (@anrdh89) July 22, 2023 అయితే.. సంప్రదాయ కార్లకు భిన్నంగా ఉండే ఈ జీప్యాడ్కు స్టీరింగ్ ఉండదు. హై రిజల్యూషన్ కెమెరాలతో ట్రాఫిక్‌లోనూ నడుస్తోంది. ఈ కారులో మొత్తం 6 కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో చుట్టూరా ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేస్తుంది. ప్రమాదం అనిపిస్తే వెంటనే వాహనం నిలిచిపోతుంది. ట్రాఫిక్ సమస్యను, రోడ్డు ప్రమాదాలను తగ్గించటంలో భాగంగానే దీన్ని తీసుకొచ్చినట్లు మైనస్ జీరో తెలిపింది. ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..? -
Viral Video: ఆంటీలు ముచ్చట్లు పెడితే అట్లుంటది మరి..
Viral Video: హోరువాన కురుస్తుంటే వెంటనే ఏ చెట్టు కిందకో గూడు కిందకో పరిగెడతాం. కానీ ఇక్కడో కాలనీలోని మహిళలు జోరుగా వాన పడుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా తీరికగా కబుర్లు చెబుతూ కనిపంచారు. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయడంతో నిముషాల్లో వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా హోరువానలు జోరుగా కురుస్తున్నాయి. ఎక్కడపెడితే అక్కడ వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలైతే వర్షం ఉధృతికి చెల్లాచెదురయ్యాయి. ఒకపక్క దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు నెలకొంటూ ఉంటే.. ఓ కాలనీలోని అపార్ట్మెంట్ వారు మాత్రం ఈ వర్షాలు మనల్నేమి చేస్తాయిలే వదినా..? అంటూ సీరియల్ కబుర్లు చెప్పుకుంటూ వర్షంలో ఒళ్ళు మర్చిపోయి తడుస్తూ కనిపించారు. సాధారణంగా ఆడవాళ్ళ గుంపు ఒకచోట చేరిందంటే ఆ ముచ్చట అంత తొందరగా తేలదని అంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని చూస్తే అది నిజమేనేమో అనిపించక మానదు. వీడియోలో ముగ్గురు ఆడవాళ్లు కింద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే.. ఇద్దరు మాత్రం వెనుక బెంచి మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు.. ఒక చిన్న పిల్లాడైతే చెంగు చెంగున దూకుతూ అక్కడే ఆడుకుంటున్నాడు. Tez baarish bhi iss prakar ke data transfer ko nahi rok sakti 👏pic.twitter.com/r3kaGXxwx2 — SwatKat💃 (@swatic12) July 20, 2023 ఇది కూడా చదవండి: అది ఒకప్పటి వీడియో, రాజీనామా చేసేది లేదు.. -
2015లో తన నటనతో కన్నీళ్లు తెప్పించిన ఈ చిన్నది గుర్తుందా..?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయిజాన్’ అప్పట్లో పెద్ద సంచలనం. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించగా కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. 2015లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు బాక్సాఫీసునూ కొల్లగొట్టింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ మూగ, చెవిటి చిన్నారిని.. కన్నవారి వద్దకు చేర్చేందుకు ఓ భారతీయ యువకుడు (సల్మాన్ ఖాన్) ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా కథ. (ఇదీ చదవండి: 'గుంటూరు కారం'లో హాట్ బ్యూటీ.. బిగ్ అప్డేట్ రివీల్ చేసేసింది) ఇందులో మూగ,చెవిటి చిన్నారి పాత్రలో హర్షాలీ మల్హోత్రా (మున్నీ)గా మెప్పించింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే. కానీ అందులో సల్మాన్‌తో పోటీగా నటించి మెప్పించింది. తన అమాయకమైన ముఖంతో ప్రేక్షకులకు కన్నీరు తెప్పించిన ఆమెను అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. ఆ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా హర్షాలీ నామినేట్ అయింది. అప్పట్లో తనకు సుమారు రూ. 3 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్. తాజాగా ఆమె ఇప్పుడెలా ఉందో తెలుపుతూ ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత తను ఎలాంటి సినిమాల్లో మళ్లీ నటించలేదు. ప్రస్తుతం చదువుకుంటూ సంగీతం నేర్చుకుంటుంది. కానీ సల్మాన్‌తో మాత్రం ఇప్పటికీ టచ్‌లోనే ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది. తను సంగీతం నేర్చుకునేందుకు వెళ్తుండగా కొందరు ఫోటో గ్రాఫర్లు హర్షాలీ మల్హోత్రాను కెమెరాలతో క్లిక్ మనిపించారు. ఆ ఫోటోనే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) (ఇదీ చదవండి: బిగ్‌బాస్‌లోకి ఈ జంట ఎంట్రీ ఖాయం.. వాళ్లకు బిగ్ సపోర్ట్ ఎవరో తెలిస్తే) -
నటి 'వామిక గబ్బి' కారు కొనేసిందోచ్.. ధర ఎన్ని లక్షలంటే?
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో భాగంగానే పంజాబీ, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో నటించిన 'వామిక గబ్బి' (Wamiqa Gabbi) ఇటీవల అమెరికన్ బ్రాండ్ కారుని కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. భలే మంచి రోజు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన వామిక ఎక్కువగా పంజాబీ సినిమాల్లో కనిపించింది. దీంతో బహుశా తెలుగు ప్రేక్షకులకు ఈమె గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కాగా ఈ భామ ఇటీవల కొనుగోలు చేసిన కారు జీప్ కంపెనీకి చెందిన మెరిడియన్. దీని ధర రూ. 40 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. జీప్ మెరిడియన్ డెలివరీ తీసుకునే సమయంలో వామిక ముంబైలోని కంపెనీ డీలర్‌షిప్‌లో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇదే ఆమె మొదటి కారు కావడం ఇక్కడ విశేషం. వీడియో పోస్ట్ చేస్తూ నా తల్లితండ్రులు సహకారంతో.. అభిమానుల ఆదరాభిమానాలతో ఇది సాధ్యమైందని వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆ ప్రదేశం చూడగానే ఆకర్షిస్తుంది.. ఒక రాత్రి అక్కడ ఉండగలనా అంటే!) జీప్ మెరిడియన్.. ఇక జీప్ మెరిడియన్ విషయానికి వస్తే.. వామికా కొనుగోలు చేసిన కారు వెల్వెట్ రెడ్ షేడ్‌లో చూడచక్కగా ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ SUV అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందగలిగింది. ఇది దేశీయ మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఇది అద్భుతమైన ఫీచర్స్ కలిగి.. ఫ్లోటింగ్-టైప్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: 11 ఏళ్లకే హల్దిరామ్స్ ఆలోచన.. ప్రపంచ స్నాక్స్ రంగాన్నే షేక్ చేసిన ఇండియన్!) ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ 170 హార్స్ పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 32.95 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఎంచుకునే వేరియంట్ ఆధారంగా ధరలు మారుతాయి. వామిక ఏ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలియాల్సి ఉంది. View this post on Instagram A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi) -
సీబీఐ స్కెచ్.. వలలో చిక్కిన హెడ్ కానిస్టేబుల్..
ఢిల్లీ: ఢిల్లీలో లంచం తీసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్(సీబీఐ) బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఓ దుకాణాదారుడి వద్ద రూ.50,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. దేశ రాజధానిలోని మొగలిపురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. #WATCH | CCTV footage of CBI raid under Mangolpuri Police Station area in Delhi on 10th July where one of the accused Head Constable Bheem Singh was seen attempting to flee, but he was caught. CBI has registered FIR against two head constables in a bribery case. (Source: CCTV… pic.twitter.com/qeoka3n40t — ANI (@ANI) July 12, 2023 మొగలిపురా ప్రాంతంలో బీమ్ సింగ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఓ దుకాణాదారుని షాప్ ముందు పార్కింగ్ అంశంలో డబ్బులు డిమాండ్ చేశాడు. రూ.50,000 ఇవ్వాలని ఆ షాప్‌కీపర్‌పై ఒత్తిడి పెంచాడు. విసిగిపోయిన దుకాణాదారుడు సీబీఐ అధికారులకు సమాచారం అందించాడు. ఫిర్యాదును స్వీకరించిన అధికారులు.. వ్యూహం ప్రకారం రంగంలోకి దిగారు. పథకం ప్రకారం డబ్బులు ఇస్తానని నమ్మించి ఆ షాప్ కీపర్ పోలీస్ కానిస్టేబుల్‌ను దుకాణం ముందుకు రప్పించాడు. అక్కడా కాపుగాసిన అధికారులను గమనించిన కానిస్టేబుల్ దుకాణదారుని నుంచి లంచం తీసుకోబోయాడు. వెంటనే అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా బీమ్ సింగ్‌ను పట్టుకున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో నెట్టింట ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇదీ చదవండి: బొట్టు పెట్టుకుని స్కూల్‌కు వచ్చిందని కొట్టడంతో బాలిక ఆత్మహత్య -
లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్
చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ కొత్త యాడ్ ఇంటర్నెట్లోసందడి చేస్తోంది. విశ్వనాథన్ ఆనంద్ నటించిన అమెరికా ఫాస్ట్ ఫుడ్ చెయిన్ సబ్వే కొత్త యాడ్ వైరల్ నెటిజన్లు మనసు దోచుకుంది. సబ్వేలో ఆన్లైన్ ఆర్డర్ల గందరగోళానికి చెక్ చెబుతున్నట్టుగా ఉన్న ఆర్డరింగ్ మేడ్ సూపర్ సింపుల్ అంటున్న ఈ యాడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది. (రిలయన్స్ క్యాపిటల్‌పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్) సబ్వే అవుట్‌లెట్‌లో గ్రాండ్‌మాస్టర్ ఆర్డర్ చేయడం, దానికి సంబంధించిన రొట్టె రకం, ఫిల్లింగ్‌లో ఉపయోగించాల్సిన కూరగాయలు సాస్‌లు మసాలా దినుసులపై సిబ్బంది ప్రశ్నలతో ఆనంద్కి చెమటలు పట్టేస్తాయి. చెస్‌లో పావులను అలవోకగా కదిపి అనేక విజయాలను సాధించిన ఆనంద్ ఆలోచనలో పడిపోతాడు. ఒక జీనియస్ కూడా సబ్ ఆర్డర్ చేయడం కష్టమే అన్న ట్యాగ్‌లైన్‌తో 30 సెకన్ల వీడియో లక్షల కొద్దీ వ్యూస్‌ను, రీట్వీట్లను సాధించింది. చక్కటి స్క్రిప్ట్‌తో, ఆనంద్ నటనతో భలే ఉందని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అంతేకాదు కొన్ని సమయాల్లో మా పరిస్థితి కూడా అంతే అంటూ హిల్లేరియస్ కమెంట్స్ చేశారు. గత ఆరేడు నెలలుగా నిశ్శబ్దంగా ఉన్నాము. ఎందుకంటే ఆ సమయంలో మెనూని మార్చాము. అలాగే దేశవ్యాప్తంగా చాలా స్టోర్లను కూడా తెరుస్తున్నాం. ఇది మెట్రో నగరాల్లోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరిస్తున్నారు. దాదాపు ప్రతిరోజూ దుకాణాన్ని తెరుస్తాం. లేదా కొనుగోలు చేస్తున్నామని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మయూర్ హోలా వివరించారు. ఏమైనా తినాలి అనిపించ గానే..ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఆస్వాదించడం చాలా సాధారణంగా మారిపోయింది ఇపుడు. అయితే సబ్వేలో ఫుడ్ ఆర్డర్ చేయడం అంటే అదో గందరగోళం అనే ఫిర్యాదులు చాలా ఉన్నాయి. ఈ విషయాన్నే మెన్షన్ చేస్తూనే సబ్వే శాండ్‌విచ్‌ని ఆర్డర్ చేయడం ఇపుడు చాలా సులువును అని తాజా యాడ్ లో పేర్కొంది. Admin paneer sub khaane gaya tha 😅 pic.twitter.com/4BqLUX3LdU — Viswanathan Anand (@vishy64theking) July 10, 2023 -
తమన్నాకు పోటీగా క్యూట్ బేబీ.. స్టెప్పులతో అదరగొట్టేసింది!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చిరంజీవి సరసన భోళాశంకర్, మరోవైపు తమిళ స్టార్ రజనీకాంత్ జంటగా జైలర్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నువ్వు 'కావాలా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అయితే ఈ సాంగ్‌లో తమన్నా తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చూసిన ఓ చిన్నారి స్టెప్పులతో అదరగొట్టింది. టీవీలో సాంగ్ చూస్తూ స్టెప్పులకు తగినట్లుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా.. తమన్నా సైతం అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ క్యూట్ బేబీ కూడా పోటీకీ వస్తుందని ఊహించలేదంటూ ఆ ట్వీట్ రిప్లై కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ఇది చూసిన కొందరు సినీ ప్రియులు చిన్నారిని అభినందిస్తున్నారు. కాగా.. తమన్నా, రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్టు నెలలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) Competition has never looked this cute 😍😍😍 https://t.co/UO4Xm2PJFK — Tamannaah Bhatia (@tamannaahspeaks) July 8, 2023 -
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
మెట్రోలో యువకుని చెంప చెల్లుమనిపించిన యువతి.. వీడియో వైరల్..
ఢిల్లీ: ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. మెట్రోలో ప్రయాణికులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. వారి చర్యలు మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నప్పటికీ.. పట్టించుకోకుండా హద్దులు మీరుతున్నారు. కొద్ది రోజుల క్రితమే మెట్రోలో ఇద్దరు యువకులు కొట్టుకున్న ఘటన అనంతరం ప్రస్తుతం మరో ఘటన వెలుగులోకి వచ్చింది. మెట్రోలో ఓ యువతి ఓ యువకున్ని చెంప చెల్లుమనిపించింది. ఏమైందో తెలియదు.. కానీ యువకున్ని బండ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. మిగిలిన ప్రయాణికులు వారికి దూరంగా ఉండి చూస్తూ ఉండి పోయారు. Kalesh b/w a guy and a Girl Inside “Delhi Metro) - Girl slaps him too hard just think if it was vice-versa😀 pic.twitter.com/Y0RiKeYWem — Ghar Ke Kalesh (@gharkekalesh) July 3, 2023 మెట్రోలో ప్రయాణికులందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలో ఓ యువతి అక్కడికి వచ్చింది. పక్కనే ఉన్న ఓ యువకుని వైపు దూసుకొచ్చి... అతని చెంప చెల్లుమనిపించింది. బూతులు తిడుతూ మరల యువకునిపై దాడి చేసింది. ఈ ఘటనలో యువకుడు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయింది. ఇదంతా చూస్తున్న జనాలు వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఇద్దరి మధ్య వ్యక్తిగత గొడవలా భావించి దూరంగా ఉండిపోయారు. ఈ దృశ్యాలను ఓ ప్రయాణికుడు వీడియో తీసి పోస్టు చేశాడు. ఇది కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. వ్యూయర్స్ రకరకాలుగా స్పందించారు. వారిద్దరి మధ్యలోకి చొరవ తీసుకోనందుకు తోటి ప్రయాణికులకు కొందరు ధన్యవాదాలు తెలిపారు. మెట్రోలో ఇలా ప్రవర్తిస్తే అందరికి ఇబ్బంది కలగదా? అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదీ చదవండి: ఆ మేక.. అతన్ని కంటితోనే చంపేసింది..! -
'గుడ్లను తాకితే తాటతీస్తా..!' జూ కీపర్‌పై కొండ చిలువ వీరంగం..
ఏ జంతువులోనైనా అమ్మతనం అసామాన్యమైనది. పిల్లలను రక్షించుకోవడానికి ఎంతకైన తెగిస్తుంది తల్లి. సాధారణంగా మన ఇళ్లలో ఉండే కోడిని చూడండి.. దాని పిల్లల వైపు వచ్చిన ఏ జంతువునైనా ప్రాణాలకు తెగించి కొట్లాడుతుంది. అదీ అమ్మలోని గొప్పతనం. తాజాగా ఓ కొండ చిలువ తన గుడ్లను తీసుకోవడానికి వచ్చిన జూకీపర్‌పై విరుచుకుపడింది. అతను ఎన్నిసార్లు ప్రయత్నించినా.. గుడ్లను మాత్రం ముట్టుకోనీయలేదు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. View this post on Instagram A post shared by Jay Brewer (@jayprehistoricpets) ఓ పైథాన్ అందమైన గుడ్లను పెట్టింది. అవి భారీ సైజులో ఉన్నాయి. ఓ కుప్పగా ఉన్న తన గుడ్ల చుట్టూ చుట్టకుని ఆ కొండ చిలువ పడుకుని ఉంది. జూ కీపర్ జాయ్ బ్రూవర్ అది పడుకున్న రూమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. పైథాన్‌ను ఆటపట్టించాలనుకుంటాడు. అనంతరం ఆ గుడ్లలోంచి ఓ గుడ్డును తీసుకునే ప్రయత్నం చేస్తాడు. వెంటనే ఆ కొండ చిలువ బ్రూవర్‌ను కరవడానికి వస్తుంది. అతను ఎన్ని సార్లు ప్రయత్నించినా.. పైథాన్ మాత్రం గుడ్లను ముట్టుకోనీయదు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. నెటిజన్లు భారీగా స్పందించారు. అమ్మతనంలోని గొప్పతనాన్ని కొనియాడారు. పైథాన్‌కు గుడ్లపై ఉన్న ప్రేమను కొనియాడుతూ కామెంట్లు పెట్టారు. అదీ.. అమ్మంటే అంటూ అని మరికొందరు స్పందించారు. ఇదీ చదవండి: ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి.. షాకింగ్ వీడియో -
రక్తం కారుతున్నా లెక్క చేయకుండా విమానాన్ని నడిపిన పైలెట్
ఈక్వెడార్: లాస్ రోస్ ప్రాంతంలో ఓ విమానం పైలెట్ కు వింత అనుభవం ఎదురైంది. విధి నిర్వహణలో విమానాన్ని నడుపుతున్న పైలెట్ కాక్ పిట్ లోకి ఒక పెద్ద పక్షి విండ్ షీల్డుని పగులగొట్టుకుని పొరపాటున లోపలి వచ్చింది. కాక్ పిట్ లో ఇరుక్కున్న ఆ పక్షి తన కాళ్లతో పొడుస్తున్నా, మొహమంతా రక్తం కారుతున్నా ఏమాత్రం లెక్కచేయని పైలెట్ అలాగే విమానాన్ని నడిపాడు. మొహమంతా రక్తం.. లాస్ రోస్ ప్రాంతంలో ఆకాశంలో సుమారు 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న ఒక విమానం పైలెట్ క్యాబిన్లోకి భారీ పక్షి ఒకటి విండ్ షీల్డ్ ను బద్దలుగొట్టుకుని మరీ లోపలికి చొచ్చుకుని వచ్చింది. అద్దంలో ఇరుక్కుపోయిన ఆ పక్షి సగభాగం లోపల వేలాడుతూ ప్రాణాలు కాపాడుకోవటానికి విశ్వప్రయత్నాలు చేసి చివరికి రక్తమోడుతూ గాల్లోనే ప్రాణాలు విడిచింది. దీంతో పైలెట్ ఏరియల్ వాలియంట్ రక్తమోడుతున్న తన ముఖాన్ని, కాక్ పిట్ లోకి వచ్చిన ఆ భారీ పక్షిని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. రాబందు జాతి పక్షి.. అంత ఎత్తులో ఎగిరే ఈ పక్షిని ఆండియాన్ కాండోర్ పక్షిగా గుర్తించారు. ఇది దక్షిణ అమెరికా కాథర్టిడ్ రాబందు జాతికి చెందినదని గుర్తించారు. దీని రెక్కలు సుమారుగా పది అడుగుల వెడల్పు ఉంటాయని ఇవి భూమికి 21 వేల అడుగుల ఎత్తులో ఎగురుతుంటాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. Pilot safely lands his plane after a huge bird struck his windshield in the Los Ríos Province, Ecuador. Ariel Valiente was not injured during the incident. pic.twitter.com/Rl3Esonmtp — Breaking Aviation News & Videos (@aviationbrk) June 15, 2023 ఇది కూడా చదవండి: ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట! -
వైరల్ వీడియో: పెళ్లిలో ట్విస్ట్ ఇచ్చిన వరుడు.. చెట్టుకు కట్టేసి..
ప్రతాప్‌గఢ్: కాసేపట్లో వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యేవారు. ఇంతలో వరుడి మదిలో మెదిలిన ఓ ఆలోచనే అతడిని చిక్కుల్లో పడేసింది. దీంతో, వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులందరూ బందీలు మారారు. వరుడిని చెట్టుకి కాట్టేశారు వధువు తరఫు బంధువులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ప్రతాప్‌గఢ్‌లోని మంధాతా కొత్వాలి ప్రాంతానికి చెందిన ఇద్దరికి వివాహం నిశ్చయించారు ఇరు కుటుంబా సభ్యులు. దీంతో, పెళ్లి వేడుక ప్రారంభమైంది. వరుడు ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వేడుకకు బంధువులంతా తరలివచ్చారు. కొద్ది క్షణాల్లో వధువు మెడలో జయమాల వేసే సమయం ఆసన్నమైంది. అంతలోనే పెళ్లి కొడుకు అదనపు కట్నం డిమాండ్ చేశాడు. దీంతో, వధువు కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం, అదనపు కట్నం విషయంలో ఎంతసేపు వరుడికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నాడు. వరుడి కుటుంబ సభ్యులు కూడా అతడివైపు మొగ్గుచూపారు. దీంతో, విసుగెత్తిన వధువు కుటుంబ సభ్యులు.. ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. వరుడితో సహా అతడి కుటుంబ సభ్యులను చెట్టుకు కట్టేశారు. అనంతరం, వరుడిని చితకబాదారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాల సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు వరుడు మద్యం మత్తులో కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని వధువు తరఫు వారు ఆరోపిస్తున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. इस लइका का जयमाल हो गया था .. उसके बाद परिजन दहेज की डिमांड करने लगे। जिसके बाद लड़की के परिजन ने दूल्हे साहेब को पेड़ से बांध दिया। वीडियो यूपी के प्रतापगढ़ से है ।। pic.twitter.com/obOG9BpLMB — हम लोग We The People (@ajaychauhan41) June 15, 2023 ఇది కూడా చదవండి: చిన్న వర్షానికే వందే భారత్ రైలులో వర్షపు నీరు లీక్.. వీడియో వైరల్ -
హీరో షారుక్ ఖాన్‌కి చేదు అనుభవం.. ఆమె అలా చేసేసరికి!
మీ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ కనిపిస్తే ఏం చేస్తారు? మహా అయితే సెల్ఫీ దిగుతారు. కుదరకపోతే దురం నుంచే ఫొటో తీసుకుని సంతోషపడతారు. కానీ ఓ మహిళా అభిమాని మాత్రం అంతకు మించి అనేలా ప్రవర్తించింది. దీంతో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కు చేదు అనుభవం ఎదురైంది. ఇంతకీ ఎప్పుడు ఏం జరిగిందో తెలుసా? హిందీలో ఇప్పుడు చాలామంది హీరోలున్నారు. కానీ 90స్ జనరేషన్ నుంచి ఇప్పటివరకు అందరినీ కవర్ చేసిన హీరో అంటే మాత్రం షారుక్ ఖాన్ గుర్తొస్తాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలతో హిట్స్ కొట్టిన షారుక్.. గత కొన్నేళ్లుగా వరసగా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది మాత్రం 'పఠాన్' తో వేరే లెవల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం రెండు కొత్త మూవీస్ చేస్తూ బిజీ. ఈ మధ్య సోషల్ మీడియాలోనూ యాక్టివ్ అయిన షారుక్.. రీసెంట్ గా దుబాయిలోని ఓ ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా ఈవెంట్ కి సంబంధించిన వాళ్లతో పాటు కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో ఒకామె షారుక్ ని చూసి ఆత్రం ఆపుకోలేకపోయింది. పర్మిషన్ లేకుండానే అతడి బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టేసింది. తెగ ఆనందపడిపోయింది. కొందరు నెటిజన్స్ ఇదంతా చూసి.. అనుమతి లేకుండా ఇలా చేసినందుకు ఆమెని జైల్లో వేయమని కామెంట్స్ పెడుతున్నారు. (ఇదీ చదవండి: షారుక్ ఖాన్ ఇంటికి ఫ్రీ ఫుడ్.. ఇది యాపారం!) The love #ShahRukhKhan gets every part of the world, is truly amazing. He deserves every bit of it & more. Thank You @iamsrk for existing, You truly are love itself ❤️ pic.twitter.com/yzhKUMd9wg — Shah Rukh Khan Warriors FAN Club (@TeamSRKWarriors) June 13, 2023 -
వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!
రకుల్ ప్రీత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్లో స్టార్ హీరోల అందరి సరసన నటించి భారీ విజయాలను అందుకుంది. తాజాగా జరిగిన ఒక ఈవెంట్లో పింక్ సిండ్రెల్లా డ్రెస్‌లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. డ్రెస్సే అందంగా ఉంది అనుకుంటే అంతకంటే అందమైన రకుల్ ప్రీత్‌ను చూసి ఈవెంట్‌కి వచ్చిన వారు తమ చూపు తిప్పుకోలేకపోయారు. సిండ్రెల్లా దుస్తుల్లో హోయలుపోతున్న రకుల్ వీడియోను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. (ఇదీ చదవండి: ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను) ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ దుస్తుల్లో రకుల్ ప్రీత్ సింగ్‌ని చూసిన వాళ్లు.. 'బాలీవుడ్ సిండ్రెల్లా' అంటూ ఆమెకు కాంప్లిమెంట్స్ కూడా ఇస్తున్నారు. కానీ రకుల్ డ్రెస్సును ఒకరు ఎత్తిపట్టుకోవడం కొంచెం ఎబ్బెట్టుగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. హిందీలో మాత్రం రెండు చిత్రాలకు ఓకే చెప్పింది. తాజాగా బాలీవుడ్లో ఛత్రీవాలి అనే ఓ బోల్డ్ సినిమాలో నటించింది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) (ఇదీ చదవండి: బాధపడుతున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్!) -
ట్రెండ్ సెట్టింగ్ ఐడియా..ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసుల వినూత్న ప్రయోగం..
ఢిల్లీ: పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తుంటారు. దీంతో చలాన్లను ముక్కుపిండి మరీ వసూలు చేస్తుంటారు పోలీసులు. వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించడానికి పోలీసులు ఏదో ఒక విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ సారి ఢిల్లీ పోలీసుల వినూత్నంగా ఆలోచించారు. పబ్లిక్ ఆలోచనలకు సరిపోయే విధంగా ఓ రీల్ రూపంలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇంతకీ ఆ రీల్లో ఏముందంటే..? ఓ అందమైన అమ్మాయి పెళ్లికూతురుగా ముస్తాబైంది. ఖరీదైన దుస్తులు, నగలు ధరించింది. హెల్మెట్ లేకుండా స్కూటీని నడుపుతోంది. 'వారీ వారీ జాన్' పాటను ఎంజాయ్ చేస్తూ.. అందుకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇస్తూ రైడింగ్ చేస్తున్నట్లుగా వీడియో ఉంది. కానీ చివర్లో అసలు ట్విస్టు ఎదురైంది. అలా స్కూటీ నడుపుతున్న ఆ అమ్మాయికి పోలీసులు రూ.6000 ఫైన్ విధించారు. హెల్మెట్ లేనందుకు రూ.1000, లైసెన్స్ లేనందుకు రూ.5000 చొప్పున వేశారు. జరిమానాకు సంబంధించిన 'పే స్లిప్'లు వీడియో చివర్లో చూపించారు. సదరు వీడియోను ఢిల్లీ పోలీసు తమ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే జరిమానా తప్పదు అని తెలిపే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. పోలీసుల వినూత్న ఆలోచనలకు నెటిజన్లు ఫిదా అయ్యారు. పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు జోహార్లు అంటూ కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఐడియాలు ఎక్కడ నుంచి వస్తాయయ్యా? అంటూ ఫన్నీగా స్పందించారు. Going 'Vaari Vaari Jaaun' on the road for a REEL makes your safety a REAL WORRY! Please do not indulge in acts of BEWAKOOFIYAN! Drive safe.@dtptraffic pic.twitter.com/CLx5AP9UN8 — Delhi Police (@DelhiPolice) June 10, 2023 ఇదీ చదవండి:బల్బులు మార్చితే చాలు.. కోట్ల జీతం మీదే..! -
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
రెజ్లర్ల అంశంపై రైతు నాయకుల మధ్య వాగ్వాదం..ఒకరికొకరు వేళ్లు చూపుతూ..
హరియాణా:రెజ్లర్ల అంశంపై చర్చించేందుకు హరియాణాలో సమావేశమైన 'ఖాప్ పంచాయతీ' సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. వేదికపై సభ్యులు అరుస్తూ.. ఒకరికొకరు వేళ్లు చూపించుకున్నారు. గొడవకు గల కారణాలు తెలియనప్పటికీ ఈ వీడియో వైరల్‌గా మారింది. రెజ్లర్ల ఆందోళనపై తదుపరి చర్యలు తీసుకోవడానికి రైతులతో పాటు 31 మంది సభ్యులతో కూడిన కమిటీ సమావేశమైంది. ఇందులో 9 మందితో కూడిన ప్రత్యేక కమిటి ఆ అంశాలలో దిశానిర్ధేశం చేస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. #WATCH | Scuffle breaks out between the members of Khap panchayat during their meeting in support of wrestlers' protest in Kurukshetra, Haryana pic.twitter.com/Nj15aQgxZ9 — ANI (@ANI) June 2, 2023 రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపించారు. సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాతో సహా పలువురు అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న ఆటగాళ్లు బాధిత రెజ్లర్ల తరపున నిరసనలను చేపట్టారు. తమ పతకాలను గంగలో నిమజ్జనం చేస్తామని రెజ్లర్లు ప్రకటించి గత మంగళవారం హరిద్వార్‌కు వెళ్లారు.రైతు నాయకులు చివరి నిమిషంలో ఒప్పించి మద్దతు తెలపడంతో రెజ్లర్లు తమ ప్రణాళికలను మార్చుకున్నారు. రెజ్లర్లకు పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతు తెలిపారు. 1983 ప్రపంచ కప్ గెలిచిన క్రికెట్ జట్టు సభ్యులు కూడా రెజ్లర్లకు అండగా నిలబడ్డారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. ప్రభుత్వం ఆటగాళ్ల సమస్యలను పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ ఖండించారు. ఆరోపణలు రుజువైతే ఉరివేసుకుంటానని అన్నారు. చదవండి:ఏడుగురిని ఒకే తరహాలో!.. బ్రిజ్ భూషణ్‌పై సంచలన నిందారోపణలు -
కుక్క కోసం రూ. 16 లక్షల ఇల్లు! ఫ్రిజ్‌తో సహా..
కుక్క కోసం అత్యంత ఖరీదైన ఇల్లు నిర్మించాడో వ్యక్తి. ఏకంగా ఆ ఇంటిలో దానికో కుర్చి, షోఫా, టేబుల్, ఫ్రిజ్ అన్ని ఏర్పాటు చేశాడు. డ్రీమ్ డాగ్ హౌస్ పేరిట ఈ ఇల్లుని నిర్మించాడు. ఈ వింత ఘటన కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది. బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యూట్యూబర్ తన కుక్కు చార్లీ కోసం ఈ లగ్జరీ హౌస్‌ని ఏర్పాటు చేశాడు. ఆ కుక్క మొదటి పుట్టిన రోజు కానుకగా ఈ ఖరిదైన గిఫ్ట్ ఇచ్చానని చెబుతున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ కుక్క హాయిగా పడుకునేలా విలాసవంతమైన బెడ్, కాఫీ టేబుల్, టీవీ, ఫ్రిజ్‌తో సహా అచ్చం మానవులకు కావాల్సిన అన్ని వసతులను ఆ కుక్కకి సమకూర్చాడు. అలాగే కుక్కి సంబంధించిన వస్తువులను కూడ ఏర్పాటు చేశాడు. ఆ ఇంటి వెలుపల బంగారు అక్షరాలతో చార్లీ హౌస్ అని రాయించడమే గాక ఓ సింబల్‌ని కూడా ఏర్పాటు చేశాడు. ఐతే నెటిజన్లు హుషారుగా తిరుగుతూ గడిపే జీవితాన్ని బంధించి మీరే పాడు చేస్తున్నారని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!) -
శ్రీమంతుడైన శ్రీవారితో అన్ని సమస్యలేనట..! విచిత్రంగా ఈ అమ్మడి బాధ
శ్రీమంతుడైన భర్తను పొందాలని అమ్మాయిలు అనుకుంటారు. ఎందుకంటే..'ధనం మూలం ఇదం జగత్'. అంటారు కదా! ప్రపంచమంతా డబ్బుతో నడుస్తుంది. డబ్బులుంటే చాలు ఏదైనా చేయొచ్చు. విలాసవంతమైన సౌకర్యాలతో బతకొచ్చు. ఖరీదైన నగలు వేసుకొవచ్చు. విలువైన బట్టలు.. ఇలా ఇతరులు కొనలేని ఎన్నో వస్తువులను ధనవంతుడైన భర్త ఉంటే తెచ్చిపెడతాడు. కానీ ఇదే తనకు సమస్య అవుతుందని అంటోంది ఓ భార్య. శ్రీమంతుడైన భర్తలుంటే ఇదే సమస్య అంటూ.. ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఇంతకీ ఆవిడ సమస్య ఏంటో మరి..! ఆవిడ పేరు లిండా ఆండ్రాడే. దుబాయ్‌లో ధనవంతుడైన భర్తతో ఉంటోంది. శ్రీమంతడైన భర్త కాబట్టి విలువైనవి కొనిస్తున్నాడట. వాటిని జాగ్రత్తగా ఉంచుకోవడం ఇబ్బందవుతోందట. అవన్నీ దాచుకోవడం కష్టమవుతోందట ఈ అమ్మడుకు. వాటిని ఎప్పుడు, ఎవరు దోచుకెళ్తారో అని భయం పట్టుకుంటోందని వీడియోలో పేర్కొంది. ధనవంతడైన భర్తలున్నా ఎన్నో కష్టాలున్నాయని చెబుతూ ఆ వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. నెట్టింట ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయింది. వ్యూయర్స్ విభిన్న స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. పోస్టు చేసిన 'నీకు అన్ని కష్టాలున్నాయా?. మనం మన జీవితాలను రీప్లేస్ చేసుకుందామా?' అంటూ ఓ వ్యూయర్ కామెంట్ పెట్టాడు. ఈవిడ నిజంగానే సమస్యలతో ఉందా..? ఇది జోకా?, 'మా తల్లే.. నిజంగా ఖరీదైన వస్తువులను ఎప్పుడైనా వాడావా?. ఇదే మొదటిసారా?', ధనవంతులైన భర్తలు తొందరగా బోర్ కొట్టేస్తారేమో అంటూ మరికొందరు స్పందించారు. ఆ మహిళకు కొందరు వ్యూయర్స్ సపోర్టు కూడా చేశారు. ఆమె వ్యక్తిగత జీవితంపై మనం కామెంట్ చేయకూడదు అని కామెంట్ పెట్టారు. రూ.4.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Linda Andrade (@lionlindaa) ఇదీ చదవండి:ఓడిపోయాడని ముందు మందు బాటిళ్లు.. ప్రాణాలు తీసిన ఆన్లైన్ గేమ్.. ఎంత తాగాడో తెలుసా? -
శునకాన్ని చిన్నపాటి కొమ్మతో అదిలించాడు..అంతే అది రెచ్చిపోయి...
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అత్యంత వేగంగా వైరల్‌గా మారుతాయి. తాజాగా ఒక కుర్రాడిపై శునకం చూపిన ప్రతాపానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ప్రకారం ఒక వ్యక్తి తాడుతో కట్టివున్న కుక్కను పట్టుకుని కనిపిస్తున్నాడు. అక్కడే ఉన్న మరో కుర్రాడు ఒక చెట్టు కొమ్మతో ఆ శునకాన్ని అదిలించడం కనిపిస్తుంది. అంతే ఆ శునకానికి చిర్రెత్తుకొచ్చి ఆ కుర్రాడిపైన పడి,అతనిని కరిచే ప్రయత్నం చేస్తుంటుంది. వెంటనే తేరుకున్న ఆ కుర్రాడు ఆ శునకం బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటాడు. అయితే ఆ శునకం ఏమాత్రం వెనక్కి తగ్గక, ఆ కుర్రాడిని పరిగెత్తించి, మరీ కరుస్తుంటుంది. దీనిని గమనించిన శునకం యజమాని దానిని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోవడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో ట్విట్టర్లో @cctvidiots పేరుతో పోస్ట్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటి వరకూ 60 లక్షల మంది వీక్షించారు. అయితే వీరిలో చాలామంది ఆ శునకానికి మద్దతుగా కామెంట్లు చేయడం విశేషం. జంతువులను అకారణంగా కవ్వించినా, అదిలించినా ఇలాంటి ఫలితమే ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. Well done 😂😂 pic.twitter.com/nkFH2W1OB9 — CCTV IDIOTS (@cctvidiots) May 23, 2023 -
వచ్చారు, బైక్‌లో పెట్రోల్ నింపుమన్నారు.. లైటర్ వెలిగించారు..
భోపాల్: వాహనంలో ఇంధనం నింపుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చినా భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, భోపాల్ మాత్రం కొందరు ఆకతాయిలు కావాలనే ఓ పెంట్రోల్ బంక్‌కు నిప్పంటినట్టు తెలుస్తోంది. బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునే క్రమంలో ముగ్గురు యువకులు బంక్‌కు వెళ్లారు.సిబ్బంది పెట్రోల్ నింపుతున్న క్రమంలో ఓ యువకుడు అకస్మాత్తుగా లైటర్ వెలిగించాడు. దాంతో ఒక్కసారిగా మంటలు పెట్రోల్ నాజిల్ ద్వారా బైక్‌కు వ్యాపించాయి. అటునుంచి పెట్రోల్ పంపుకు ఎగబాకాయి. భయంతో అందరూ బయటకు పరుగులు పెట్టారు. పరిస్థితిని గమనించిన పెట్రోల్ పంపు సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఇసుకను ఉపయోగించి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.ఈ దృశ్యాలు కెమెరాలో నమోదయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కటరా హిల్స్‌లోని రేణుగా పెట్రోల్ బంక్‌లో జరిగింది. రూ.8000 నష్టం జరిగినట్లు బంక్ యాజమాన్యం పేర్కొంది. (చదవండి: వాహనంలో పెట్రోల్ ఉదయం పోయించాలా? రాత్రి పోయించాలా?... దీనికి సరైన సమయం ఏదంటే..) సంఘటన స్థలం నుంచి ఇద్దరు నిందితులు పారిపోగా, ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. టైల్స్ వర్క్ చేసే ఇతనిపై ఇప్పటికే క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతన్ని విజయ్ సింగ్‌గా గుర్తించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు భరత్ గట్ఖానే, ఆకాష్ గౌర్లుగా గుర్తించారు. వీరు మెకానిక్ వర్క్ చేసేవారని స్థానికులు వెల్లడించారు. అయితే, నిందితులు కావాలనే లైటర్ వెలిగించారా? లేక మరే కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బైక్‌లో సిబ్బంది పెట్రోల్ నింపే క్రమంలో రీడింగ్ చూడడం కోసం ఓ యువకుడు లైటర్ వెలిగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులు పట్టుబడ్డ తర్వాతే ఈ ఘటనకు అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. (మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!) -
ఆహ...భలే జంప్ చేశారు.. Wow.. what a jump
-
అంతరిక్షంలో అరుదైన దృశ్యం, సూర్య మామతో చంద్రుడి ఆటలు
-
ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదు..
-
ఓ విద్యార్థి ఆకలితో..ఏకంగా రూ. 98 లక్షలు ఖరీదు చేసే..
ఓ విద్యార్థి ఆకలితో ఉండటంతో చేసిని తమషా పని చూస్తే ఆశ్చర్యం తోపాటు కోపం కూడా వస్తుంది. ఆకలిగా ఉందని ఏకంగా ఓ కళాకృతి లాగించేస్తాడు. ఈ విచిత్ర ఘటన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఓ మ్యూజియం సందర్శించడానికి వచ్చిన విద్యార్థికి మంచి ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తోచక ఆ మ్యూజియంలో కమెడియన్ అనే గోడపై ఉన్న బనానా ఆర్ట్‌గా పిలిచే అరపండు కళాకృతిని లాగించేశాడు. అసలు ఏంటి ఇది అంటే.. ఒక గొడకు అరటిపండును టాప్ చేసే పెట్టే ఒక రకమైన ఆర్ట్ వర్క్ ఇది. ఆ విద్యార్థి ఆకలివేయడంతో ఆ అరటిపండుని కామ్‌గా తినేసి, తొక్కను గోడకు టాప్ చేసి రకరకాలుగా ఫోజులిచ్చి వెళ్లిపోయాడు. ఐతే ఆ కళాకృతి ధర ఏకంగా రూ. 98 లక్షలట. ఇలా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన బనానా కళాకృతిని లాగించేయడం మొదటిసారి కాదట. ఇంతకు మునుపు 2019లో కూడా ఈ కళాకృతి సుమారు రూ. 98 లక్షలకు విక్రయించబడ్డక తినేశారట. ఈ కళాకృతిని కళాకరుడు మారిజియో కాటెలన్ రూపొందించాడు. ఆయన ప్రతి ఏడాది మ్యూజియంలో ఈ కళాకృతిని ప్రదర్శిస్తాడని, అరటిపండును మార్చడం జరగుతుంటుందని మ్యూజియం అధికారులు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: అమెరికాలో తుపాకీ అప్పగిస్తే.. గిఫ్ట్ కార్డు బహుమానం) -
కొరియోగ్రాఫర్ చైతన్య సూసైడ్.. కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్ఫీ వీడియో
ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వారి కుటుంబంతో పాటు ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నింపింది. అయితే ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను తన సహచరులతో పంచుకున్నారు. (ఇది చదవండి: ఇంత మోసం చేస్తాడనుకోలేదు.. ఏడుపు కూడా రావడం లేదు : చైతన్య మాస్టర్ తల్లి) నెల్లూరులోని ఓ హోటల్లో బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆ వీడియోలో చైతన్య వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే అప్పుల బాధతోనే సూసైడ్ చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో తెలిపారు. (ఇది చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?) -
ఏ మూడ్‌లో ఉందో సింహం! సడెన్‌గా కీపర్‌పైనే దాడి..చూస్తుండగా క్షణాల్లో..
కొన్ని జంతువులను పెంచినంత మాత్రాన దాడి చేయవని అనుకులేం. అందుకు ఉదాహరణగా పలు ఉదంతాలను కూడా చూశాం కూడా. ఒక్కోసారి చాలా విచిత్రంగా ప్రవర్తించి దాడి చేసేందుకు రెడి అయిపోతాయి. అందులోకి క్రూరమృగాలైతే ఇక చెప్పనవసరం లేదు. అచ్చం అలానే ఇక్కడో సింహం రోజు తన సంరక్షణ చూసే కీపర్‌పైనే దాడి చేసింది. ఈ ఘటన బ్రిటీష్ పార్క్‌లో చోటు చేసుకుంది. రోజు తనను చూస్తుంది కదా అని అతను రోజులానే నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతను సింహం దాడి చేస్తుందని కూడా అనుకోలేదు. సడెన్‌గా సింహం అతన్ని పరిగెట్టించి దాడి చేసి, బొమ్మ మాదిరిగి ఈడ్చుకెళ్లిపోయింది. చూస్తుండగానే క్షణాల్లో ఆ వృద్ధ కీపర్ ఆ సింహానికి ఆహరమైపోయాడు. దీన్నంతా గమినిస్తున్న ఓ మహిళ భయంతో వెర్రిగా కేకులు వేసింది. అందుకు సంబంధించిన వీడియోని బ్రిటీష్ పార్క్ ఓనర్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వీడియో కోస ఇక్కడ క్లిక చేయండి: (చదవండి: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో పాము కలకలం..ఏకంగా 22 పాములు..) -
వానొచ్చేనంటే.. వరదనే వస్తది!.. ట్రెండింగ్‌లో హైదరాబాద్ వానలు
ట్విటర్ ట్రెండింగ్‌లో హైదరాబాద్రెయిన్స్ #HyderabadRains రెండో ప్లేస్ నుంచి పైపైకి పోతోంది. శనివారం ఉదయం రెండున్నర గంటలపాటు గట్టిగా దంచికొట్టిన వానకి.. నగరంలోని దుస్థితి తెలియజేస్తూ పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫొటోల తాలుకా ఎఫెక్ట్ ఇది. కేవలం విపక్ష నేతలే కాదు.. నగర పౌరులు కూడా ఈ ట్రెండింగ్‌లో పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘వాన పడితే.. అక్కడక్కడ నీళ్లు నిలవడం సహజం. మహా మహా నగరాలకే అది తప్పదు. ఆ మాత్రం దానికే అతిచేస్తార’ని ఆ మధ్య ఓ మంత్రి మీడియాకు చురకలు అంటించాననుకున్నారు. కానీ, ఇప్పుడు కురిసింది ఎండకాలంలో కురిసిన అకాల వర్షం.. అదీ కొద్దిసేపు కురిస్తేనే నగరం చెరువులను తలపించింది. ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. Cars and Two Wheelers washed away near Padma Colony, Nallakunta near the overflowing drain, due to sudden downpour in Hyderabad today. Alerts to @GHMCOnline , @GadwalvijayaTRS, @KTRBRS .#HyderabadRains #Hyderabad #HeavyRains #HeavyRain pic.twitter.com/SKeA2AgOjA — Surya Reddy (@jsuryareddy) April 29, 2023 కాళేశ్వరం మొదటి ఫలితం హైదరాబాద్ కి అందినట్లుందిగా! #Hyderabad#HyderabadRains #Telangana pic.twitter.com/En2EuPyT92 — Manpreet Singh (@manpreetstweet) April 29, 2023 రాంనగర్, మైండ్‌స్పేస్.. ఇలా పలు చోట్ల ఏకంగా వరద ఉధృతికి టూవీలర్లు కొట్టుకుపోయి నాలాలో కలిసిపోయిన పరిస్థితి. తిండికి, తాగునీరు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్ సరఫరా, రవాణ వ్యవస్థకి అంతరాయం ఏర్పడింది. వీటి సంగతి సరే.. జీహెచ్ఎంసీ మ్యాన్‌హోల్ నిర్లక్ష్యానికి ఓ పసికందు ప్రాణం బలైంది. This is the place where Mounika fell, washed away and died.#HyderabadRains pic.twitter.com/Y8crnbaVMn — Nellutla Kavitha (@iamKavithaRao) April 29, 2023 Heavy rain in #Hyderabad this early morning #HyderabadRains pic.twitter.com/i3xrnQYY5A — Swetcha Votarkar (@swetchajourno) April 29, 2023 మీడియా సంగతి సరే.. మరి ఆ మంత్రిగారు పౌరులు వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియా నిరసనలపై ఏం సమాధానం ఇస్తారో!. అసలే ఈ మధ్య వానాకాల సమీక్ష సైతం నిర్వహించారాయన. మరి ముందుంది వానా కాలం. పరిస్థితి ఇంకా ఎంత నరకంగా ఉండబోతుందో అనే ఊహతో ఇప్పటి నుంచే భయపడిపోతున్నారు నగరవాసులు. Stay indoors and stay safe in #HyderabadRains 😲😲😲 pic.twitter.com/NVk0yzeyrs — Raghav Chaturbedi (@RaghavChaturbe2) April 29, 2023 -
పాత ఇల్లు కూలుస్తుండగా బయటపడ్డ భోషాణం.. అందులో ఏముంది?
సాక్షి, కర్నూలు జిల్లా: దేవనకొండలో ఓ ఇనుప భోషాణం కలకలం రేపుతోంది. ఓ పురాతన ఇంటిని కూల్చుతున్నప్పుడు భోషాణం బయటపడింది. భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే వ్యక్తికి చెందిన పాత ఇంటిని నరసింహుడు అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. కొత్త ఇల్లు నిర్మించేందుకు నరసింహుడు జేసీబీ సాయంతో పాత ఇంటిని కూల్చివేసి మట్టిని తరలించారు. ఈ క్రమంలోనే ఇనుప భోషాణం బయటపడింది. తీవ్ర ఉత్కంఠ రేపిన భోషాణాన్ని అధికారులు పగలగొట్టించారు. అయితే, భోషాణంలో నిధులు, నిక్షేపాలు ఉంటాయని భావించిన గ్రామస్తులకు నిరాశే ఎదురైంది. భోషాణంలో పాత కాగితాలు, మట్టి, చెత్తా చెదారం, పాత డాక్యుమెంట్స్ తప్ప ఇంకేమీ లేవు. చదవండి: 2023-24 ఏపీ సంక్షేమ పథకాల క్యాలెండర్.. షెడ్యూల్ ఇదే.. -
28 ఏళ్లకే తొమ్మిది మందికి జన్మనిచ్చిన మహిళ.. వీడియో వైరల్
మహిళలకు మాతృత్వం ఒక వరం. తమ కుంటూ ఒకరో, ఇద్దరో పిల్లలు ఉండాలనే కోరుకుంటుంది ప్రతి జంట. ఐతే ఏ జంట అయిన తమ ఆర్థిక స్థితిగతుల దృష్ట్యా తమకు నచ్చిన విధంగా పిలల్లను కనాలని ప్లాన్ చేసుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడొక మహిళ ఒకరో ఇద్దరో కాదు ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అది కూడా కంటిన్యూస్ ప్రతి ఏడాది గర్భం ధరిస్తూ.. పిల్లలను కనింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలోని నెవాడా రాష్ట్రానికి చెందిన కోర డ్యూక్ 28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చింది. ఆమె తొలిసారిగా 17 ఏళ్ల వయసులో తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత నుచి ప్రతి ఏడాది గర్భవతిగా ఉంటూ వచ్చింది. అలా చివరికి 2012లో ఆఖరి బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పుడు ఆమెకు 39 ఏళ్లు. ఈ మేరకు డ్యూక్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతానం గురించి తెలియజేస్తు వీడియోని షేర్ చేయడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఐతే డ్యూక్ తానెప్పుడూ ఇంతమంది పిల్లలను కనాలని అస్సలు అనుకోలేదని చెబుతోంది. సంప్రదాయ గర్భనిరోధక పద్ధతులు విఫలం కావడంతోనే ఇంతమంది సంతానానికి జన్మనిచ్చినట్లు చెప్పింది. ఆమె సంతానం వరసగా ఎలిజా(21), షీనా(20), జాన్(17), కైరో(16), సయా(14), అవీ(13), రోమానీ(12), తాజ్(10) తదితర పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన భాగస్వామి ఆండ్రి, తన పెద్ద కుటుంబంతో కలిసి జీవిస్తోంది. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చాక శాశ్వత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు తెలిపింది. View this post on Instagram A post shared by Kora Duke 🇮🇳 (@mzkora) (చదవండి: సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి) -
బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి
ఈ మధ్య చదువులకు, చేసే పనికి సంబంధం ఉండటం లేదు. డిగ్రీలున్నా ఉద్యోగ అవకాశాలు లేక కొందరు చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి చూసుకుంటుంటే మరికొందరు మాత్రం డిగ్రీ చేసినా ప్రత్యేకమైన లక్ష్యంతో చిరువ్యాపారాల బాట పడుతున్నారు. 21 ఏళ్ల తాప్సీ ఉపాధ్యాయ్.. బీటెక్ పానీపూరి వాలీగా ప్రసిద్ధి చెందారు. బుల్లెట్ బండికి ఏర్పాటు చేసుకున్న చిన్న బండిపై ఆమె పానీపూరీలను విక్రయిస్తున్నారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతోనే తాను ఈ వ్యాపారాన్ని ప్రారంభినట్లు తాప్సీ చెబుతున్నారు. (జీవితాంతం ఒంటరిగానే ఉంటా కానీ! హోలీ యాడ్‌పై దుమారం: అసలేమైంది?) ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! View this post on Instagram A post shared by Are you hungry (@are_you_hungry007) తాజాగా ఆమె బుల్లెట్ వాహనానికి పానీపూరి బండిని కట్టుకుని తీసుకెళ్తున్న వీడియోను ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. అంత చదువు చదువుకుని ఇలా పానీపూరీ అమ్ముకుంటున్నావేంటి అని చాలా మంది ప్రశ్నించారని, కొందరైతే భద్రంగా ఉండాలంటే ఇంటికి తిరిగి వెళ్లాలని సలహా ఇచ్చారని తాప్సీ చెప్పారు. ఈ వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి దాదాపు మూడు లక్షల లైక్‌లు వచ్చాయి. ఆ యువతి స్ఫూర్తిని అభినందిస్తూ పలువురు కామెంట్లు పెట్టారు. -
ముసుగులో వచ్చి.. చైనీస్ రెస్టారెంట్‌పై దాడి
అమెరికాలో ఓ చైనీస్ రెస్టారెంట్‌పై దాడి జరిగింది. ముసుగులో వచ్చిన కొందరు ఆకతాయిలు.. రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్, వీచాట్‌లో చక్కర్లు కొడుతోంది. దాడికి సంబంధించిన వీడియోను ప్రముఖ ఉద్యమకారిణి యియాటిన్ చూ తన ట్విటర్ వాల్‌పై పోస్ట్ చేశారు. టేబుళ్లను కిందపడేసి, పాత్రలను పగలకొట్టి, కుర్చీలను విరగొట్టి.. విధ్వంసానికి పాల్పడిన దుండగులు, చివరికి సిబ్బందిని సైతం బెదిరించినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడింది స్థానిక యువతగా తెలుస్తోంది. అయితే వాళ్ల ఆచూకీని ఇంకా పోలీసులు కనిపెట్టలేదు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని ఫిష్ విలేజ్ రెస్టారెంట్లో ఈ దాడి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు వాళ్లు దాడికి ఎందుకు పాల్పడ్డారో కూడా తమకు అర్థం కావడం లేదంటూ రెస్టారెంట్ సిబ్బంది ఒకరు మీడియాకు వివరించారు. అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే.. వాళ్లు మైనర్లు అని, స్థానికంగా వోల్ఫ్ గ్యాంగ్ పేరుతో తమ హీరోయిజం ప్రదర్శించుకునే బచ్చాగ్యాంగ్ అని కొందరు స్థానికులు చెప్తున్నారు. This video is going viral on WeChat. Fish Village, a restaurant in College Point, Qns was ransacked by a gang of masked kids in hoodies. We’ve fallen so low that there’s no expectation of consequences for this horrific attack on private property. pic.twitter.com/DQdnHPR5r8 — Yiatin Chu (@ycinnewyork) March 7, 2023 -
చిల్లర డబ్బులతో రెస్టారెంట్ బిల్ చెల్లింపు! వీడియో వైరల్
ఇక్కడొక వ్యక్తి రెస్టారెంట్ బిల్‌ని చిల్లర పైసలతో చెల్లించాడు. దీంతో అక్కడ ఉన్న రెస్టారెంట్‌లోని వ్యక్తులంతా ఒక్కసారిగా అతని వైపు విచిత్రంగా చూస్తారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో ముంబైకి చెందిన సిద్ధేష్ లోకరే అనే వ్యక్తి తాజ్‌మహల్ ప్యాలెస్ అనే రెస్టారెంట్‌కి వెళ్లి చిల్లర డబ్బులతో బిల్ పే చేయాలనుకుంటాడు. అనుక్నుట్లుగానే రెస్టారెంట్‌కి వెళ్లాడు. రెస్టారెంట్‌కి వెళ్లాలంటే అక్కడ ఉన్నవాళ్లు మొదటగా చూసేది మన లుక్ అందుకని లోకర్ దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన పిజ్జా, మాంక్టైల్ డ్రింక్‌ని ఆర్డర్ చేసి శుభ్రంగా లాగించేశాడు. ఆ తర్వాత బిల్ పే చేసేందుకు అదే టేబుల్‌పై చిల్లర నాణేలను లెక్క పెట్టుకుంటూ వరుసగా పేర్చి ఉంచాడు. ఇంతలో సర్వర్ వస్తాడు అతను వాటిని చూసి నవ్వుతూ తీసుకుని వెళ్లిపోతాడు. చివర్లో లోకర్ అతన్ని లెక్కచూసుకోమంటే పర్వాలేదు లెక్కపెట్టుకుంటాం అని నవ్వుతూ బదులిస్తాడు. ఈ వీడియోకి మిత్రమా డాలర్‌తో చెల్లిస్తామా లేక మరేదైనా అనేది విషయం కాదు కేవలం బిల్ పే చేయడం ముఖ్యం అని క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశాడు. అంతేకాదు చివర్లో మనం ఒక రెస్టారెంట్‌కో లేదా ఎక్కడికైనా మనల్ని ప్రజలందరూ గమనిస్తారన్న భయంతో లేనిపోని హంగులకు పోతామే తప్ప మనం ఎలా ఉన్నామో అలా కనిపించేందుకు అస్సలు ఇష్టపడం. పైగా ఇలా చేస్తే ఏమనుకుంటారో అనే భయంతో ఇతరులకు నచ్చినట్లు ఉంటే మనకు నచ్చిన విధంగా ఉండటం మర్చిపోతుంటాం అని ఒక చక్కని సందేశం కూడా ఇచ్చాడు. ఐతే ఈ స్టంట్‌ని చూసి నెటిజన్లు.. "మంచి సందేశం. మనం ఎలా ఉన్నాం అనేది పెద్ద విషయం కాదు. మనమే ఇతరులను అనుకరిస్తూ మనకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాం." ఇది నిజం అంటూ సదరు వ్యక్తిని మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో కామెంట్లు పెట్టారు. View this post on Instagram A post shared by Siddhesh Lokare🙋🏻♂️ (@sidiously_) (చదవండి: 'విజిల్ విలేజ్'! అక్కడ గ్రామస్తులు పేర్లు ఎలా ఉంటాయంటే.) -
పచ్చని పందిట్లో రభస..కారణం వింటే ఛీ!..అంటారు!
వివాహబంధం అంటేనే రెండు కుటుంబాల కలయిక. అందులోకి మన దేశంలో చాలా అట్టహాసంగా వివాహ వేడుకలు జరుగుతుంటాయి. అలాంటి ఆనందమయ క్షణాలను కొంతమంది అర్థం కానీ రీజన్లతో విషాదమయంగా మారుస్తుంటారు. కొత్త జీవితాన్ని ప్రారంభించే నవదంపతుల సంతోషాన్ని అలాంటి సంఘటనలు ఆవిరి చేసేస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో అచ్చం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పటి దాక సంతోషంగా ఉన్న పచ్చని పెళ్లిమండపం కాస్త ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. పెద్ద కారణం కూడా ఏం లేదు. కేవలం వరుడు తరుపు మామయ్యకు పన్నీర్ కర్రీ వడ్డించలేదని గొడపడ్డారు. ఆ గొడవ కూడా ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్లు ఒకరి నొకరు దారుణంగా కొట్టుసేకునేంత వరకు వెళ్లిపోయారు. చుట్టపక్కల వాళ్లు ఆపేందుకు యత్నిస్తున్నా.. లెక్కచేయకుండా మూర్ఖంగా పోట్లాడుకొన్నారు. అందుకు సంబంధించిన ఆదియోగి అనే వినియోగదారుడు సోషల్ మాధ్యమంలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. शादी में दूल्हे के फूफा को पनीर न परोसने का अंजाम देख लो.... यूपी के बागपत का है मामला। #Baghpat #Viralvideo #UttarPradesh pic.twitter.com/gh3nMfVKUV — Aditya Bhardwaj (@ImAdiYogi) February 9, 2023 (చదవండి: జస్ట్ కారు దిగి వచ్చింది..దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..) -
జస్ట్ కారు దిగి వచ్చింది.. దొరికింది ఛాన్స్ అంటూ పులి అమాంతం..
క్రూర మృగాలు దాడులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అడవిలో జంతువుల వేటా ఎంతలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడొక పెద్ద పులి భలే కామ్‌గా వచ్చి లటుక్కున మహిళను పట్టుకుపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ వీడియోలో ఒక కారు అడవి మార్గం గుండా వెళ్తోంది. ఇంతలో సడెన్‌గా కారు ఆగింది. ఒక మహిళ కారు దిగి ముందుకు వచ్చి అటు వైపు ఉన్న డోరు తీసి అందులో ఉన్నవారితో ఏదో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి ఒక్కసారిగా పెద్ద పులి వచ్చింది. వారంతా చూస్తుండగానే ఆ మహిళను అడవిలోకి ఏదో బొమ్మను లాక్కెళ్లినట్లు లాక్కుపోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో కారులో ఉన్నవారు షాక్‌కు గురయ్యారు. వారు తేరుకుని ఆమెను రక్షించే అవకాశం కూడా లేకుండాపోయింది. Oh Shit pic.twitter.com/MG195HihOH — Terrifying As Fuck (@TerrifyingAsfuk) January 20, 2023 (చదవండి: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్: వీడియో వైరల్) -
Turkey Syria Earthquake: ఆ సమయంలో నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్
టర్కీలో 7.7 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. టర్కీలో సరిగ్గా అదే సమయంలో ఓ ఆస్పత్రిలోని నర్సులు మాత్రం భూకంప ప్రకంపనాలకు భయంతో పారిపోలేదు. అక్కడే ఉండి ఇంక్యుబేటర్‌లో ఉన్న నవజాత శిశువులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇంక్యుబేటర్‌లో ఉన్న శిశువల ఉన్న గది వద్దకు త్వరిత గతిన చేరుకుని, అక్కడే ఉండి వాటిని పడిపోకుండా పట్టుకుని అలానే నుంచొని ఉన్నారు. వారు చేసిన ప్రయత్నాల కారణంగా ఆ ఇంక్యుబేటర్లు కింద పడిపోకుండా ఉన్నాయి. అందుకు సంబంధించిన వీడియోని టర్కీలోని ఫాత్మా సాహిన్ అనే రాజకీయవేత్త ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కాగా టర్కీ, సీరియాలలో సంభవించిన భూకంపం కారణంగా మృతుల సంఖ్య 30 వేల మందికి చేరుకున్న సంగతి తెలిసిందే. Sağlıkçılarımız şahane insanlar👏#GaziantepBüyükşehir İnayet Topçuoğlu Hastanemiz yenidoğan yoğun bakım ünitesinde, 7.7'lik #deprem esnasında minik bebekleri korumak için Hemşire Devlet Nizam ve Gazel Çalışkan tarafından gösterilen gayreti anlatacak kelime var mı? 🌹🌼💐👏👏👏 pic.twitter.com/iAtItDlOwb — Fatma Şahin (@FatmaSahin) February 11, 2023 (చదవండి: శిథిలాల కింద వారిని అలా చూడగానే.. ఒక్కసారిగా తన్నుకొచ్చిన ఆనందం) -
ముగ్గురు అమ్మాయిలను పెళ్లాడిన వ్యక్తి!: వీడియో వైరల్
ఇటీవల భారత్‌లో ఇద్దరు కవలలను పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి బహు భార్యత్వం కేసు కింద అరెస్టు అయ్యాడు. ఆ ఘటన మరువక మునుపే అలాంటి ఘటనే కెన్యాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కేట్, ఈవ్, మేరీ అనే ముగ్గురు అక్కా చెల్లెళ్లు స్టీవ్ అనే వ్యక్తిని పెళ్లాడారు. తొలుత ఆ కవలల్లో కేట్ అనే అమ్మాయి స్టీవ్ అనే వ్యక్తిని కలిసింది. ఆ తర్వాత వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక పెళ్లి విషయమై మాట్లాడేందుకు వాళ్ల చెల్లెళ్లను కలిసేందుకు వెళ్లాడు స్టీవ్. అనుహ్యంగా స్టీవ్‌కి అక్కడకు వెళ్లేంత వరకు తెలియదు ముగ్గుర్ని చేసుకోవాల్సి వస్తుందని. తాను ఒకరిని వివాహం చేసుకునేందుకు మాట్లాడటానికి వెళ్లితే ముగ్గుర్ని పెళ్లి చేసుకుంటానని అస్సలు అనుకోలేదని చెబుతున్నాడు. ఐతే వారు తాము ముగ్గురు తననే ఇష్టపడుతున్నామని చెప్పటంతో ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు స్టీవ్. ఆ తర్వాత కాసేపు ఆలోచించి ముగ్గుర్ని పెళ్లాడేందుకు అంగీకరించినట్లు వివరించాడు. ఐతే ఆ ముగ్గరికి ఒకరిని వదిలి ఒకరు ఉండేందుకు ఇష్టపడకపోవడంతోనే ఇలా ఒక్క వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఐతే తమను పెళ్లి చేసుకునేందుకు స్టీవ్ ఒక కండిషన్ కూడా పెట్టాడని చెబుతున్నారు ఆ అక్కాచెల్లెళ్లు. అలాగే ఏ సమస్య రాకుండా తాము ఎవరికీ కేటాయించిన సమయంలో వారు స్టీవ్‌తో గడిపేలా గట్టి టైం షెడ్యూల్ కూడా కేటాయించుకున్నట్లు ఆ కవలలు చెబుతున్నారు. (చదవండి: చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు) -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్‌సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
అచ్చం అరవింద్ కేజ్రీవాల్‌లా..కానీ, చాట్ అమ్ముతూ..
మనుషులను పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని ఆర్యోక్తి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన మరో వ్యక్తి చాట్ అమ్ముతూ కనిపించాడు. మద్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో కేజ్రీవాల్‌లా క్యాప్ ధరించి, ఆయన మాదిరి వేషధారణలో ఉన్నాడు. చూస్తే అరవింద్ కేజ్రీవాలే అని అనుకుంటారు. అంతలా ఉంది అతని వేషధారణ. అతను ఒక బిజీ రోడ్డుపై చాట్బండితో కనిపించాడు. తన మెనుని అక్కడే ఉన్న చెట్టుకి వేలాడదీశాడు. పైగా అతని వద్ద సమోసా, చాట్, గులాబ్ జామ్ వంటి అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. పైగా వాటి ధర కేవలం రూ. 10 నుంచి మొదలై రూ. 30 వరకు మాత్రమే ఉంది. తాను నాణ్యతను నమ్ముతానని, తన దగ్గర మంచి నాణ్యతతో లభించే ఆహార పదార్థాలే ఉంటాయని, ఇలాంటివి మరెక్కడ ఉండవని చెబుతున్నాడు. ఈ మేరకు విశాల్ శర్మ అనే ఫుడ్ బ్లాగర్ గాల్వియర్‌లో చాట్ అమ్ముతున్న కేజ్రీవాల్ అనే క్యాప్షన్ జోడించి మరీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేశాడు. అంతేగాదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో అన్ని ఉచితంగా ఇస్తే, ఈయన నాణ్యతను నమ్మతారు కాబోలు అని వీడియోలో చమత్కరించాడు. దీంతో నెటిజన్లు బహుశా అతని వ్యాపారానికి ప్రభుత్వ లైసెన్సు లభించొచ్చు అని ఒకరూ, చాలా తక్కువ ధరలో మంచి స్నాక్స్ అందిస్తున్నాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by vishal sharma (@foodyvishal) (చదవండి: వీడియో: బెంజ్ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి) -
విమానంలో విండో సీటు కోసం ఫైట్..ఏకంగా జుట్లు పట్టుకుని మరీ..
విమానంలో విండో సీటు కోసం ఇద్దరు మహిళలు బీభత్సం సృష్టించారు. దీని కారణంగా ఫ్లైట్ రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఈ ఘటన బ్రెజిల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బ్రెజిల్‌లోని గోఫస్ట్ ఎయిర్‌లైన్‌లో ఇద్దరు మహిళలు విండో సీటు కోసం ఘోరంగా గొడవపడ్డారు. వాస్తవానికి ఒక బిడ్డ తల్లి విండో సీటు కావాలని తన సహ ప్రయాణికురాలిని కోరింది. అందుకు ఆ ప్రయాణికురాలు తిరస్కరించింది. అంతే ఇరువురి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆ మహిళా ప్రయాణికులిద్దరూ జుట్లు పట్టుకుని మరీ దారుణంగా కొట్టుకున్నారు. ఆఖరికి ఫ్లైట్ అటెండెంట్, స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆ విమానంలో మొత్తం 15 మంది ప్రయాణికులు గొడవకు దిగారు. దీంతో భద్రత సిబ్బంది సదరు ప్రయాణకులందర్నీ విమానం నుంచి దించేసి పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత విమానం గమ్యస్థానానికి చేరుకుంది. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు ట్విట్టర్లో పోస్ట్‌్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive brawl breaks out on airline flight to Brazil… over a window seat. pic.twitter.com/zTMZPYzzDy — Mike Sington (@MikeSington) February 3, 2023 (చదవండి: శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు) -
ఓరి దేవుడా! అది బస్సా!.. ఇంకేదైననా?
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో అకాల భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. చెట్లు, ఇళ్లు కూలిపోవడమే గాక రహదారులన్నీ దిగ్బంధమయ్యాయి. దీంతో అక్కడ రోజువారీ జన జీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ యంత్రాంగం ఈ పాటికే ముంపుకు గురైన ప్రాంతాలను సర్వే చేయడం, ఎంత మేర నష్టం వాటిల్లింది అనే దానిపై సమీక్షించడం వంటి పనులు ప్రారంభించింది. అలాగే మరోవైపు నగరాలను క్లీన్ చేయడం వంటి బాధ్యతలను చేపట్టింది కూడా. అంతేగాదు న్యూజిలాంగ్ చరిత్రలో దీన్ని అతి పెద్ద విపత్తుగా అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెట్టింట వైరల్ అవుతున్న ఒక వీడియో అదర్నీ తెగ ఆకర్షించింది. ఈ వీడియోని డెబ్బీ బర్రోస్ అనే మహిళ షేర్ చేశారు. ఆమె ఆక్లాండ్ కౌన్సిల్‌లోని 21 స్థానిక బోర్డులలో ఒకటైన మౌంగాకీకీ టమాకీ స్థానిక బోర్డుకు డిప్యూటి చైర్మన్. ఆ వీడియోలో రహాదారిపై నడుమ లోతు వరద నీటితో నిండుగా ఉంది. అక్కడ ఉన్న ఒక కారు కేవలం దానిపై ఉండే రూఫ్ మాత్రమే కనిపిస్తోంది. అంత నిండుగా ఉన్న వరద నీళ్లల్లో ఒక పెద్ద బస్సు చాలా సునాయాసంగా వెళ్లిపోతుంది. అందులో ప్యాసింజర్లు నుంచోని కనిపిస్తున్నారు. అంతేగాదు నీళ్లు ఒకవైపు నుంచి లోపలకు వెళ్తుంటే మరోవైపు నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏదో బోట్ మాదిరిగా వెళ్లిపోతుంది. డ్రైవర్ కూడా ఏదో ఖాళీ రోడ్డు మీద నడుపుతున్నంత ఈజీగా నడిపేశాడు. దీంతో సదరు డిప్యూటీ చైర్మన్ డెబ్బీ బర్రోస్ దీన్ని అస్సలు నమ్మలేకపోతున్నా!.. ఇది నిజమేనా? చాలా తమాషాగా అనిపిస్తోందన్నారు. వాస్తవానికి ఆ రహదారిని మూసేస్తుండగా ఒక బస్సు అదే సమయంలో రయ్యి మంటూ దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు డెబ్బీ బర్రోస్. దీంతో నెటిజన్లు చాలా హాస్యస్పదంగా ఉంది, బహుశా ఆ డ్రైవర్ డ్రైవింగ్‌లో మంచి నైపుణ్యవంతుడు కాబోలు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. Historic flooding? No problem, at least for this New Zealand bus driver, who was seen in a viral video driving his bus through shoulder-deep floodwaters like it was NBD. The area around Auckland has experienced unprecedented flooding and rainfall in recent days. pic.twitter.com/a4OUrb5eUj — NowThis (@nowthisnews) February 3, 2023 (చదవండి: కత్తిమీద సాములా భయపెట్టిస్తున్నా.. కర్తవ్యంగా స్వీకరిస్తున్నా! రిషి సునాక్) -
రైలులో టాయిలెట్లను పర్యవేక్షించిన మంత్రి: వీడియో వైరల్
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు బోగీలలోని కొత్తగా రూపొందించిన టాయిలెట్ల డిజైన్లను తనఖీ చేశారు. కొత్త హంగులతో ఆధునికరించిన మరుగుదొడ్లను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. అక్కడ ఒక వ్యక్తి చేసిన వర్క్ గురించి మంత్రికి వివరిస్తున్నాడు. ఆ వీడియోలో చాలా వరకు మరుగుదొడ్లను బాగా ఆధునీకరించారు. మంత్రి అశ్విన్ స్వచ్ఛతకు, పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తూ చక్కగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన వందే భారత్ ట్రైయిన్లు కూడా చెత్తతో పేరుకుపోయి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవడమే కాకుండా ఆయనే దగ్గరుండి పర్యవేక్షించారు. పైగా ప్రజలను కూడా రైళ్లు శుభ్రంగా ఉండాలంటే ప్రజలు కూడా దీనికి సహకరించాలని విజ్క్షప్తి చేశారు కూడా. అంతేగాదు అందుకు సంబంధించిన వీడియోని రైల్వే మంత్రి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలా బాగా చేస్తున్నారు మంత్రి గారు, భవిష్యత్తులో కూడా ఇలానే మెయింటెన్ చేస్తే బాగుంటుందంటూ కామెంట్లు చేస్తూ..ట్వీట్ చేశారు. Inspected the new upgraded toilet designs for existing coaches. pic.twitter.com/2v426YZiEy — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 31, 2023 (చదవండి: రాష్ట్రపతి ప్రసంగంలో ప్రత్యేకత ఏమి లేదు: కాంగ్రెస్ చీఫ్ ఎం ఖర్గే) -
పోలీస్ కారునే దొంగతనం చేయబోయి..చావు అంచులదాక వెళ్లొచ్చాడు!
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్నే దొంగలించేందుకు యత్నం చేశాడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా ఊహించనంత వేగంగా వెళ్లిపోయాడు. మృత్యుముఖం వరకు వెళ్లి త్రుటిలో బయటపడ్డాడు. ఈ అనుహ్య ఘటన యూఎస్‌లోని అట్లాంటాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని అట్లాంటాలో ఓ వ్యక్తి పోలీస్ పెట్రోలింగ్ కారును దొంగలించే సాహసం చేశాడు. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన పోలీసులు అతడ్ని వెంబడించారు. అంతేకాదు ఒక పక్క కారుని ట్రేస్ చేస్తూ ఫాలో చేయడం ప్రారంభించారు. మరోవైపు గగనతలం నుంచి హెలకాఫ్టర్ల సాయంతో కూడా ఛేజ్ చేస్తున్నారు. ఇంతలో అనుహ్యంగా ఆ కారు అదుపుతప్పి సమీపంలో ఉన్న రైల్వే పట్టాలపై పల్టీలు కొట్టి తలికిందులగా పడిపోయింది. ఐతే అదే సమయంలో అనుహ్యంగా ఒక రైలు స్పీడ్‌గా వస్తోంది. అంతే నిమిషాల వ్యవధిలో పోలీసులు వచ్చి ఆ నిందితుడిని బయటకు లాగి రక్షించిన కొద్ది నిమిషాల్లోనే రైలు ఆ కారుని గుద్దుకుంటూ వెళ్లిపోయింది. నిందితుడు మాత్రం కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు పోలీసులు సదరు వ్యక్తిని రక్షించడమే గాక అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Dramatic body camera footage shows Atlanta police saving a suspect from an oncoming train at the last minute. Police chased a man who stole a patrol vehicle while an officer was conducting a traffic stop, but was halted when the suspect crashed the car onto train tracks. pic.twitter.com/7r4MmfIjFp — Newsweek (@Newsweek) January 30, 2023 (చదవండి: విమానంలో ప్రయాణకురాలి వీరంగం..సిబ్బందిని హడలెత్తించేలా కొట్టి, ఉమ్మి వేసి...) -
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
దేశభక్తి గీతాన్ని ఆలపించిన మమత!: వీడియో వైరల్
గురువారం 74వ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని అన్ని చోట్ల చాలా ఘనంగా వేడుకలు జరిగాయి. అలానే పశ్చిమ బెంగాల్లో కూడా చాలా వైభవంగా జరిగింది. ఐతే ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించకుని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశభక్తి గీతాన్ని ఆలపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ మేరకు ఆమె తెల్లటి కాటన్ చీరలో బెంగాల్ కవి ద్విజేంద్రలాల్ సరే రాసిన 'ధోనో ధన్నే పుష్పే భోరా' అనే పాటను ఇతర గాయకులతో కలిసి ఆలపించారు. ఈ పాట బెంగాల్లో ఉన్న వనరులను, అక్కడి వారసత్వాన్ని తెలియజేస్తుంది. మమత ఈ పాటను ఆలపించి తన దేశభక్తిని చాటుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా యునెస్కో వారసత్వ జాబితాలో చేరిన పశ్చిమబెంగాల్లో కోల్‌కతాలోని ప్రసిద్ధ దుర్గాపూజా ఢిల్లీలోని నిర్వహించిన కవాతులో ప్రదర్శించారు. ట్రాక్టర్ ముందు భాగంలో నారికేళంతో ఉన్న పూర్ణ కలశం దాని ముందు మాతృదేవతా ఆరాధన నమునా ప్రధాన ఆకర్షణగా నిలిచింది. (చదవండి: ప్యాసింజర్లను ఎక్కించుకోని టేకాఫ్ ఘటన: ఎయిర్‌లైన్‌కు భారీ పెనాల్టీ) -
Viral Video: పిల్లి వేషాలు మాములుగా లేవుగా..!
-
బంగారు తల్లి.. చూపులేని తల్లిదండ్రుల కోసం..
వైరల్: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమీ వాడు గిట్టనేమి.. ఈ భూమ్మీద తల్లిదండ్రులను మించిన రక్షణ మరొకటి లేదు. కానీ, తల్లిదండ్రులంటే అపార గౌరవం, ప్రేమ.. అన్నింటికి మించి వాళ్ల ఆలనా పాలనా చూసుకునే అపర శ్రవణ కుమారులు ఈ కాలంలో అరుదైపోయారు. అలాంటిది.. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలకు కనువిప్పు కలిగించే ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ చిన్నారిది తోటి స్నేహితులతో ఆడిపాడే వయసు. కానీ, ఆ తల్లిదండ్రులిద్దరికీ చూపు లేదు. అందుకే వాళ్లకు కంటి పాప అయ్యింది. బడికి పోయే టైం తప్పించి.. మిగతా సమయంలో వాళ్ల వెంటే ఉంటూ నడిపిస్తోంది. సాయంత్రం పూట వాళ్లతో కలిసి.. చిరు తిండి తింటూ గడిపింది. ఆపై వాళ్లను అక్కడి నుంచి తీసుకెళ్లింది. ఆ వీడియోనే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. యూనిఫామ్‌లో ఉన్న ఓ చిన్నారి వాళ్లకు చిరు తిండి అందిస్తూ కనిపిస్తోంది. ముంబైపై వీడియోలు తీసే మిత్ ఇందుల్కర్ అనే ఇన్ఫ్లెన్సర్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ వీడియో.. వ్యూయర్స్ దృష్టిని ఆకట్టుకుంది. ముంబై జాంగిద్, మీరా రోడ్లో రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. View this post on Instagram A post shared by Mith Indulkar (@mith_mumbaikar) -
Train Video: ఇది రైలు ప్రయాణమా? ఇంత ఘోరమా?
వైరల్: మన దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థ.. భారతీయ రైల్వేస్. అలాగే.. అత్యంత రద్దీ వ్యవస్థ కూడా ఇదే!. పండుగలు, ఇతర సెలవుల సమయంలో రైళ్లలో రద్దీ ఏపాటి ఉంటుందో తెలియంది కాదు. అయితే.. సాధారణ రోజుల్లోనూ కొన్ని మార్గాల్లో రద్దీ అధికంగా ఉంటోంది. ఆ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించలేకపోతోందనే విమర్శ ఇండియన్ రైల్వేస్‌పై ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా రాజేష్ దుబే అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అమృత్సర్ కథిహార్ ఎక్స్‌ప్రెస్‌లో 72 బెర్త్ స్లీపర్లు ఉన్న కోచ్‌లో ఏకంగా 350 మంది ప్రయాణించారు. ఎటు చూసినా ప్యాసింజర్లు, లగేజీలతో పూర్తిగా కిక్కిరిసిపోయింది. అంత నరకంలోనూ గమ్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లు, మరో మార్గం లేక ఇలా చేసినట్లు కొందరు ప్రయాణికులు వెల్లడించారు. అయితే.. నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులు అలా ప్రయాణించడం నేరమే!. కానీ, ఆ టైంకి అక్కడ టీటీఈ కూడా లేకపోవడంతో.. విషయం రైల్వేస్ దృష్టికి వెళ్లింది. రైల్వే సేవా అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ప్రయాణ వివరాలను అందించమని కోరగా.. చివరకు ఫిర్యాదు నమోదు అయ్యింది. Video Credits: The Logical Indian -
ఆంబులెన్స్‌కి దారివ్వండి.. అధికారులతో సీఎం జగన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: బుధవారం మదనపల్లె పర్యటనలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తన మంచి గుణం ప్రదర్శించారు. పర్యటనలో భాగంగా వేదిక వద్దకు ఆయన చేరుకునే సమయంలో ఆయన కాన్వాయ్‌కు ఓ ఆంబులెన్స్ ఎదురొచ్చింది. అప్పటికే రోడ్డుకు ఇరువైపులా వైఎస్సార్సీపీ అభిమానులు, బందోబస్తుకు వచ్చిన పోలీసులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. అయితే అంతహడావుడిలోనూ ఓ ఆంబులెన్స్ రాకను గమనించిన సీఎం జగన్.. దానికి దారి ఇవ్వాలంటూ అధికారులకు సూచించారు. దీంతో.. కాన్వాయ్ బస్సుని పక్కన ఆపించి అంబులెన్సుకు దారిచ్చారు అధికారులు. ఆ సమయంలో ఆంబులెన్స్ నుంచి పేషెంట్ బంధువులు చేతులెత్తి సీఎం జగన్‌కు నమస్కరించారు. ఇదీ చదవండి: మీ బిడ్డ.. ఈ వైఎస్ జగన్‌కు నిజాయితీ ఉంది -
గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!
అమెరికాకు చెందిన 20 ఏళ్ల డాల్టన్ మేయర్ తప్పట్లతో గిన్నిస్ రికార్డు సాధించాడు. అదీకూడ ఒక నిమిషంలో 1,140 సార్లు క్లాప్స్(చప్పట్లు) కొట్టి రికార్డు సృష్టించాడు డాల్టన్ మేయర్. ఈ మేరకు డాల్టన్ మాట్లాడుతూ...దీనికోసం ప్రాక్టీస్ అవసరం లేదంటున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చప్పట్లు కొట్టే కేట్ ఫ్రెంచ్ యూట్యూబ్‌ని చూసి ఆసక్తి పెంచుకున్నట్లు చెబుతున్నాడు. ఇంతకముందు బిషప్ పేరిట ఒక నిమిషంలో 1,103 క్లాప్స్‌తో ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు డాల్టన్. అతను డెవలప్ చేసిన మణికట్టు క్లాప్స్నే ఉపయోగించి ఇంతలా వేగవంతంగా క్లాప్స్ కొట్టగలిగానని చెప్పాడు. ఈ క్లాప్స్ సౌండ్‌ని ఇల్లినాయిస్కు చెందిన చార్మ్ మీడియా గ్రూప్ ఫోటోగ్రఫీ పరికరాలతో రికార్డు చేశారు. ఐతే ఈ క్లాప్స్ ఒక చేతి మణికట్టుని మరో చేతి వేళ్లతో ఆనించి చప్పట్లు కొట్టాలి. డాల్టన్ తన క్లాప్స్ ఆడియో సరిగా రికార్డు అవుతుందో లేదో తెలుసుకునేందుకు సదరు మీడియా గ్రూప్‌తో కొన్నాళ్లు పనిచేసినట్లు తెలిపాడు. (చదవండి: ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తి... మరొసారి మాజీ భార్యతో) -
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
షిల్లాంగ్: వాతావరణం అనుకూలించకపోవటంతో మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. షిల్లాంగ్‌లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో హెలికాప్టర్ దిగాల్సి ఉండగా.. వాతావరణం అందుకు అనుకూలించలేదు. దీంతో ఉమియామ్ సరస్సు సమీపంలో ల్యాండింగ్ చేశారు పైలట్లు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు సీఎం కాన్రాడ్ సంగ్మా. తురా నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ సంఘటన ఎదురైనట్లు పేర్కొన్నారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన యూనియన్ క్రిస్టియన్ కాలేజీ క్యాంపస్‌లోని పర్యావరణాన్ని ఆస్వాదించానని పేర్కొన్నారు సంగ్మా. తమను సురక్షితంగా కిందకు చేర్చినందుకు హెలికాప్టర్ కెప్టెన్, పైలట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఎంత సాహసం! వాతావరణం అనుకూలించక ఉమియామ్‌లోని యూసీసీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. క్యాంపస్‌లోని అందమైన ప్రకృతిని ఆస్వాదించాను. యూసీసీ సిబ్బందిని కలిశాను. అక్కడి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం చేశాను.’ అని రాసుకొచ్చారు సంగ్మా. What an adventure! •Emergency Landing at UCC, Umiam due to bad weather •Enjoyed the beautiful scenery in the Campus •Met with staff of UCC •Lunch in UCC Canteen The weather is truly unpredictable. Thank the Captain & Pilot for bringing us back safely. pic.twitter.com/D4rMAzGYhC — Conrad Sangma (@SangmaConrad) November 2, 2022 ఇదీ చదవండి: గోవాలో ఇకపై ఈ పనులు చేస్తే భారీగా జరిమానా -
రూ.900 కోట్ల పెయింటింగ్‌పై పొటాటో సాస్ పోసి నిరసన.. అందుకేనటా!
బెర్లిన్: పర్యావరణ కాలుష్యంపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇద్దరు పర్యావరణ వేత్తలు సాహాసానికి పూనుకున్నారు. సుమారు రూ.900 కోట్లుకుపైగా విలువైన మోనెట్ పెయింటింగ్‌పై ఆలు, టమాటో సాస్ పోసి నిరసన వ్యక్తం చేశారు. శిలాజ ఇంధనాలను భూమి నుంచి తీసి వాడటానికి వ్యతిరేకంగా ఇలా చేసినట్లు చెప్పారు. ఈ సంఘటన జర్మనీలో జరిగింది. ఈ వీడియోను లాస్ట్ జనరేషన్ అనే ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. లాస్ట్ జనరేషన్ గ్రూప్‌కు చెందిన ఇద్దరు పర్యావరణ కార్యకర్తలు బార్బెరిని మ్యూజియంలో మోనెట్ లెస్ మెయూల్స్ పెయింటింగ్‌పై పొటాటో సాసు పోశారు. అనంతరం పెయింటింగ్ వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ‘మీరు సమస్య వినడానికి ఈ పెయింటింగ్‌పై పొటాటో సాసు వేయటం ఉపయోగపడుతుందా? మనం ఆహారం కోసం గొడవపడాల్సి వస్తే.. ఈ పెయింట్‌కు విలువే ఉండదు. ప్రజలు చనిపోతున్నారు. మనం పర్యావరణ విపత్తులో ఉన్నాం. పెయింటింగ్‌పై టమాటో సూప్ పోయటం వల్ల భయపడుతున్నారు. కానీ మేము ఎందుకు భయపడుతున్నామో మీకు తెలుసా? 2050 నాటికి మనకు తినడానికి తిండి దొరకదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకు భయపడుతున్నాం. మీరు ఎప్పుడైతే వింటారో అప్పుడే ఇదంతా ఆగిపోతుంది.’ అని పేర్కొన్నారు. ఈ స్టంట్‌లో నలుగురు పాలుపంచుకున్నట్లు తెలుస్తోంది. పెయింటింగ్ మొత్తం గ్లాస్‌తో ఉండటం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని బర్బెరిని మ్యూజియమ్ తెలిపింది. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు మ్యూజియం డైరెక్టర్ ఓర్ట్రూడ్ వెస్తేయిడర్ పేర్కొన్నారు. పర్యావరణ విపత్తుపై వారి ఆందోళనలను అర్థం చేసుకున్నామని, అయితే, వారి డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించిన విధానమే ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. దీనిపై పోలీసులు ఎలాంటి సమాచారం అందించలేదు. We make this #Monet the stage and the public the audience. If it takes a painting – with #MashedPotatoes or #TomatoSoup thrown at it – to make society remember that the fossil fuel course is killing us all: Then we'll give you #MashedPotatoes on a painting! pic.twitter.com/HBeZL69QTZ — Letzte Generation (@AufstandLastGen) October 23, 2022 ఇదీ చదవండి: ‘మహా’ పాలిటిక్స్.. షిండేకు పదవీ గండం.. బీజేపీలోకి 22 మంది ఎమ్మెల్యేలు! -
నాటు నాటు సాంగ్.. బ్లాక్ అండ్ వైట్ కాలం నాడే కుమ్మేశారు..!
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా ఆ చిత్రంలోని 'నాటు నాటు సాంగ్' అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. విదేశీయులు సైతం ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయారు. ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అయితే అచ్చం అలాగే స్టెప్పులు వేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలంలోని ఓ వీడియో నెటిజన్లు షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది. ఆ వీడియోలోని స్టెప్పులు చూస్తే అచ్చం నాటు నాటు సాంగ్‌ను తలపిస్తున్నాయి. మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. -
నమ్మలేని నిజం.. 10 ఏళ్లకుపైగా ఎత్తిన చేతిని దించలేదు..!
మీ చేతిని పైకి ఎత్తి ఎంత సమయం వరకు ఉండగలరు? మహా అయితే ఓ 10-20 నిమిషాలు అతి కష్టంతో పైకి ఎత్తి ఉంచగలరేమో. కానీ, గంటలు కాదు, రోజులు కాదు.. ఏళ్ల తరబడి ఎత్తిన చేతిన దించకుండా ఉండటం అంటే నమ్మశక్యంగా లేదు కదా. అయితే, అది నిజం. ఓ సాధువు దానిని గతంలోనే చేసి చూపించారు. 70 ఏళ్ల సాధువు అమర్ భర్తీ.. సుమారు 50 ఏళ్లకుపైగా తన కుడి చేతిని పైకే ఎత్తి ఉంచినట్లు అప్పట్లో తెగవైరల్గా మారింది. తొలి రెండేళ్లు తీవ్రంగా నొప్పి ఉండేదటా! కానీ అది క్రమంగా తగ్గిపోయిందని, ఆ తర్వాత ఎలాంటి నొప్పిలేదని సాధువు అమర్ భర్తీ వెల్లడించారు. మరోవైపు.. ఆ చేతికి రక్త ప్రసరణ పూర్తిగా నిలిచిపోవటం వల్లే ఎలాంటి నొప్పి కలగటం లేదని, ఇకపై ఆ చేతిని కిందకు దించలేదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. 1973 వరకు అమర్ భర్తీ ఒక సాధారణ వ్యక్తే. అందరిలా వివాహం చేసుకుని పిల్లాపాలతో జీవించేవారు. ఆ తర్వాత తన జీవితాన్ని శివుడికి అంకితం చేయాలని నిశ్చయించుకుని సాధువుగా మారారు. తనలోని శివుడిపట్ల ఉన్న నిబద్ధతను చాటుకునేందుకు కుడి చేతిని పైకి ఎత్తి ఉంచటం మొదలు పెట్టారు. భర్తీ అంశం 2020లోనే వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే భర్తీ లాగే మరో వ్యక్తి చేతిని పైకి ఎత్తి ఉంచుతుండటం వెలుగులోకి వచ్చింది. అమర్ భర్తీ 50 ఏళ్ల రికార్డును బ్రేక్ చేయలేకపోయినా.. తనకు సాధ్యమైనంత మేరకు చేతిని పైకి ఎత్తే ఉంచుతానని చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చేతిని పైకి ఎత్తే ఉంచానని వెల్లడించారు. ఓ రిపోర్టర్ సాధువుతో మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఎన్ని రోజుల పాటు ఇలా చేతిని పైకి ఎత్తి ఉంచుతారని విలేకరి ప్రశ్నించగా.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. చేతిని పైకి ఉంచే నిద్రపోతానని, ఆ సమయంలోనూ ఎలాంటి ఇబ్బంది కలిగినట్లు అనిపించదని తెలిపారు. Guy from India hasen't put his arm down for 10 Years to honor his God 😱#amazing #india #pandit #guru #sacrifice #ENGvIND @unexpected_new pic.twitter.com/ldAVoXpMJi — Next Level (@NextInteresting) September 24, 2022 ఇదీ చదవండి: Viral Video: హీరో లెవల్లో యువకుడి బైక్ స్టంట్.. ఝలక్ ఇచ్చిన పోలీసులు -
కారు ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డా.. తగ్గేదేలే!
లక్నో: నడి రోడ్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగింది. వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DISTURBING Video: Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad, Uttar Pradesh Brawl Continues Despite Hit; Case Registered#UttarPradesh pic.twitter.com/0gVnclbSkH — The Jamia Times (@thejamiatimes) September 21, 2022 ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్ -
ఎంత కష్టమొచ్చింది.. పాము కాటుకు గురైన మహిళను మంచంపై అలా..!
రాయ్‌పూర్: దేశంలోని చాలా ప్రాంతాలకు నేటికీ సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాము కాటుకు గురైన ఓ మహిళను మంచంపై నడుములోతు నీటిలో మోసుకెళ్లిన సంఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. భారీ వర్షాల కారణంగా స్థానిక వాగు పొంగింది. దీంతో ఆరోగ్య సిబ్బంది గ్రామానికి చేరుకోలేని పరిస్థితి తలెత్తటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ముంగేలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన గిరిజన మహిళ పాము కాటుకు గురైంది. అయితే, భారీ వర్షాల కారణంగా వాగు పొంగి ఇతర గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో చేసేదేమి లేక ఎనిమిది మంది గ్రామస్థులు మహిళను మంచంపై నడుములోతు నీటిలోంచి మోసుకెళ్తూ పక్క గ్రామానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. మహిళను మంచంపై తీసుకెళ్తుండగా అదే మంచంపై మరోమహిళ సైతం ఉన్నట్లు చిత్రాల్లో కనిపిస్తోంది. ‘భారీ వర్షాల కారణంగా వాగు పొంగి పక్క గ్రామంలోని ఆరోగ్య సిబ్బంది ఆ గ్రామానికి చేరుకోలేకపోయారు. ఇది ప్రత్యేకమైన కేసు. వాగు పొంగటం వల్ల మహిళను మంచంపై మోసుకొచ్చారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ నిబంధనలు, 10-12 కోట్ల రూపాయల బడ్జెట్ కారణంగా వంతెన నిర్మాణం ప్రతిపాదనకు ఆమోదంలో జాప్యం జరుగుతోంది.’ అని తెలిపారు ముంగేలి అదనపు కలెక్టర్ తీర్థరాజ్ అగర్వాల్. Chhattisgarh| Villagers carry tribal woman bitten by a snake on a cot across river to reach hospital in Mungeli district Area is little difficult to reach & a village that has health officials was cut off from there due to heavy rains: Teerthraj Agarwal, Mungeli Addl Collector pic.twitter.com/BXikfRxCCf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) September 19, 2022 ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
'ప్రకృతి అందరి సరదా తీర్చేస్తుంది' కావాలంటే మీరే చూడండి!
ఒక ఫొటో వేయి పదాల అర్థాన్ని ఇస్తుంది. అలాంటి ఫొటోలు ఎన్నో జీవితాలలో మార్పులు తీసుకొచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వీడియోలు సైతం ఆ అర్ధానికి తామేం తీసిపోమంటూ పోటీ పడుతున్నాయి. తాజాగా నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఆ వీడియోలో నలుగురు ఓ భారీ పొడవైన చెట్టు నరికేస్తారు. అందులో ఓ వ్యక్తి నరికిన ఆ చెట్టును కింద పడేసే ప్రయత్నం చేయగా.. అది కాస్తా ఒరిగి చెట్టును నరికిన వ్యక్తిని పైకి ఎత్తి అవతల పడేస్తుంది. అదిగో ఆ వీడియోనే ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. 'మీరు చెట్టును నరికేస్తారేమో..కానీ వాటిని కింద పడేయలేరు' అంటూ క్యాప్షన్‌ను జత చేస్తూ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపతీరంగా ఆకట్టుకుటుంది. If you cut down trees, they won’t take it lying down 👏🏽👏🏽👏🏽pic.twitter.com/TekNZiQSTF — anand mahindra (@anandmahindra) August 23, 2022 ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. మరికొన్ని వీడియోల్ని రీట్వీట్ చేస్తున్నారు. ప్రకృతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందంటూ చిన్నాభిన్నమైన రోడ్ల వీడియోల్ని షేర్లు చేస్తున్నారు. చదవండి👉 'టెన్షన్ వద్దు..నేను ఏదో ఒకటి చేస్తాలే' ఆనంద్ మహీంద్రా రీ ట్వీట్ వైరల్! -
హఠాత్తుగా రోడ్డుపై ఖడ్గమృగం ప్రత్యక్షం.. జనం హడల్!
ఖడ్గమృగం భారీ ఆకారంతో ముందు పెద్ద కొమ్ముతో ఉంటుంది. దానిని ‘జూ’లో దూరం నుంచి చూస్తేనే మీదికొచ్చేస్తుందమోనని భయం వేస్తుంది. అలాంటిది జనావాసంలో రహదారిపై హఠాత్తుగా ప్రత్యక్షమైతే ఇంకేమన్నా ఉందా? భయంతో పరుగులు పెట్టాల్సిందే. అలాంటి ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. వీడియోలో.. రోడ్డుపై భారీ ఖడ్గమృగం వేగంగా పరుగెడుతోంది. దానిని చూసిన వారంతా భయంతో పరుగులు పెట్టారు. రోడ్డు నిర్మానుష్యంగా మారటంతో దర్జాగా వెళ్లిపోయింది. అయితే.. ఈ వీడియో ఎక్కడిదనేది తెలియరాలేదు. ‘మనుషులు ఖడ్గమృగం స్థావరంలోకి వెళ్లినప్పుడు.. ఒక రైనో నగరంలోకి రావటం సరైనదే. దానిని గందరగోళానికి గురిచేయవద్దు.’ అని రాసుకొచ్చారు ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి. ట్విట్టర్లో 70వేలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఖడ్గమృగం రక్షణపై నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత ఏం జరిగిందిని వాకాబు చేశారు. నందా మాటలతో ఏకీభవించిన కొందరు అడవుల్లో నిర్మాణాలకు అనుమతులపై నిషేధం విధించాలని కోరారు. When the human settlement strays into a rhino habitat… Don’t confuse with Rhino straying in to a town pic.twitter.com/R6cy3TlGv1 — Susanta Nanda IFS (@susantananda3) August 5, 2022 ఇదీ చదవండి: కుక్క కోసం భారీ కొండ చిలువతో చిన్నారుల పోరాటం -
Viral Video: ఈ పిల్లాడి ‘హోమ్ వర్క్ ఫ్రస్ట్రేషన్’ మామూలుగా లేదుగా..!
న్యూఢిల్లీ: స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత తన స్నేహితులతో కలిసి ఆడుకోవాలని భావిస్తారు పిల్లలు. కానీ, ఇంటికి రాగానే హోమ్‌వర్క్ చేయమంటే నిరాశకు లోనవుతారు. అయిష్టంగానే పుస్తకాలు తెరుస్తారు. కొందరైతే.. కోపంతో నేను చేయను పో అని తెగేసి చెప్తారు. ఆ కోవకే చెందుతాడు ఈ పిల్లాడు. హోమ్ వర్క్ చేయమన్న తన తల్లిపైనే అసహనం వ్యక్తం చేశాడు. ఆ బుజ్జాయి మాటలు వింటే మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో.. హిందీ నోట్‌బుక్‌ను తెరిచిన పిల్లాడు తన తల్లికి ఎదురు సమాధానమిస్తున్నాడు. హోమ్‌వర్క్ చేయలేక తాను ఈ లోకం నుంచి వెళ్లాలనుకుంటున్నాని షాక్ ఇచ్చాడు. ‘మమ్మీ నేను పరేషాన్ అవుతున్న. అసుల ఈ దినియాలోకి ఎందుకు వచ్చాను. నేను ఈ లోకం నుంచి వెళ్లిపోతాను, వెళ్లిపోతాను.’ అంటూ తన పెన్సిల్‌ను పదే పదే పుస్తకంపై బాదుతూ చెప్పాడు. ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని అతడి తల్లి అడగగా.. నాకు ఈ ప్రపంచంలో ఉండాలని లేదు, నువ్ అందంగా లేవు అని సమాధానమిచ్చాడు. దానికి ఆమె పడిపడి నవ్వసాగింది. ఆ వీడియోను ఎమోబోయిస్ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. హోమ్ వర్క్ చేయమంటే ఏం జరుగుతుందో చూడండి అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Emo Bois of India (@emoboisofindia) ఇదీ చదవండి: Viral Video: అవమానపడ్డ టూరిస్ట్...టచ్ చేయకూడనవి టచ్ చేస్తే ఇలానే ఉంటుంది! -
వైరల్: తల్లి రిటైర్మెంట్ రోజు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చిన కొడుకు
జైపూర్: తన తల్లి ఉద్యోగ విరమణ రోజుని జీవితాంతం గుర్తుండిపోయేలా కొడుకు సర్ప్రైజ్ అందించాడు. అందరిని ఆశ్చర్యపరుస్తూ అద్భుతమైన బహుమతి ఇచ్చి.. తల్లి కళ్లలో ఆనందాన్ని చూసుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే.. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌కు చెందిన సుశీలా చౌహాన్ అనే మహిళ పిసంగన్‌లోని కేసర్‌పురా హైస్కూల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత 33 ఏళ్లుగా టీచర్‌గా సేవలందించిన సుశీలా శనివారం పదవి విరమణ చేశారు. తల్లి రిటైర్మెంట్ కార్యక్రమం గురించి తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు యోగేశ్ చౌహాన్ నాలుగు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. పదవీ విరమణ రోజును తల్లికి మధురమైన జ్ఞాపకంగా మలిచేందుకు యోగేశ్ అదిరిపోయే ఆలోచన చేశాడు. ఆమె కోసం ఏకంగా హెలికాప్టర్ రైడ్‌ను బుక్ చేశాడు. హెలికాప్టర్లో తల్లిని స్కూల్ నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లాడు. ఇందుకు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి కూడా తీసుకున్నాడు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. తల్లి ఆనందం కోసం కొడుకు చేసిన మంచి పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. చదవండి: Zomato: వీల్‌చైర్‌లో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ.. నెటిజన్ల ప్రశంసలు Rajasthan| A son gifted his mother helicopter ride as a retirement gift in Ajmer My mother retired as a teacher. I wanted to do something special for her& decided to book her a memorable helicopter ride to reach home. Didn't expect crowd,but feels great:Son Yogesh Chauhan (30.7) pic.twitter.com/adBoBIhOEV — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) July 31, 2022 దీనిపై యోగేశ్ చౌహాన్ మాట్లాడుతూ..‘ మా అమ్మ టీచర్‌గా రిటైరయ్యింది. నేను ఆమె కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకున్నాను. అందుకే అమ్మను ఇంటికి తీసుకెళ్లడానికి హెలికాప్టర్‌ను బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సమయంలో ఇంత మంది గుమికూడతారని ఊహించలేదు. అది మాకు మరింత సంతోషాన్నిచ్చింది.’ అని తెలిపాడు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన యోగేష్ ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తున్నారు. -
ఆసుపత్రిలోకి నో ఎంట్రీ.. రోడ్డుపైనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్!
న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ — Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022 గాజియాబాద్‌లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు -
వావ్.. సముద్రం అడుగున ఆక్టోపస్‌తో స్కూబా డైవర్ ఆటలు
ఎన్నో అద్భుతాలు, అందమైన జీవులకు నిలయం సముద్ర గర్భం. అక్కడ కన్పించే జలచరాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఒక్కసారైనా వాటి దగ్గరకు వెళ్తే బాగుండనిపిస్తుంది. సాధారణ మనుషులకు ఇది కష్టమే అయినా స్కూబా డైవర్లు చాలా ఈజీ. వారు చాలా సార్లు సముద్రం అడుగుకు వెళ్తుంటారు. ఇప్పుడు అలాంటి స్కూబా డైవర్ వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. సముద్ర గర్భంలో అతడు ఆక్టోపస్‌తో సరదాగా ఆడుకున్నాడు. అది కూడా అతనితో చనువుగా మెదిలింది. స్కూబ్ డైవర్ అరచేతి చూపగానే ఆక్టోపస్ అటువైపే దూసుకెళ్లింది. ఇలా రెండు మూడు సార్లు చేసిన తర్వాత.. ఆక్టోపస్ అతని చేతిపైకి వెళ్లి సేదతీరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీనికి దాదాపు 30లక్షల వ్యూస్ వచ్చాయి. దీన్ని చూసిన కొంతమంది నెటిజన్లు సరదా కామెంట్లు పెట్టారు. స్కూబా డైవర్‌కు ఆక్టోపస్ హగ్ ఇచ్చిందని, అతను చాలా లక్కీ అని చమత్కరించారు. చదవండి: 11ఏళ్ల తర్వాత హాలిడే.. ఎగ్జైట్మెంట్లో తాగి విమానంలో రచ్చ రచ్చ.. -
హృదయ విదారకం.. 10 ఏళ్ల బాలుడిని మింగిన మొసలి..
-
సైకిల్ తొక్కుతూ జారిపడ్డ అమెరికా అధ్యక్షుడు: వీడియో వైరల్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన భార్య జిల్ బైడెన్‌తో కలిసి డెలావేర్‌లోని తమ ఇంటికి సమీపంలోని రెహోబోత్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐతే అధ్యక్షుడు బైడెన్ శనివారం సైకిల్ పై సరదాగా రైడింగ్‌కి వెళ్లారు. అనుకోకుండా హఠాత్తుగా సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేసుకోలేక పోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయాడు. ఆ తదుపరి తనంతట తానే లేచిన బైడెన్.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. ఈ మేరకు ఈ విషయాన్ని అమెరికా శ్వేత సౌధం వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది. Biden just beefed it on his bike in Delaware pic.twitter.com/eYj2oG0tHJ — Quoth the Raven (@QTRResearch) June 18, 2022 (చదవండి: పార్క్ చేసిని కారులో ఏకంగా 47 పిల్లులు ! ఫోటో వైరల్) -
అమ్మ బాబోయ్.. రైల్వే బ్రిడ్జిపై షాక్ తిన్న ప్యాసింజర్
రైల్వే బ్రిడ్జిపై రైలు ముందుకెళ్తోంది. వాటర్ వ్యూను ఆస్వాదించే ఉద్దేశంతో ప్రయాణికులు డోర్లు, కిటికీల దగ్గరకు వచ్చి చేరారు. ఇద్దరు యువకుల్లో ఒకడు.. తన జేబు నుంచి మొబైల్ తీసి దృశ్యాన్ని షూట్ చేస్తున్నాడు. ఉన్నట్లుండి ఆ ప్రయాణికుడికి ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. రెయిలింగ్‌కు వేలాడుతున్న ఓ వ్యక్తి.. ప్యాసింజర్ చేతిలో ఫోన్‌ను రెప్పపాటులో లాగేసుకున్నాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదుగానీ.. బీహార్ బెగుసారాయ్‌లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రెయిలింగ్‌కు కట్టేసుకుని.. ముఖానికి ముసుగు దొంగకు ముద్దుగా స్పైడర్‌మ్యాన్ అని పేరు పెట్టారు నెటిజన్స్. -
ఇదేం బౌలింగ్ యాక్షన్రా బాబు.. చూస్తే వావ్ అనాల్సిందే.. వీడియో వైరల్
Womens T20 Challenge: మహిళల టీ20 ఛాలెంజ్‌లో భాగంగా మంగళవారం సూపర్‌నోవాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ స్పిన్నర్ సోనావానే ప్రత్యేక బౌలింగ్ యాక్షన్‌తో ఆకట్టుకుంది. సోనావానే డెలివరీ వేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్ చేస్తుంది. సోనావానే బౌలింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సోనావానే బౌలింగ్ యాక్షన్‌ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్‌తో అభిమానులు పోల్చుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సూపర్‌నోవాస్‌పై 7 వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నోవాస్ బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 71 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక వెలాసిటీ బౌలర్లలో క్రాస్ రెండు వికెట్లు, దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలా వికెట్ సాధించారు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెలాసిటీ 3 వికెట్లు కోల్పోయి చేధించింది. వెలాసిటీ బ్యాటర్లలో షఫాలీ వర్మ(51),లారా వోల్వార్డ్ట్(51) పరుగులతో రాణించారు. చదవండి: IPL 2022: 'నాకు రాజస్తాన్ ఒక కుటుంబం వంటిది.. వార్న్ సార్ ఆశీస్సులు నాకు ఉన్నాయి' Debut for 23 year old leg spinner from Maharashtra, Maya Sonawane#My11CircleWT20C#WomensT20Challenge2022 pic.twitter.com/IRylJ62EGx — WomensCricCraze🏏( Womens T20 Challenge) (@WomensCricCraze) May 24, 2022 -
రాజస్థాన్ ప్లేయర్లు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌లో అల్లకల్లోలం.. విమానం దించాలంటూ కేకలు..!
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ ఆడేందుకు కోల్‌కతా బయల్దేరిన రాజస్థాన్ రాయల్స్ బృందానికి చేదు అనుభవం ఎదురైంది. నిన్న (మే 22) ముంబై నుంచి ఆర్ఆర్ బృందంతో బయల్దేరిన ప్రత్యేక విమానంలో కొంత సేపు గందరగోళ వాతావరణం నెలకొంది. వాతావరణ మార్పుల కారణంగా విమానంలోకి ఒక్కసారిగా దట్టమైన పొగమంచు వచ్చి చేరింది. దీంతో రాజస్థాన్ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఆర్ఆర్ బృందంలోని ఓ వ్యక్తి.. విమానం దించాలంటూ గట్టిగా కేకలు వేశాడు. View this post on Instagram A post shared by Rajasthan Royals (@rajasthanroyals) అయితే కొద్ది సేపటికే పొగమంచు మొత్తం క్లియర్ కావడంతో విమానంలో ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో 'హల్లా బోల్' అనే నినాదాలతో విమానం మార్మోగింది. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ తమ ట్విటర్ హ్యాండిల్లో పోస్టు చేయగా ప్రస్తుతం వైరలవుతోంది. ఈ వీడియోలో యశస్వి జైస్వాల్ తదితర సభ్యులు కనిపించారు. కాగా, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఆర్ఆర్ సభ్యులు ప్రయాణిస్తున్న విమానం మేఘాల్లో నుంచి దూసుకుపోవడంతో ఫ్లైట్‌లోకి పొగమంచు చేరింది. ఇదిలా ఉంటే, సీఎస్కేపై విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో లీగ్ దశను ముగించిన విషయం తెలిసిందే. శాంసన్ సేన మే 24న ఈడెన్ గార్డెన్స్‌లో టేబుల్ టాపర్ అయిన గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు తలపడుతుంది. చదవండి: లివింగ్‌స్టోన్ విధ్వంసం.. చివరి పోరులో పంజాబ్ చేతిలో చిత్తైన సన్‌రైజర్స్ -
యుగ పురుషుడు.. ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం.. ఆ తర్వాత..
ముగ్గురు మహిళలతో 15 ఏళ్లుగా ఓ వ్యక్తి సహజీవనం చేశాడు. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉండగా.. తాజాగా పిల్లల ఎదుటే ఒకే వేదికపై సదరు వ్యక్తి ఆ ముగ్గురు మహిళలను పెళ్లి చేసుకున్నాడు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అలీరాజపూర్‌లోని గిరిజిన తెగకు చెందిన సమర్థ్ మౌర్య(42) 15 సంవత్సరాలుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేస్తున్నాడు. తాజాగా వారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ సందర్బంగా మౌర్య మాట్లాడుతూ.. 2003లో మొదటి భాగస్వామితో పరిచయం ఏర్పడినట్టు తెలిపాడు. అనంతరం మరో ఇద్దరితో కలిసి సహజీవనం చేస్తున్నానని అన్నాడు. ఏప్రిల్ 30వ తేదీన ఒకే మండపంలో నాన్‌బాయి, మేళా, సక్రీలను పెళ్లి చేసుకున్నానని పేర్కొన్నాడు. 15 ஆண்டுகள் 3 பெண்களுடன் லிவிங் டுகெதர்.. 6 குழந்தைகள் முன்னிலையில் நடைபெற்ற திருமணம்..! #MadhyaPradesh | #Alirajpur | #LiveInRelationship pic.twitter.com/lUVxNdwkuX — Polimer News (@polimernews) May 3, 2022 ఇదిలా ఉండగా.. తమ సంప్రదాయం ప్రకారం తనకు వివాహం జరిగే వరకు ఏ కార్యక్రమానికి కూడా మౌర్యను అనుమతించలేదని అన్నాడు. కాగా, వీరి వివాహానికి గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. Madhya Pradesh: A man living in a live-in relationship with three women entered into a wedlock with all the three in the presence of the entire village. The wedding took place in Nanpur village in the tribal-dominated Alirajpur district. pic.twitter.com/oePIwFb5ss — Free Press Journal (@fpjindia) May 2, 2022 -
సిగ్గుచేటు.. బయటోడికి, మనోడికి తేడా తెలియడం లేదా?
కేకేఆర్ ఆటగాడు.. సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిపోయింది. అదేంటి ఇంకా ఐపీఎల్ ప్రారంభం కాకముందే అలా ఎలా అని ఆశ్చర్యపోకండి. అతని పేరు మార్మోగిపోవడానికి కారణం ఒక సీనియర్ జర్నలిస్ట్ చేసిన పని. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 15వ సీజన్ మరో మూడురోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ మీడియా చానెల్స్ ప్యానెల్ చర్చలు జరుపుతున్నాయి. వారి చర్చల్లో ఈసారి ఐపీఎల్ విజేతలుగా నిలిచే అవకాశం ఎవరికి ఉంది.. జట్టు బలబలాలు, ఆయా జట్ల గేమ్ స్ట్రాటజీ ఏంటనే దానిపై సీరియస్ చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్యానెల్లో కేకేఆర్ జట్టు చర్చకు వచ్చింది ఒక సీనియర్ జర్నలిస్ట్ అదే జట్టులోని షెల్డన్ జాక్సన్‌ను విదేశీ ప్లేయర్‌గా పేర్కొన్నాడు. వాస్తవానికి షెల్డన్ జాక్సన్ పేరు విదేశీయుల పేరుకు దగ్గరగా ఉండడంతో సదరు జర్నలిస్ట్ అతను ఫారిన్ ప్లేయరేమోనని భావించాడు. షెల్డన్ జాక్సన్ గురించి మాట్లాడేటప్పుడు సదరు జర్నలిస్ట్ విదేశీ ఆటగాడిగానే సంభోదించాడు. పక్కనున్న మిగతావారు కూడా అతనికి వంత పాడారు. ఇది చూసిన అభిమానులు ఊరుకుంటారా..చర్చ జరిపిన ప్యానెల్‌ను మొత్తం ఎండగట్టారు. విదేశీ ఆటగాడికి.. మనోడికి తేడా తెలియడం లేదా.. క్రికెట్‌పై సరైన అవగాహన లేని ప్రతీఒక్కరు మీటింగ్‌లు పెడుతున్నారు.. వాస్తవం ఏంటనేది తెలసుకొని ప్యానెల్ చర్చలు నిర్వహించండి.. ఇది నిజంగా సిగ్గుచేటు.. అంటూ కామెంట్స్ చేశారు. అయితే చివరలో అసలు విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ సహా మిగతా సభ్యులు తాము చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ చెప్పడం కొసమెరుపు. గుజరాత్‌కు చెందిన షెల్డన్ జాక్సన్ 2013లో ఆర్సీబీ తరపున తొలిసారి ఐపీఎల్లో అడుగుపెట్టాడు. కానీ ఆ జట్టుకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత 2017 నుంచి షెల్డన్ జాక్సన్ కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇటీవలే జరిగిన మెగావేలంలో షెల్డన్ జాక్సన్‌ను కేకేఆర్ మరోసారి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్లో కేకేఆర్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడి 38 పరుగులు చేశాడు. ఇక రైల్వే జట్టుకు ఆడడం ద్వారా షెల్డన్ జాక్సన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 79 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 5947 పరుగులు సాధించాడు. ఇందులో 19 సెంచరీలు.. 31 అర్థసెంచరీలు ఉన్నాయి. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 67 మ్యాచ్‌లాడి 8 సెంచరీలు.. 12 అర్థసెంచరీల సాయంతో 2346 పరుగులు చేశాడు. ఇక 62 టి20 మ్యాచ్‌ల్లో 1511 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ అభిమానులకు గుడ్‌న్యూస్ @vikrantgupta73 kaise journalist hai aapke pass, unko ye bhi nahi pata ki Sheldon Jackson Indian hai Humko hi bula lete isse accha https://t.co/qbMydPLRs0 — Vedant (@vedant78_boi) March 23, 2022 Nowhere during this clip or during the entire show did I ever mention #SheldonJackson as a foreign player. My bad I didn’t realise when he got called an overseas entrant. Pls go through the entire show because I am very well aware of Sheldon’s achievements for Indian cricket. 🙏 https://t.co/W1M5WcUfLz — Rahul Rawat (@rawatrahul9) March 23, 2022 This is height of comedy! The so called cricket experts on #SportsTak are continuously calling Sheldon Jackson a foreign player. Shame! pic.twitter.com/aNTPEbh3xX — راغب रागीब (@dr_raghib) March 22, 2022 So, It's confirmed by so called cricket experts that Sheldon Jackson is a foreign player 🙂. Shame !!! — Dilip Singh Rathour (@dilipsrathour) March 23, 2022 -
జిమ్‌లో దిశా పటానీ హాట్ వీడియో.. నెట్టింట వైరల్
Disha Patani Workout Gym Video: మెగా హీరో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్గా లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హాట్ బ్యూటీ దిశా పటానీ. ఆ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించలేదు. బాలీవుడ్లోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ సిరీస్ వంటి చిత్రాలతో అభిమానులను అలరించింది. బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు పుకార్లను ఎదుర్కొంటున్న ఈ ఫిట్నెస్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన హాట్ ఫొటోలు, ఫోజులు, వీడియోలతో అభిమానుల గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది. ఇటీవల ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: బికినీ ఫొటో అడిగాడు.. హీరోయిన్ రిప్లైకి షాక్ అయ్యాడు బుధవారం (మార్చి 16) దిశా పటానీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది. సాధారణంగానే దిశా తన అభిమానులకు ఫిట్నెస్ గోల్స్, సూచనలు చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన హాట్ వర్క్ అవుట్ వీడియోను పంచుకుంది. ఈ వీడియోల దిశా తన టోన్డ్ బ్యాక్‌ను చూపిస్తూ జిమ్‌లో వైడ్ గ్రిప్ పుల్ చేస్తూ దర్శనమిచ్చింది. వర్క్ అవుట్ చేస్తున్న దిశా అందం చూసిన అభిమానులు, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. కాగా దిశా పటానీ ఇటీవలే సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన కరణ్ జోహార్ యాక్షన్ డ్రామా 'యోధా' చిత్రీకరణను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆమె నటించిన 'ఏక్ విలన్ 2' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. చదవండి: టైగర్ ష్రాఫ్ యాక్షన్ సీన్స్ కోసం ఖరీదైన కార్లు !.. దిశా పటాని కామెంట్ View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) -
రామ్ చరణ్-ఉపాసనల ఫన్నీ వీడియో .. నెట్టింట వైరల్
Ram Charan And Upasana Funny Video Goes Viral: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధారణంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెకేషన్ లోని సరదా సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిన్ లాండ్ లో ఉపాసనతో రామ్ చరణ్ ఫన్నీగా గడిపిన సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. అంతేకాకుండా ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం సరదాగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో చూడండి. #RamCharan and #Upasana's adorable video from their recent fun filled vacation to Finland@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/BEU7Nu7iDY — BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2022 -
సింహాన్ని ఎత్తి పడేసిందిగా...దెబ్బకు పరుగు లంకించింది
A shocking video Bull forceful way To Lift Lion: సహజంగా జంతవుల దాడి చేసుకుంటుంటాయి. అవి ఒక్కోసారి ఘోరంగా కూడా ఉంటాయి. అయితే పులి వేట గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది వేటాడిందంటే ఏ జంతువైన దాని పంజా దెబ్బకి పడిపోవాల్సింది. చాలా వరకు ఏ జంతువునైనా అది సునాయాసంగా పట్టుకుని దాడి చేస్తుంది. ఏమైందో ఏమో ఈ ఎద్దు వద్ద ఆ సింహం ఆటలు సాగలేదు. పైగా దాన్ని చూసి పారిపోయింది. వివరాల్లోకెళ్తే...టాంజానియాలోని తరంగిరే నేషనల్ పార్క్‌లో ఒక ఎద్దు పైకి సింహం దాడి చేస్తుంది. ఆ ఎద్దుని గట్టిగా పట్టుకుంటుంది. కానీ ఆ ఎద్దుని విపరీతమైన కోపంతో ఆ సింహాన్ని కొమ్ములతో ఎత్తిపడేసి ఒక్కసారిగి దాడి చేసింది. ఆ సింహాన్ని పరిగెట్టెంత వరకు తరిమి తరిమి కొట్టింది. అయితే ఈ ఆ పార్క్ వద్దకు వచ్చిన కొంత మంది పర్యాటకు ఈ ఘటనను చిత్రించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Tanzania destination safari (@tanzania_destination_vacations) (చదవండి: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!) -
పోయే కాలం అంటే ఇదేనేమో.. సోషల్ మీడియాను షేక్ చేసిన మహిళ
లక్నో: ఓ మహిళ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆమె చేసిన పనికి అందరూ ముక్కున వేలేసుకున్నారు. కిటికీ కోసం ప్రాణాలనే ఫణంగా పెట్టడమేంటని ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. ఓ వీర వనిత చేసిన ఈ స్పెషల్ ఫీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి సదరు మహిళపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఉత్తరప్రేదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఆ ప్రాంతంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో నివాసం ఉంటోంది. కాగా, తన ఇంట్లోని కిటికీని క్లీన్ చేయాలని సదరు మహిళ నిర్ణయించుకుంది. వెంటనే ఓ క్లాత్ తీసుకుని రంగంలోకి దిగింది. అయితే నాలుగో అంతస్తులో ఉన్న ఆమె.. ఎలాంటి సపోర్ట్ లేకుండా అంత ఎత్తులో ఒంటి చేత్తో కిటికీని క్లీన్ చేసింది. ఆమె పని చేస్తున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. She is a woman...can do anything.. A woman was seen hanging on to the railing of the fourth floor and cleaning the window. #Ghaziabad,#UttarPradesh.#LadkiHoonLadSaktiHoon (मैं एक लड़की हूं, मैं लड़ सकती हूं) 👇👇 pic.twitter.com/NJNlDX7njv — Mitesh Bambhaniya (@IamMitesh86) February 21, 2022 దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు మహిళ చేసిన పనికి.. కొందరు ఆమెను డేరింగ్ ఉమెన్ అని పొడుగుతుంటే.. ప్రాణాలను లెక్క చేయకపోవడం ఆమె పిచ్చితనమంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
వాడుకుందాం.. వదిలేద్దాం.. అచ్చెన్న వ్యాఖ్యలు వైరల్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘నేను పార్టీ ఆఫీస్‌లో ఉన్నాను.. వాడు(మామిడి గోవిందరావు) వచ్చి చంద్రబాబు నాయుడుకు ఒక చెక్కు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు అది తీసుకున్నాడు. చెక్కు కాదు వాడు ఆస్తి రాసి ఇమ్మను. పార్టీ వాడుకుంటుంది. మామిడి గోవిందరావుకు టిక్కెట్ ఆలోచన ఎందుకు. కలలో కూడా అది ఉహిస్తారా...’ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామమైన నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమంలో చేసిన వాఖ్యలివి. ఒక పార్టీ నాయకుడిని పట్టుకుని ‘వాడు’ అంటూ సంబోధిస్తూ మాట్లాడిన ఆయన మాటలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. దీన్ని చూసి టీడీపీలో ఎవరినైనా వాడుకుని, వదిలేస్తారనే చర్చ నడుస్తోంది. చదవండి: టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్ డబుల్ గేమ్.. పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మరో నేత మామిడి గోవిందరావు మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తనకే టిక్కెట్ వస్తుందనే విధంగా మామిడి గోవిందరావు పనిచేసుకుంటున్నారు. తరచూ పార్టీలు మారుతున్నా 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి, మళ్లీ టీడీపీలోకి వచ్చిన కారణంగానే తనకు తప్పనిసరిగా టిక్కెట్ ఇస్తారన్న నమ్మకంతో కలమట వెంకటరమణ ఉన్నారు. కాకపోతే, పార్టీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా మామిడి గోవిందరావు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ప్రతి చోటా తనకే టిక్కెట్ వస్తుందన్న విషయాన్ని చెప్పుకుంటున్నారు. మామిడి ప్రచార దూకుడు, వ్యూహాత్మక అడుగులను తట్టుకోలేక, అభద్రతా భావంతో కలమట వెంకటరమణ గత కొన్నాళ్లుగా టీడీపీలో స్తబ్ధుగా ఉంటున్నారు. ఆ మధ్య జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి సైతం గైర్హాజరయ్యారు. అయితే మామిడి గోవిందరావు వెనక అచ్చెన్నాయుడు ఉన్నారనే అనుమానం కలమటలో మొదలైంది. ఆయన అండతోనే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారనే అభిప్రాయం కలమటలో నాటుకుపోయింది. దీంతో ఏదో ఒకటి తేల్చుకోవాల న్న ఉద్దేశంతో బుధవారం అచ్చెన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహనాయుడు వద్ద తన విషయాన్ని ప్రస్తావించారు. ‘మీరు లేనప్పుడు మాట్లాడటం నాకు ఇష్టం లేదు. అందుకే మీ ఇద్దరి దగ్గరే మా నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ తీసుకోవాలని అనుకుంటున్నా’నంటూ తన మనసులో ఉన్న ఆవేదన, అక్కసు, అభద్రతను కలమట వెంకటరమణ వ్యక్తం చేశారు. దీనికి అచ్చెన్నాయుడు స్పందిస్తూ ‘అసలా ఆలోచన ఎందుకు రావాలి? మొన్న కూడా అదే చెప్పాను. ఎందుకు అభద్రతా భావం. కలలో కూడా ఆలోచన లేదు. నా ప్రయత్నం ఏమిటంటే వాడు కూడా నీకు ఉపయోగపడతాడని, నీ చేతిలో పెట్టాల ని నా ప్రయత్నం. నా ఆలోచన అదే. నేననేది వాడు చేయకపోయినా ఫర్వాలేదు. మన వెనక తిరిగినట్టు ఉంటే కొంత... ఆ మెసేజ్ వెళతాది కదా?’ అంటూ చమత్కారంగా చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబుకు చెక్ ఇచ్చాడు... తీసుకున్నాం... తర్వాత చెక్ కాదు కదా ఆస్తి రాసిచ్చినా పార్టీకి వాడుకుంటాం...’ అంటూ వాడుకోవాలన్నదే మన ఉద్దేశమని స్పష్టంగా కలమటకు చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలు ఆడియో, వీడియోతో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. అచ్చె న్న డబుల్ గేమ్ అడుతున్నారని.. పార్టీకి పనిచేసినోళ్లందరినీ వాడుకోవడానికే తప్ప మరే దానికి కాదని ఈ వీడియో క్లిప్పింగ్ చూశాక టీడీపీ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. -
గల్లీలో పల్లీలు అమ్ముకుంటూనే వరల్డ్ ఫేమస్ అయ్యాడు
ఎప్పుడో రెండు నెలల కిందట మొదలైన ‘కచ్చా బాదాం’ మేనియా.. మళ్లీ తెర మీద ఊపేస్తోంది. అందుకు కారణం.. అంజలీ అరోరా అనే అమ్మాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో తన ఇన్‌స్టా రీల్లో హాట్ హాట్‌గా చిందులేసిన ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేశారనే వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. అంతేకాదు.. కచ్చా బాదం సాంగ్ హక్కులు తన పేర ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ ఈ పాట ఒరిజినల్ క్రియేటర్ పోలీసులను ఆశ్రయించాడంటూ కొన్ని మీడియా హౌజ్‌లలో కథనాలు వెలువడుతున్నాయి. ఇంతకీ ఈ కచ్చా బాదం లొల్లి ఏంటి? వైరల్ అవుతున్న ఆ వార్తల్లో నిజమేంత? చూద్దాం.. ఏడాది కిందట.. గల్లీలలో సైకిల్ మీద, బైక్ మీద తిరుగుతూ పచ్చి పల్లీలు(కచ్చా బాదాం) అమ్ముకునే ఓ వ్యక్తి పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ‘పాత సామాన్లు ఇచ్చి.. పచ్చి పల్లీలు తీసుకెళ్లండంటూ’ గల్లీలో తిరుగుతూ తనదైన శైలిలో పాడుతూ జనాల్ని ఆకట్టుకునేవాడు భూబన్ బద్యాకర్. అతని వీడియోలు కొన్ని వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా ‘ఎక్తారా’ అనే యూట్యూబ్ ఛానెల్‌కు చేరాయి. దీంతో ఒక ఫుల్‌లెంగ్త్ వీడియో తీసి, ఎడిట్ చేసి యూట్యూబ్‌లో వదలడంతో 21 మిలియన్‌కి పైగా వ్యూస్ వచ్చాయి. అలా కచ్చా బాదాం వెర్షన్ ఫేమస్ కావడం మొదలైంది. ఆపై ఆ పాట ఇన్‌స్టాగ్రామ్‌కు చేరగా.. సింగర్, మ్యూజీషియన్ నజ్మూ రియాఛాట్ ఆ వీడియోను రీమిక్స్ చేసి వదిలాడు. అలా ఆ రీమిక్స్ వెర్షన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ కావడం మొదలైంది. మరోవైపు బాదం అఫీషియల్ ర్యాప్ వెర్షన్‌ను భూబన్తో కలిసి కట్టారు రోన్ఈ, ప్రగ్యా అనే ర్యాపర్లు. అలా యూట్యూబ్‌కు అఫీషియల్‌గా ర్యాప్ సాంగ్ ద్వారా పరిచయం అయ్యాడు ఆ పల్లీలు అమ్ముకునే చిరువ్యాపారి. ఆ వీడియోకు ఇప్పటిదాకా 33 మిలియన్ వ్యూస్పైగా వచ్చాయి. ఆపై ఎన్నెన్నో వెర్షన్లు వస్తూనే ఉన్నాయి. కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో కచ్చా బాదాం పాపులర్ అయ్యింది మాత్రం నజ్మూ రియాఛాట్ వెర్షన్‌తోనే!. View this post on Instagram A post shared by Nazmu Reachat (@nazmureachat) రండమ్మా.. రండి పశ్చిమ బెంగాల్‌లోని లక్ష్మీనారాయణపూర్ కురల్జురీ గ్రామం.. భూబన్ స్వస్థలం. భార్యతో పాటు ముగ్గురు పిల్లల తండ్రైన భూబన్.. పచ్చి పల్లీలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పాత సామాన్లు, పగిలిపోయిన వస్తువులకు బదులు పల్లీలు ఇస్తూ.. వాటిని జంక్ షాపుల్లో అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. అలా అమ్మేయగా వచ్చిన డబ్బు రూ.250 నుంచి 300రూ. మాత్రమే. ఆ అమ్మడంలోనూ.. స్థానిక భాషలో అరవడంలోనూ ప్రత్యేకత ఉండాలనేది అతని తాపత్రయం. అదే అతనిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసేసింది. అందిన ఆర్థిక సాయం.. కచ్చా బాదం పాట ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. నెటిజనులు, స్థానిక నేతల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అంతా అడిక్ట్ అయిపోయారు. కొరియాతో పాటు ఆఫ్రికా దేశాలకు సైతం పాకేసింది. షార్ట్ వీడియోస్‌లో రికార్డు స్థాయిలో వీడియోలతో కచ్చా బాదం రీమిక్స్ ఏలుతుండగా.. ఆ సాంగ్ ఒరిజినల్ క్రియేటర్ భూబన్ బద్యాకర్కి తగిన గుర్తింపూ దక్కింది. ఒకానొక దశలో పాట మీద రైట్స్ కోసం ఆయన్ని పోలీసులను ఆశ్రయించాడనే వార్త ఒకటి చక్కర్లు కొట్టింది. View this post on Instagram A post shared by Khaby Lame (@khaby00) అయితే అందులో వాస్తవం ఉంది. అయితే ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. కాపీ రైట్స్ వ్యవహారం తమ చేతుల్లో లేదంటూనే.. భూబన్‌కి కొంత ఆర్థిక సాయం చేశారు. అంతేకాదు పలువురు పొలిటీషియన్లు, స్థానికులు, ఆయనకు చాలా సాయం అందించారు. ప్రభుత్వం కూడా స్పందించి.. తనకు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతున్నాడు భూబన్. ఎప్పటిలాగానే తన వ్యాపారం చేసుకుంటూ.. అడపా దడపా ఇంటర్నెట్లో కనిపించాలని అనుకుంటున్నాడు. అంతేకాదు త్వరలో టీమిండియా దాదా సౌరవ్ గంగూలీతో కలిసి ఓ రియాలిటీ షోలో(దాదాగిరి అన్లిమిటెడ్ సీజన్9లో) భూబన్ బద్యాకర్ సందడి చేయబోతున్నాడు. అదీ సంగతి! ఎవరీ అంజలి.. అంజలి అరోరా.. వయసు 22 ఏళ్లు. టిక్‌టాక్ ఉన్న టైంలో పాపులర్ అయిన నార్త్ నిబ్బీ. ఢిల్లీకి చెందిన! అంజలి ఒకవైపు మోడల్‌గానే రాణిస్తూ.. ఆ పాపులారిటీతో కొన్ని షార్ట్ ఫిల్మ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తోంది. ఈ తరుణంలో కచ్చా బాదాం వెర్షన్‌కి ఈ అమ్మడు వేసిన స్టెప్స్ యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ఆ ఒక్క వీడియోతో అంజలి ఫాలోవర్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. అయితే ఆమె వీడియోస్‌ను తీసేది ఆమె తండ్రే. పైగా ఆమె చిందులూ హాట్ హాట్‌గా ఉన్నాయి. అందుకే ఆమెపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో జరిగింది. నార్త్ నుంచి సౌత్ దాకా దేశం మొత్తం.. బాషాబేధాలకు అతీతంగా సోషల్ మీడియాలో ఆమె కచ్చా బాదాం వెర్షన్ వైరల్ అయ్యింది. అంజలి ఇన్స్పిరేషన్తో మరికొందరు అమ్మాయిలు సైతం అలాంటి డ్యాన్స్‌లకే ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు. ఈ తరుణంలో హాట్ డ్యాన్సులు వేసినందుకు ఆమె అరెస్ట్ అయ్యిందంటూ ఓ పుకారు చెలరేగగా.. అందులో వాస్తవం లేదని ఆమె తండ్రి స్థానిక మీడియా ఛానెల్స్‌కు వివరణ ఇచ్చాడు. View this post on Instagram A post shared by Anjali Arora (@anjimaxuofficially) -
జిమ్‌లో బుట్టబొమ్మ కసరత్తులు.. 'ప్రేరణ' పొందేలా
సినిమా అనే రంగుల ప్రపంచంలో అందమైన హీరోయిన్లు ఆకాశంలో మెరిసే నక్షత్రాల్లాంటి వాళ్లు. అందుకే తమ అందానికి, ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. సినిమాల్లో అందం, అభినయంతో ఆకట్టుకునేందుకు అనేక కసరత్తులు చేస్తుంటారు. కథానాయికలకు చక్కటి రూపుతో పాటు ఆకర్షించే శరీరాకృతి కూడా ముఖ్యమే. ఇది తెలిసిన హీరోయిన్లు విజయంతో దూసుకెళ్తుంటే దీన్ని వంటపట్టిచ్చుకోని ముద్దుగుమ్మలు అవకాశాలు లేక కనుమరుగైపోతున్నారు. ఇక ఇదంతా పోతే ఫిట్‌నెస్‌కు అధిక ప్రాముఖ్యత ఇచ్చే హీరోయిన్లలో బుట్ట బొమ్మ పూజా హెగ్డె ఒకరు. ఆమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని చెప్పడానికి ఆమె చక్కటి ఫిజిక్యే నిదర్శనం. (చదవండి: ఆ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్ చేశా: పూజా హెగ్డె) తాజాగా పూజా హెగ్డె జిమ్‌లో చెమట చిందించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన ఎక్సర్సైజ్ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసుకుంది. నెమ్మదిగా, నియంత్రిత కదలికలు. తర్వాత ప్రయత్నించండి అని క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ భామ. ఈ వీడియోలో రెడ్ కలర్ మ్యాచింగ్ స్పోర్ట్స్ డ్రెస్‌తో వర్క్అవుట్ చేస్తుంటే తన ట్రైనర్ ఎలా చేయాలో నేర్పించడం చూడొచ్చు. తన వర్క్అవుట్ వీడియోలతో అందంతోపాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమే అని తన అభిమానులకు, తదితర హీరోయిన్లకు 'ప్రేరణ' కలిగిస్తోంది ఈ 'రాధేశ్యామ్' బ్యూటీ. -
నోట్లో సిగరెట్, చేతిలో గన్.. జాంజాం అని బుల్లెట్ రైడింగ్.. విషయం బయటపడటంతో..
సోషల్ మీడియా స్టార్డమ్ కోసం రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. అంతేకాదు ఈ స్టార్డమ్ కోసం సినిమాల్లో చేసే భయంకరమైన స్టంట్లన్నింటిని చేసేస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక యువకుడు సినిమాలో మాదిరిగా బుల్లేట్ బండిపై తన స్నేహితుడితో కలిసి ఒక ప్రమాదకరమైన విన్యాసం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. అసలు విషయంలోకెళ్లితే....గుజరాత్‌లోని సూరత్‌లో ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్‌పై ఒక విన్యాసం చేశారు. ఒకరేమో బుల్లెట్ బండి నడుపుతుంటాడు. ఇంకొకరు బైక్ నడిపే వ్యక్తి పైన కూర్చొని చేతిలో పిస్టల్ పట్టుకుని తిప్పుతూ స్టైయిలిష్‌గా సిగరెట్ కాలుస్తుంటాడు. అలాగే వెనుక 'నాయక్ నహీ ఖల్నాయక్ హూన్' అనే పాట కూడా ప్లే అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాక ఆ యువకులిద్దరినీ అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ ప్రమాదకరమైన విన్యాసం చేసినందుకుగాను ఇద్దర్ని అరెస్టు చేశారు. తప్పయిందని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డా వినలేదు. వారిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. (చదవండి: చెట్టను నరికేస్తున్నాడని కోపంతో చచ్చేంతవరకు దారుణంగా కొట్టి!... చివరికి..) குஜராத் : சூரத் நகரில் கையில் துப்பாக்கி ஏந்தி பைக்கில் சுற்றிய இருவர் கைது pic.twitter.com/ede8RB4wAI — DON Updates (@DonUpdates_in) January 2, 2022 -
Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా!
Huge Crowd On Goa Beach Roads న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతున్న వేళ ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గోవాలో డిసెంబర్ చివరి వారం నుంచి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దీంతో క్రిస్టమస్-న్యూ ఇయర్ పండగ సీజన్లో కోవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం దాటిందని అధికారులు వెల్లడించారు. కాగా ఉత్తర గోవాలోని రోడ్లపై వందలాది మంది పర్యాటకులు నడుచుకుంటూ వెళ్తున్న వీడియో ఒకటి ‘కోవిడ్ వేక్కు ఇది రాయల్ వెల్కమ్’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియో వైరల్ అవుతోంది. గడచిన 24 గంటల్లో గోవాలో 388 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటన్ తెల్పుతోంది. కొత్త కేసులు పెరగడంతో కోస్తా రాష్ట్రంలో 1,81,570కి చేరుకోగా, మరణాల సంఖ్య 3,523కు పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపధ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినప్పటికీ, వేలాది దేశీయ పర్యాటకులు ఈ విధంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి గోవా బీచ్, పబ్‌లకు తరలిరావడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లలో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వాల్సిందిగా తాజాగా గోవా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: Visakhapatnam: 2 మృతదేహాలు లభ్యం, మిగతావారి కోసం ముమ్మర గాలింపు.. This was Baga Beach in Goa ,last night. Please take the Covid scenario seriously. This is a Royal welcome to the Covid wave 👋 Mostly tourists. pic.twitter.com/mcAdgpqFUO — HermanGomes_journo (@Herman_Gomes) January 2, 2022 -
చిచ్చర పిడుగు! ఎగ్జామ్స్‌లో కాపీ కొట్టేందుకు కొత్త ఎత్తులు..
పరీక్షల టైంలో విద్యార్ధులు కాపీ కొట్టకుండా టీచర్లు వెయ్యి కళ్లతో కాపేసుంటారు. ఐనా! కొందరుంటారులే.. అబ్బో కాపీ కొట్టడానికి మామూలు తెలివితేటాలు చూపించరు. ఇలా కూడా కాపీ కొడతారా అనే రేంజిలో ఉంటాయి మరి పథకాలు. అసలే కరోనా కాలంలో అంతంత మాత్రపు అత్తెసురు చదువులతో ఊగిసలాడుతుంటే, కొంతమంది విద్యార్ధులు ఎలాగోల పాస్ అయితే చాలు దేవుడా అన్నట్లు పరిస్థితులను తమకనుగునంగా ఎలా మార్చుకుంటున్నారో ఈ వీడియోపై జస్ట్ ఓ శాంపిల్ లుక్కెయ్యండి. క్లాస్ రూంలో మాస్కులు ధరించి ఎగ్జాం రాస్తున్న విద్యార్ధులు ఈ వీడియోలో కనిపిస్తారు. వీళ్లలో ఓ విద్యార్ధి మాస్కులోపల స్లిప్ పెట్టి దానిని చూసి పరీక్ష రాయడం కనిపిస్తుంది. ఐతే వెనుక కూర్చున్న విద్యార్ధి ఆశ్చర్యంతో నవ్వడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. సామాజిక మాద్యమాల్లో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. కపీ ఇలా కూడా జరుగుతుందని ఎవరూహించరని ఒకరు, కరోనా విపత్తును అవకాశంగా మార్చుకున్నాడని మరొకరు ఇలా నెటిజన్లు సరదాగా వేల కామెంట్లు చేస్తున్నారు. విద్యార్ధుల భవిష్యత్తుకు అది అంత మంచి మార్గం కాదనేది మనందరికీ తెలిసిందే! ఏదిఏమైనా కష్టపడేవారి కోసమే రాజమార్గాలు తెరచుకుంటాయనేది నిత్యసత్యం. మీరేమంటారు...? చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు! View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) -
స్టెప్పులతో ఇరగదీసిన జెనీలియా, సల్మాన్ : డ్యాన్సింగ్ వీడియో వైరల్
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బర్త్‌డే (డిసెంబరు 27, సోమవారం)సందర్భంగా హీరోయిన్ జెనీలియా డిసౌజా శుభాకాంక్షలు తెలిపారు. అయితే సల్మాన్ ఖాన్‌ను విష్ చేసేందుకు జెనీలియా సోమవారం సాయంత్రం పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. గతంలో జెనీలియా, సల్మాన్ ఖాన్ కలిసి డ్యాన్స్ చేసిన ఈ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.షేర్ చేసిన కొన్నిగంటల్లో, ఈ క్లిప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. పెద్ద మనసున్న సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సంతోషం, ప్రేమ, చక్కటి ఆరోగ్యంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ఆజ్ భాయ్ కా బర్త్‌డే హై." అంటూ జెనీలియా తనఇన్స్టాలో పోస్ట్ చేసింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులతోపాటు, హీరో, హీరోయిన్ల ద్వారా సల్మాన్‌కు శుభాకాంక్షల వెల్లువ కురిసింది. ముఖ్యంగా సల్మాన్ మాజీ ప్రేయసి, కొత్త పెళ్లి కూతురు, హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా సల్మాన్‌కు బర్త్‌డే విషెస్ అందించింది. కాగా సల్మాన్ ఖాన్ శనివారం రాత్రి పన్వేల్ ఫామ్‌హౌస్‌లో విషం లేని పాము కాటుకు గురయ్యారు. నవీ ముంబైలోని కమోథేలోని ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆదివారం ఉదయం డిశ్చార్జ్ అయిన సల్మాన్ కుటుంబంతో కలిసి సోమవారం తన ఫామ్‌హౌస్‌లో 56వ పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!
Pilots False Positive Covid Report: కొన్ని ప్రయాణాలు మనం మధురానుభూతుల్ని ఇస్తాయి. కానీ కొన్ని ప్రయాణాలు మాత్రం మనల్ని ఆందోళనకు గురిచేయడమే కాక మళ్లీ ఇంకెప్పుడు ప్రయాణాలు చేయకూడదనే భావం కలుగుతుంది. అచ్చం అలాంటి అనుభవం బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ప్రయాణీకులకు ఎదురైంది. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) అసలు విషయంలోకెళ్లితే.....బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణీకుల బృందం ఐదు గంటలకు పైగా చిక్కుకుపోయింది. వారు పయనిస్తున్న విమాన పైలట్‌కి కరోనా పాజిటివ్ రావడంతో లండన్ నుండి బార్బడోస్‌కు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్‌కు ముందు బ్రిటిష్ ఎయిర్వేస్ నిలిపివేసింది. అయితే అప్పటికప్పుడు మరో పైలెట్‌ని నియమించడం ఆలస్య అవుతుందని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రకటించడమే కాక ప్రయాణికులను విమానంలోంచి దింపేసింది. నిజానికి ఆ విమానం అప్పటికే రెంగు గంటలు ఆలస్యం. అయితే విమానం బయలుదేరడానికి సిద్ధం అయ్యిందో లేదా మళ్లీ ఈ కారణంగా మరింత ఆలస్యం అవ్వడంతో ప్రయాణికులు ఒకింత అసహనానికి గురైయ్యారు. అంతేకాదు ఆ ప్రయాణికులదరికి బ్రిటిష్ ఎయిర్వేస్ ఆహారాన్ని అందజేసింది. అయితే ఐదు గంటల తర్వాత ప్రయాణికులందర్నీ విమానం ఎక్కేందుకు అనుమతి ఇచ్చారు. కానీ కథలో ట్విస్ట్ ఏంటంటే పైలట్‌కి కోవిడ్ అని తప్పుడు రిపోర్ట్ వచ్చింది అంటూ ఎయిర్వేస్ ప్రకటించడం గమనార్హం. అంతేకాదు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమపణలు మాత్రమే కాదు మాకు చక్కగా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు అని బ్రిటిష్ ఎయిర్వేస్ ప్రయాణికులకు తెలియజేసింది. పైగా బార్బడోస్‌లో దిగినప్పుడు ఆలస్యానికి క్షమాపణలు కోరుతూ ప్రయాణికులకు కరేబియన్ రమ్ బాటిళ్లను అందజేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికురాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. (చదవండి: ఖాతాదారుడు తాకట్టు పెట్టిన ఆభరణాలను కొట్టేసిన బ్యాంక్ క్యాషియర్!) -
Humorous video: ఈ హెయిర్ స్టైల్‌తో నా అందం రెట్టింపవ్వాలి.. జాగ్రత్త!
అసలేంటో ఈ యేడాది మొత్తం షాకులమీద షాకులు ఎదురౌతున్నాయి. యేడాది చివరిలో కూడా వీటి ఉధృతి ఏమాత్రం తగ్గేదేలే! అనే విధంగా ఉంది చూడబోతే. లేకపోతే ఏంటండీ.. ఎక్కడైనా కోతి బార్బర్ షాప్‌కి వెళ్లడం, షేవ్ చేయించుకోవడం, దర్జాగా కూర్చుని హెయిర్ కటింగ్ చేయించుకోవడం కనీవినీ ఎరుగునా? అందుకే ఈ నిష్ఠూరమంతానూ! కాలం మారిపోయింది. అభిరుచులు మారిపోయాయి. ప్రస్తుతం స్త్రీలే కాదు పురుషుల డ్రస్ స్టైల్స్, ఆహార్యం, అభిరుచుల్లోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐతే రొటీన్‌కు భిన్నంగా కోతిగారికి తన అందం గురించి డౌట్ కొట్టినట్టుంది. స్టైల్ మార్చాలనుకుంది.సెలూన్‌కు వెళ్లింది. హెయిర్ డ్రెస్సర్స్ చైర్లో కూర్చుని, మెడ చుట్టూ షీట్ చుట్టించుకుంది. తర్వాత బార్బర్ వచ్చి దువ్వెనతో దువ్వుతూ ఎలక్ట్రిక్ ట్రింబర్తో షేవ్ చేయడం ప్రారంభించాడు. ఇక కోతిగారేమో బుద్ధిగా కూర్చుని చక్కగా షేవ్ చేయించుకోవడం, బార్బర్ చెప్పినట్లు సూచనలు పాటించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నెట్టింట కోతి బార్బర్ షాప్ విజిటింగ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంకేముంది ఈ క్యూట్ వీడియోను చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి, కామెంట్ల రూపంలో ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి.. अब लग रहे SMART☺️☺️☺️👌👌👌 BEAUTY_PARLOUR☺️☺️😊@ParveenKaswan @susantananda3 @SudhaRamenIFS @NaveedIRS @arunbothra @TheJohnAbraham pic.twitter.com/lCiy0tmqN0 — Rupin Sharma IPS (@rupin1992) November 29, 2021 -
జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి... పాండా ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!
Naughty Panda Briefly Escapes Enclosure Zoo At Beijing: ఇటీవల కాలంలో పలు జంతువుల జూ నుంచి తప్పించుకుని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాక ఒక ఆవు జంతు వధ నుంచి తప్పించుకుని ఒక పార్క్‌లోకి ప్రవేశించిన వీడియో కూడా నెటిజన్లను భలే ఆకర్షించింది. అచ్చం అలానే ఇక్కడొక చిలిపి పాండా భలేగా జూ నుంచి తప్పించుకునేందుకు యత్నించి మళ్లీ వెనక్కి వచ్చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) అసలు ఏం జరిగిందంటే...చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్లాన్ అనే ఆరేళ్ల పాండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పైగా పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్‌ని ఎక్కేస్తుంది. పైగా అక్కడ ఉన పర్యాటకులు దాన్ని ఉత్సహపరుస్తూ బయటకు వచ్చేలా పాండాను ప్రోత్సహించారు కూడా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) -
కడుగు.. కడుగు!! బాగా కడుగు.. ఈ దెబ్బతో కారు తళ తళ మెరిసిపోవాలి!
సొంత పనులు చేసుకోవడానికి కూడా తెగ బద్దకిస్తుంటారు కొంతమంది. ఐతే ఈ వీడియోలో కనిపించే చింపాంజీలు మాత్రం ఒళ్లొంచి ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఎవరప్పగించారోగానీ కారును నీళ్లతో శుభ్రంగా కడిగేస్తున్నాయి. జంతువులను చూసి పనులు ఎలా శ్రద్ధగా చేయాలో నేర్చుకోవాలనే విధంగా ఉంది వీటి పనితనం. మీరు ఓ లుక్కెయ్యండి! రెండు చింపాంజీలు బ్లాక్ కారుపై ఎక్కి కూర్చుని మరీ గ్లాస్‌ను నీట్‌గా రుద్ది రుద్ది కడగటం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఎంతో ప్రొఫెషనల్ క్లీనర్స్లా చేతితో క్లాత్ పట్టుకుని దర్జాగా కారును శుభ్రం చేస్తున్నాయి. ఇంతవరకూ మనుషులు మాత్రమే కార్లను క్లీన్ చేయడం చూశారు. ఇలా చింపాంజీలు కారును శుభ్రంచేయడం ఎప్పుడైనా చూశారా? ఐతే చింపాజీలు మనుషులను అనుకరించగలిగే తెలివైన జంతువులనే విషయం మనందరికీ తెలుసు! పిల్లలతో ఆటలాడే, మనుషులు ఉతికినట్టే బట్టలుతికే వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు వైరలయ్యాయి. ఇప్పుడు కారు కడిగే చింపాజీల వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. లక్షల వీక్షణలు, వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. ఫ్రీ కార్ వాషింగ్ అని, ఇంటిలో అత్యంత ప్రమాదకరమైన జంతువని కొంతమంది సరదాగా ఈ వీడియోకు కామెంట్లు జోడించారు. మీరేమంటారు.. చదవండి: ఈ అంబులెన్స్ డ్రైవర్ రాత్రికి రాత్రే కోటిశ్వరుడైపోయాడు! కంగారులో.. View this post on Instagram A post shared by Wilds Planet (@wildsplanet) -
భార్య, మరదలితో చెర్రి స్టెప్పులు, వీడియో వైరల్
Ram Charan & Upasana Dance Together In Anushpala Wedding, Video Goes Viral: మెగా కోడలు ఉపాసన కొణిదెల కామినేని సోదరి అనుష్పల కామినేని వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా పాల్గొంది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ నుంచి మొదలు.. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ.. సంగీత్.. మేహంది.. పెళ్లి వేడుకల వరకు ప్రతి చిన్న వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరై సందడి చేశాడు. ఇక ఈ పెళ్లి చరణ్-ఉపాసనలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. చదవండి: ఊహా నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రి తన భార్య ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్లు పాట పాడుతుంటే చరణ్ మరదలితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులెస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సరదగా, సందడి చేస్తున్న చెర్రిని చూసి మెగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ వీడియో తమదైన శైలి కామెంట్ చేస్తూ తమ స్పందనను తెలుపుతున్నారు. చదవండి: అషూరెడ్డి ప్రెగ్నెంటా?! షాక్‌లో ఫ్యాన్స్, ఇంతగా దిగజారిపోయావా! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా?
A house worth crores of rupees was gutted In USA Know How: ఇంట్లోకి పాములొస్తే సాధాకణంగా ఎవరైనా ఏం చేస్తారు? పాములను పట్టేవాళ్లను పిలవడమో.. ధైర్యముంటే కర్ర సహాయంతో పామును పట్టుకుని ఆరుబయట వదిలెయ్యడమో చేస్తాం! ఐతే ఓ వ్యక్తి పాము నుంచి తప్పించుకోవడానికి ఏకంగా ఇంటికి నిప్పంటించాడు. అసలేంజరిగిందంటే.. అమెరికాలోని మోంట్గోమేరీ కౌంటీలో కోట్ల విలువచేసే ఇల్లును తగులబెట్టాడు. నిజానికి ఇంటి యజమాని ఐడియా ఏంటంటే.. పొగ పెట్టడం ద్వారా పామును బయటికి పంపొచ్చని బొగ్గులను మండించాడు. ఈ మంటలు ఇంట్లోని వస్తువులకు అంటుకోవడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చిన కాసేపటికే ఇళ్లు మొత్తం పూర్తిగా కాలిపోయిందని పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో షేర్చేశారు. అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ అగ్నిప్రమాదంలో సుమారు పది లక్షలపైనే ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. చదవండి: ఆ మూడే ఒమిక్రాన్ ప్రధాన లక్షణాలు..! వీటిని గుర్తించిన వెంటనే.. ICYMI (Tuesday 11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) NOTE: non-hydrant area, driveway 3/4 mi long off Big Woods Rd pic.twitter.com/hJ4i4Bz8nL — Pete Piringer (@mcfrsPIO) November 26, 2021 Update (11/23 10p) 21000blk Big Woods Rd, Dickerson/Poolesville, @mcfrs Media Hotline Update 240.777.2442 - no injuries, Cause-undetermined/under investigation, >$1M loss, ~75FFs responded, it was dark & cold (~ 25°) https://t.co/6PwIkbRAkf pic.twitter.com/jWlB1HPdKt — Pete Piringer (@mcfrsPIO) November 24, 2021 -
మరొక హాట్ డ్యాన్స్‌తో నోరా ఫతేహి.. నెట్టింట వీడియో హల్చల్
Nora Fatehi Hot Dance Video Goes Viral In The Internet: బాలీవుడ్ దివా, డ్యాన్స్ క్వీన్ నోరా ఫతేహి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. తను వేసుకునే ఫ్యాషన్ వేర్స్, హాట్ డ్యాన్స్, కైపెక్కించే హావాభావాలు, అందంతో ఎప్పుడూ అలరిస్తూ ఉంటుంది. అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది. ఇటీవల విడుదలైన 'సత్యమేవ జయతే 2' చిత్రంలోని 'కుసు కుసు' సాంగ్‌లో ఎక్స్ప్రెషన్స్, బెల్లీ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేసింది. అలాగే బ్లూ బికినీ టాప్‌లో చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ వీడియో తెగ వైరల్ అయింది. అలాగే ఏయిర్‌పోర్ట్‌లో దిగిన ఫొటోలతో చూపుతిప్పుకోనివ్వకుండా చేసిందీ మనోహరి. తాజాగా నోరా ఫతేహి తన కిల్లర్ డ్యాన్స్ కదలికలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఒక ఏయిర్పోర్ట్ ప్రాంతంలో కారులో తన హిట్ ట్రాక్ 'కుసు కుసు' పాటకు స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో నోరా బ్లాక్ డ్రెస్ ధరించి ప్రముఖ కొరియోగ్రాఫర్ అవేజ్ దర్బార్తో కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేయడం చూడొచ్చు. డ్యాన్స్ చేసేటప్పుడు తన కదలికలు, ఎక్స్ప్రెషన్స్ వావ్ అనిపిస్తున్నాయి. అలాగే బ్లాక్ డీప్-నెక్ టాప్‌తో మ్యాచింగ్ బ్లాక్ లెదర్ ప్యాంట్ ధరించి ఆకర్షిస్తోందీ బెల్లీ డ్యాన్స్ క్వీన్. ఈ బ్యూటీ 'టెంపర్', 'బాహుబలి: ది బిగెనింగ్' సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నృత్యం చేసి ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
వామ్మో! మామూలోడు కాదుగా.. 24 నిముషాల్లో అన్ని బర్గర్లు తిన్నాడా?
ఫుడ్ ఛాలెంజ్‌లో పాల్గొని విజయాలు సాధించినవారు కొందరైతే, మరికొందరేమో దీనిని చాలా సీరియస్‌గా తీసుకుని, గెలవాలనే తాపత్రయంలో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు బర్గర్లు తినగానే ఇక మావల్లకాదని చేతులెత్తేస్తారు! అలా కాదని బలవంతంగా ఎక్కిస్తే ఇక వాంతులే.. కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వ్యక్తి కేవలం 24 నిముషాల్లో ఎన్ని బర్గర్లు తిన్నాడో తెలిస్తే... ఖచ్చితంగా నోరెల్లబెడతారు. ఇంగ్లాండ్‌కు చెందిన కైలీ గిబ్సన్ (23) అనే వ్యక్తి ‘మెక్‌డోనల్డ్స్ క్రిస్టమస్ ఛాలెంజ్'లో పాల్గొని కేవలం 24 నిముషాల్లో ఏకంగా 6 బర్గర్లు లాగించేశాడు. పైగా ఇదంతా నాకు చాలా మామూలు విషయమని అంటున్నాడు కూడా. నిజానికి కైలీ గిబ్సన్ ప్రొఫెషనల్ ఈటర్. గత కొన్ని యేళ్లగా ప్రతిరోజూ లెక్కలేనన్ని లార్జ్ మీల్ ఈటింగ్ కాంపిటీషన్లలో పాల్గొంటున్నాడట కూడా. వీటికి సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లలో చూడొచ్చు. ఐతే తినడం వరకూ సరే! మరి తిన్నదంతా ఎలా అరిగించుకుంటాడనేది ప్రతి ఒక్కరి ప్రశ్న. అతని సమాధానం ఏమిటో తెలుసా.. కాంపిటీషన్లో పాల్గొనడానికి ముందు, తిన్న తర్వాత భారీ స్థాయిలో వర్క్ఔట్స్ చేస్తానని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాడండీ..! మరి మీరేమంటారు.. చదవండి: వృత్తేమో టీచర్... వారానికోసారి మాత్రమే స్నానం.. కాస్తమీరైనా చెప్పండి!! -
హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నాడే
సౌతాఫ్రికా కరోనా కొత్త వేరియంట్ దెబ్బ ప్రపంచ దేశాల ఇన్వెస్టర్లను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చిన్న సెంటిమెంట్‌కే బయపడిపోయే ఇన్వెస్టర్లకు శుక్రవారం భారీ ఎత్తున నష్టాల్ని చవి చూశారు.అందుకు కారణం కరోనా వేరియంటేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వేరియంట్ వార్తతో ఈరోజు ఉదయం మార్కెట్లో షేర్ల ధరలు పడిపోయాయి.సెన్సెక్స్ భారీగా పతనమైంది.ఇన్వెస్టర్ల ఊపిరి ఆగినంతపనైంది. లక్షకోట్ల రూపాయాల సొమ్ము గాల్లో ఆవిరైంది. మీమర్స్‌కు ఓ వెపన్ దొరకినట్లైంది. Indian Stock Market today:Like if you know what I mean 😜#StockMarket#India #Nifty#Niftybank #memecoin #MEMES pic.twitter.com/QpfFNTF2Vm— Poonam Soni (@CodeByPoonam) November 22, 2021 దక్షిణాఫ్రికాను కబళించేస్తున్న కరోనా కొత్త వేరియంట్ జర్మనీతో పాటు ప్రపంచ దేశాల్ని హడలెత్తిస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెను విధ్వంసం సృష్టిస్తుంది. శుక్రవారం మార్కెట్లో కరోనా ఎఫెక్ట్‌తో దేశీయ సూచీలు 8% క్షీణించి దాదాపు రూ.14 లక్షల కోట్లను బూడిదపాలు చేశాయి. Mean while stock market is not gender biased unlike this meme 😜#StockMarket #investments pic.twitter.com/0AcxVTs2IV— Swapnil Kommawar (@KommawarSwapnil) November 20, 2021 అయితే కొద్దిరోజుల క్రితం వరకు బుల్ రంకెలేయడంతో ఇన్వెస్టర్లతో పాటు కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారికి సైతం అదో మాయలా అనిపించింది. ఇన్వెస్టర్లంతా ఏదో మేనియాలో ఉన్నట్లు, అదే ప్రపంచం అన్న దశకు చేరుకున్నారు. కానీ తాజాగా కోవిడ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్లు, బిగినర్లు సైతం ఏమాత్రం అవగానలేకుండా పెట్టుబడి పెడితే ఎంత నష్టపోతామో గుర్తించారు. ITC when it realises that PayTM is the new meme stock in the market 😂 pic.twitter.com/MjsB4r8Ir8— Finance Memes (@Qid_Memez) November 20, 2021 ఇక ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి అభిప్రాయం అలా ఉంటే మీమ్ క్రియేటర్స్‌కు ఓ వెపన్ దొరికినట్లైంది. అందుకే ఎప్పుడు చేసిన మీమ్స్‌నే తాజాగా ట్రెడింగ్ చేస్తున్నారు. ముదుపర్లు ముద్దుగా ఇండియన్ బిగ్బుల్ అని పిలుచుకునే రాకేష్ ఝున్ ఝున్ వాలా, అక్షయ్ కుమార్, పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో పాటు పలు సినిమాల్లోని వీడియోలతో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ పై నెటిజన్లు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్బుల్ హాయిగా నిద్రపోతున్నారని కామెంట్లు చేస్తున్నారు. చదవండి : బెంబేలెత్తిస్తున్న కరోనా, అక్షరాల రూ.14 లక్షల కోట్లు బూడిద పాలు -
పార్టీలో డ్యాన్స్‌తో హీరోయిన్ అక్క రచ్చ, ఛీఛీ.. కొంచం పద్దతిగా ఉండండి..
Disha Patani Sister Khushboo Patani Birthday Party Dance Video Goes Viral: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ భామ దిశాపటానీ. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్లి అక్కడే వరస సినిమాలతో బిజీ అయిపోయింది. ఎమ్ఎస్ ధోనీ, భాగీ-2,3 వంటి చిత్రాల్లో తళుక్కున మెరిసింది. ఇక ఆమెకు సోదరి ఖుష్బూ పటానీ ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినీ రంగంలో అడుగుపెట్టనప్పటికి తన అందం, గ్లామర్‌తో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈ ఇద్దరూ అక్కాచెల్లెల్లు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. చదవండి: దిశా సోదరి గురించి తెలిస్తే ప్రశంసించక మానరు! ఈ క్రమంలో ఓ వెకేషన్లో భాగంగా దిశా పటాని, తన సోదరి కుష్బూ పటానిలు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంగళవారం దిశ సోదరి ఖుష్బూ పటానీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బర్త్‌డే పార్టీలో ఆమె డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పార్టీలో టెబుల్ పైకి ఎక్కి మరి ఖుష్బు డ్యాన్స్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను దిశ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ హ్యీప బర్త్‌డే మై క్రేజీ సిస్, నీలా నేను కూడా డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నా’ అంటూ రాసుకొచ్చింది. సల్మాన్, కత్రినా పాటకు ఖష్ఫు తనదైన స్టైల్ల్లో స్టెప్పులేసింది ఖష్బు. చదవండి: షాకింగ్ లుక్‌లో సహజనటి జయసుధ.. ఇంతగా మారిపోయారేంటి? ఇక ఆమె డ్యాన్స్‌కు కొంతమంది నెటిజన్లు ఫిదా అవుతుండగా మరికొందరూ తమదైన స్టైల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఛీఛీ.. ఒళ్లు మరిచి ఎలా డ్యాన్స్ చేస్తుంది. తనో ఆర్మీ ఆఫీసర్ అనే విషయం మరించిందా.. తనేమి హీరోయిన్ కాదు.. కొంచం పద్దతిగా ఉండండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఖుష్బూప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. దిశా పటాని ఎప్పుడైతే తన అక్క ఆర్మీ ఆఫీసర్ అని వెల్లడించిందో అప్పటి నుంచి ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. ఖుష్బూ భారత ఆర్మీలో పనిచేస్తున్నప్పటికీ దిశాలాగే ఫిట్నెస్ ప్రియురాలు. ఎప్పటికప్పుడు జిమ్, వర్కౌట్ ఫోటోలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. చదవండి: హీరోనవుతా, నా పెళ్లికి చిరంజీవి వస్తారు.. విచిత్రంగా అదే జరిగింది: హీరో View this post on Instagram A post shared by Media Expresso Bollywood ! (@mediaexpresso) -
డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప..
Fish Swallows One Meter Long Snake: చేప పాములను వేటాడటం కాని, వేటాడి గులాబ్‌జామ్ మింగినట్టు పామును మింగడం ఎప్పుడైనా చూశారా?.. ఏదో చిన్న పాముపిల్లను మింగి ఉంటుందిలేనని అనుకునేరు.!! కాదండీ.. ఏకంగా మూడున్నర అడుగుల (మీటరు పొడవున్న) పాము.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చేపలను, ఇతర జంతువులను పాములు వేటాడటం మనకు తెలుసు! కానీ రొటీన్‌కు భిన్నంగా ఓ చేప సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు ఏ రకం చేపై ఉంటుంది... పాములను మింగగలిగేతంట ధైర్యమా దానికి.. అననుకుంటున్నారా? దాని విశేషాలు మీకోసం. నది ఒడ్డున నీళ్లలో ఉన్న ఓ చేప, పొదల్లో నుంచి నీళ్లలో తలను పెట్టిన పామును స్లోగా మింగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. వేలల్లో వీక్షిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఓ మై గాడ్..! ఇది ఎలా సాధ్యం అని ఒకరు, నా కళ్లను నమ్మలేకపోతున్నాను, ఇది నిజమేనా అని మరొకరు కామెంట్ చేశారు. మరి మీరేమంటారు.. ఏది ఏమైనా ఈ చేప మామూలుది కాదు కదా.. చదవండి: Worlds Most Dangerous Foods: అత్యంత విషపూరితమైన వంటకాలు.. ప్రాణాలను పణంగా పెట్టి మరీ తింటారట!! View this post on Instagram A post shared by طبیعت (@nature27_12) -
ఆ జీన్స్ ధరించిన 8 గంటల తర్వాత.. ఐసీయూలో మృత్యువుతో..
This 25 year old Woman wore tight jeans for 8 hours then had to be admitted in ICU: ఈ రోజుల్లో టైట్ జీన్సే.. ఫ్యాషన్ ఐకాన్! ప్రపంచవ్యాప్తంగా కాలేజ్ గర్ల్స్ నుంచి ముసలమ్మలదాకా క్యాజువల్ డ్రెస్సింగ్‌లో జీన్స్ భాగమైపోయింది. ఐతే గంటల తరబడి జీన్స్ ధరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఒక మహిళ 8 గంటల పాటు జీన్స్ ధరించినందుకు ఐసీయూలో 4 రోజులపాటు చికిత్స తీసుకున్న అనుభవాన్ని సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో ఈ వార్త టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది. నార్త్ కరోలినాకి చెందిన 25 ఏళ్ల సామ్ మూడేళ్ల క్రితం తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డేటింగ్‌కు వెళ్లింది. అప్పడు ప్రియుడి కోరిక మేరకు బిగుతుగా ఉండే షార్ట్ జీన్స్ ధరించింది. 8 గంటల తర్వాత ఇంటికి చేరిన సామ్‌కు నడుము క్రింద నొప్పి ప్రారంభమైంది. మరుసటి రోజు డాక్టర్ని సంప్రదించడంతో సెప్సిస్, సెల్యులైటీస్ అనే స్కిన్ ఇన్ఫెక్షన్ సోకిందని తేలింది (ఈ ఇన్ఫెక్షన్ తీవ్రతరమైతే.. రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించి, అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారం ఉంది). చదవండి: Baldness Cure: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు పరిష్కారం..! తొలుత ఆస్పత్రిలో చేర్పించినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యులు వెంటనే ఆమెను ఐసీయూకి మార్చారు. వారం రోజుల పాటు ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్సనందించారు. మరి కొన్ని రోజులపాటు ఆమె ఆసుపత్రిలోనే ఉండి వైద్యం చేయించుకుంది కూడా. చికిత్స సమయంలో మాటిమాటికీ ప్యాంట్‌ను తీసి వైద్యులకు గాయాన్ని చూపించాల్సి వచ్చేదని, ఇది చాలా చేదు అనుభవమని, దాదాపు మృత్యు కుహరం నుంచి బయటికి వచ్చానని తెల్పింది. తను చవిచూసిన చేదు అనుభవాన్ని టిక్ టాక్ ద్వారా తాజాగా పంచుకుంది. ఇంత అరుదైన వ్యాధి జీన్స్ వల్ల ఎలా వస్తుందని సర్వత్రా చర్చ కోనసాగుతోంది. అందుకే ఇన్ఫెక్షన్లు వస్తాయి.. నిజానికి బిగుతైన దుస్తులు ధరించినప్పుడు చర్మం కోతకు గురై ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా జీవించడానికి అనుకూలంగా ఉండే తేమలాంటి పదార్థం (అనోరెక్టల్ అబ్సెస్) పేరుకుపోతుంది. దీనికి తక్షణమే చికిత్స చేయకపోతే, ఆ ప్రదేశంలో చర్మగ్రంధులు మూసుకుపోయి ప్రాణాంతక ఇన్ఫెక్షన్గా మారుతుంది. సాధారణంగా ఇమ్యునిటీ బలహీణంగా ఉండే వారికి ఇది సోకే అవకాశం ఎక్కువని వైద్యులు సూచిస్తున్నారు. జీన్స్‌తో జర జాగ్రత్త!! చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. -
West Bengal: 108 గ్రాముల బంగారంతో.. గోల్డ్ మాస్క్!! జనాల్లో ధరించలేక..
జుట్టున్నమ్మ ఏ కొప్పైనా పెడుతుందనే సామెత వినే ఉంటారు. మరి బంగారం ఉంటే..!! అవును.. ఇతగాడు బంగారంతో ఏకంగా మాస్క్ చేయించుకున్నాడు. ఈ గోల్డ్ మాస్క్ ముచ్చట్లేమిటో తెలుసుకుందాం.. కోవిడ్ వచ్చాక మన జీవితాల్లో మాస్కులు కూడా ఒక భాగమైపోయాయి. వీటిని ధరించడంలో ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ అనుసరిస్తున్నారు. మ్యాచింగ్ మాస్కులు, ఫొటో ఫ్రింట్ మాస్కులు, ఏ చీర కామాస్కు.. ఇలా ఎన్నో. ఐతే వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త 108 గ్రాముల బంగారంతో రూ. 5 లక్షల 70 వేల ఖరీదు చేసే గోల్డ్ మాస్క్ చేయించుకున్నాడు. దీనిని చందన్ దాస్ అనే జ్యువెలరీ డిజైనర్‌తో ప్రత్యేకంగా తయారు చేయించాడట. కోల్‌కతాలో జరిగిన దుర్గా పూజ వేడుకల సందర్భంగా సదరు వ్యాపారవేత్త ముచ్చటపడి చేయించుకున్న గోల్డ్ మాస్క్‌ను ధరించాడు. ఐతే జనాలు గోల్డ్ మాస్కును చూసేందుకు చుట్టూ మూగడంతో కాసేపట్లోనే తీసి జేబులో దాచుకున్నాడు. రీతుపర్నా చటర్జీ అనే జర్నలిస్ట్ గోల్డ్ మాస్క్‌కు సంబంధించిన ఫొటోలను ‘వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్?' అనే క్యాప్షన్‌తో ట్విటర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట వెరల్ అయ్యాయి. తనకు ఆభరణాల పట్ల మక్కువ ఎక్కువని, అందుకే బంగారంతో మాస్కు చేయించుకున్నాడని, మెడలో రకరకాల బంగారు గొలుసులు, రెండు చేతులకు అనేక ఉంగరాలు ధరించినట్లు స్థానిక మీడియాకు సదరు వ్యాపారవేత్త తెలిపాడు. ఏదిఏమైనా కోవిడ్ కాలంలో కడుపునింపుకునేందుకు జనాలు నానాఅగచాట్లు పడ్డారు. అటువంటిది ఇతగాడు తన సంపదను ప్రదర్శించుకునేందుకు ఏకంగా గోల్డ్‌తో మాస్క్ చేయించుకోవడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోందీ గోల్డ్ మాస్క్. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. What is the purpose of this? pic.twitter.com/Zy4MqIPNCZ — Rituparna Chatterjee (@MasalaBai) November 10, 2021 -
Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..!
మీకు పాములంటే భయం లేదా.. ఐతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయం మార్చుకుంటారు. పెద్ద కోబ్రాను ఏమాత్రం జంకుబొంకు లేకుండా, అసలుతత్తరపాటే లేకుండా ఓ మహిళ ఒట్టిచేతులతోనే పట్టుకుందండీ! ఈ వీడియో చూస్తేనే గుండెకాయ గొంతులోకొచ్చినంత పనౌతుంది! ధైర్యముంటే.. మీరు చూడండి. ఓ పాడుబడ్డ ఇంటిలో పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ కోబ్రాను ఒక మహిళ ఒట్టి చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చుట్టూ చూస్తున్న జనాలు భయంతో దూరంగా పారిపోగా ఆమె మాత్రం చాలా చాకచక్యంగా, ధైర్యంగా కోబ్రాను చేతులతో పట్టుకుని ఇంటి నుంచి బయటికి తెచ్చి, బయట రోడ్డు పక్కన వదిలిపెడుతుంది. ఐతే కోబ్రా మళ్లీ అదే ఇంటివైపు వెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె కోబ్రా తలను గట్టిగా పట్టుకుని గోనె సంచిలో వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం వీడియోలో కోబ్రా అనేక సార్లు సదరు మహిళపై దాడి చేయగా, ఆమె మాత్రం చాలా అలవోకగా దాని దాడి నుంచి తప్పించుకుంటుంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నాలుగు నిముషాల నిడివిగల ఈ వీడియోను ‘అమేజింగ్ క్యాచ్ స్నేక్ బై హ్యాండ్’ క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ మహిళ పాము పట్టే నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇక వేలల్లో లైకులు, విభిన్న కామెంట్లతో తిరిగి వార్తల్లో నిలిచింది. చిన్న పామును కిలోమీటరు దూరం నుంచి చూసినా.. నాకు హార్ట్ అటాక్ వస్తుందని ఒకరు, మృత్యువుతో ఆటలాడినందుకు ఆమెకు ఒలంపిక్ మెడల్ ఇవ్వాలని మరొకరు, ఈ క్యాచింగ్ స్టైల్ చాలా ప్రమాదకరమైనది. ఆమె అదృష్టం బాగుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దైర్యంగా ఉండటం మంచిదేకానీ విష సర్పాల జోలికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. -
కోతి కళ్లుజోడుని ఎలా తిరిగి ఇచ్చిందో చూడండి!
మన ఇళ్లలోని వస్తువులను కోతులు ఏవిధంగా ఎత్తుకుపోతాయో అందరికీ తెలుసు. ఆ వస్తువులను కోతులు తీసుకెళ్లి ఎక్కడో పడేస్తాయి తప్ప అవి మనకు దొరికే అవకాశం కూడా ఉండదు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడోక కోతి ఒక వ్యక్తి కళ్లజోడుని ఎత్తుకుపోయి మళ్లా తిరిగి ఇచ్చేసింది. అలా ఎలా ఇచ్చేసిందబ్బా అనిపిస్తుందా? అనుమానంగా ఉందా? అయితే తెలుసుకుందాం రండి. (చదవండి: చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?) వివరాల్లోకెళ్లితే.....ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ కళ్లజోడుని ఒక కోతి ఎత్తుకుపోతుంది. పైగా ఆ కళ్లజోడు పట్టుకుని ఒక మెస్‌పై కుర్చోంటుంది. దీంతో మొదట అతనికి ఏం చేయాలో తోచదు. ఆ తర్వాత ఆయన ఒక జ్యూస్ ప్యాక్‌ని తీసుకువచ్చి కోతికి ఇస్తాడు. కోతులు సహజసిద్ధంగా ఉండే అనుకరించే బుద్ది కారణంగా ఆ కోతి జ్యూస్ ప్యాక్‌ని తీసుకుని కళ్లజోడుని మెస్ మీద నుంచి వదిలేస్తుంది. అయితే ఆ కళ్లజోడు మెస్‌లో ఇరుక్కుపోతుంది. అయినప్పటికీ ఆ తెలివైన కోతీ ఆ మెస్‌లో ఇరుక్కుపోతున్న కళ్లజోడుని తీసి మరీ శర్మకి తిరిగి ఇస్తుంది. దీనికి సంబంధించిన వీడియోకి "ఒక చేత్తో తీసకుంటూ ఇంకో చేత్తో ఇచ్చింది" అనే క్యాప్షన్ జోడించి ట్టిట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిజన్లు తినేందుకు ఏమి ఇవ్వకపోతే కోతులు మనవస్తువులను అంత తేలిగ్గా తిరగి ఇవ్వవు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: హృదయాన్ని కదిలించే ‘స్వీట్ రిక్వస్ట్’) Smart 🐒🐒🐒 Ek haath do, Ek haath lo 😂😂😂😂🤣 pic.twitter.com/JHNnYUkDEw — Rupin Sharma IPS (@rupin1992) October 28, 2021 -
ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా..! అనుకుంటే ఏదైనా చేస్తావ్..!
టెస్లా అధినేత ఎలన్ మస్క్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారారు. స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ మార్కెట్ వ్యాల్యూ రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో 2008 లో టెస్లా కార్ల గురించి ఎలన్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఎలన్ నువ్వు అసాధ్యుడివయ్యా. అనుకుంటే ఏదైనా చేస్తావ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అధఃపాతాలానికి పడిపోతున్నాడంటూ.. 2003లో ఎలన్ మస్క్ పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్ కార్లను రూపొందించాలనే ఉద్దేశంతో టెస్లా సంస్థను ప్రారంభించారు. 2008 నాటికి ఆ సంస్థకు ఎలన్ సీఈఓ అయ్యారు. ఆ సయమంలో ఈ బిజినెస్ టైకూన్ తన ఆస్తి మొత్తాన్ని టెస్లా కార్ల మీద ఇన్వెస్ట్ చేసేలా ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఎలన్ ప్రయత్నాలపై పలు మీడియా సంస్థలు ఎలన్ ఆకాశం నుంచి అథఃపాతాళానికి పడిపోతున్నారని రాసుకొచ్చాయి. ఆ కథనాలపై ఎలన్ తనదైన స్టైల్లో స్పందించారు. భారీ పెట్టుబడులు పెడితేనే తక్కువ ధరకే ప్రొడక్ట్‌లను అందించగలం కొత్త టెక్నాలజీ వైపు మొగ్గుచూపుతున్నారంటే దాన్ని అందిపుచ్చుకోవడానికి సమయం పడుతుంది. ప్రస్తుతం టెస్లా విషయంలో ఇదే జరుగుతుంది. కనీస వేతనాలతో దాదాపుగా వాలంటీర్లా పనిచేస్తున్నాం. 'ఇక్కడ మరో క్లిష్టమైన విషయం తక్కువ ధరకే కార్లను అందించాలంటే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు ల్యాప్‌ట్యాప్‌లు. తొలిసారి ల్యాప్‌ట్యాప్ లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదే ల్యాప్‌ట్యాప్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నామని గుర్తు చేశారు. అయితే 2008లో ఎలన్ చేసిన వ్యాఖ్యల వీడియోల్ని టెస్లా సిలికాన్ వ్యాలీ క్లబ్ అనే ట్విట్టర్ అకౌంట్ వీడియోని షేర్ చేసింది.@elonmusk 2008లో ఎలక్ట్రిక్ వాహనాల గురించి చర్చించారంటూ ఎలన్‌కు ట్యాగ్ చేసింది. ఆ వీడియో క్లిప్‌ను 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోపై ఎలన్ కూడా స్పందించారు. అయితే ఈ వీడియోలపై చాలా మంది నెటిజన్లు మస్క్ స్ఫూర్తిని కొనియాడారు. ఎప్పటికీ మా ఇన్స్పిరేషన్ మీరేనంటూ ప్రశంసించారు. ఆయ దూరదృష్టిని కొనియాడారు. 75 లక్షల కోట్లు దాటింది .@elonmusk discussing electric vehicles in 2008 as tesla was nearly out of cash. pic.twitter.com/q41Tw9bfx9 — Tesla Silicon Valley Club (@teslaownersSV) October 26, 2021 ఆటోమొబైల్ రంగంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ అరుదైన ఫీట్‌ను సాధించారు. వందల ఏళ్లకు పైగా ఆటోమొబైల్ రంగంలో ఉన్న దిగ్గజ కంపెనీలకు షాకిచ్చారు. ఎలన్ మస్క్ అమెరికాలో రెంటల్ కార్ సర్వీసులు అందించే హెర్జ్ కంపెనీతో బిజినెస్ డీల్ కుదుర్చుకున్నారు. ఆ బిజినెస్ డీల్ 4.4 బిలియన్ డాలర్లగా ఉందని తెలియడంతో మదుపర్లు టెస్లా షేర్లపై భారీగా ఇన్వెస్ట్ చేశారు. దీంతో స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లు రివ్వున దూసుకెళ్లాయి. కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ఇండియన్ కరెన్సీలో రూ. 75 లక్షల కోట్లకు పైకి చేరింది. ఈ నేపథ్యంలో 13ఏళ్ల క్రితం టెస్లా కార్ల గురించి ఎలన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. చదవండి: టిమ్ కుక్ ను..ఎలన్ తిట్టినంత పనిచేస్తున్నారు?! -
ఐదేళ్ల పాప.. పేద్ద పెయింటింగ్!
న్యూఢిల్లీ: పిట్ట కొంచెం కుతం ఘనం అంటే ఇదేనేమో. ఇలా ఎందుకు అన్నానంటే కొంత మంది పిల్లలు చిన్న వయసులోనే వాళ్ల అసాధారణ ప్రతిభతో భలే ఆకట్టుకుంటారు. అచ్చం అలానే ఇక్కడ ఒక ఐదేళ్ల పాప తన పెయింటింగ్ స్కిల్‌తో భలే ఆకర్షిస్తోంది. ఎంత అద్భుతంగా పేయింటింగ్స్ వేస్తుందంటే మనం చూపు కూడా తిప్పకుండా అలా చూస్తూనే ఉండిపోతాం. అయితే ఆ పాప పెద్ద కాన్వాస్‌పై అత్యద్భుతంగా పెయింటింగ్స్ వేస్తున్న ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. (చదవండి: పని ఒత్తిడితో చిర్రెత్తి ఉన్నారా!.....అయితే ఈ వీడియో చూడండి చాలు) పైగా ఆ వీడియో మొదలు పెట్టినప్పుడు ఒకలా తర్వాత పూర్తైయ్యాక మరింత అద్భుతమైన పెయింటింగ్‌లా ఆవిష్కృతమవుతుంది. దీంతో నెటిజన్లు చాలామంది పిల్లలు ఏదో ఒక దానిపై మూడు నిమిషాలకు మించి దృష్టి పెట్టలేరు కానీ ఆమె అలా నిర్విరామంగా అంతసేపు అంతా పెద్ద పెయింటింగ్ వేయడం అత్యద్భుతం అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. పైగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ) 5-year-old artist doing her thing.. 👌 pic.twitter.com/R4g4idMMmA — Buitengebieden (@buitengebieden_) October 25, 2021 -
భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే
India Vs Pakistan Match Promo Released By ICC: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్‌కు సంబంధించిన ప్రోమోని ఐసీసీ ఇవాళ ఉదయం ట్విటర్ వేదికగా విడుదల చేసింది. ఈ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ వీడియోను ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకన్ల నిడివి గల ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. The world is watching. Tonight in Dubai, India and Pakistan go toe-to-toe.#INDvPAK | #T20WorldCup pic.twitter.com/ynIzBry0ha — ICC (@ICC) October 24, 2021 'టుడే ఈజ్ బిగ్ డే' అనే టైటిల్‌తో మొదలయ్యే ఈ వీడియో.. ఇండియా, పాకిస్థాన్, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలతో రూపొందించబడి, 'ద వరల్డ్ ఈజ్ వాచింగ్ యు' అనే టైటిల్‌తో ముగుస్తుంది. గతంలో జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన క్లిప్పింగ్స్‌తో పాటు ఇరు జట్ల ఆటగాళ్ల బౌలింగ్, బ్యాటింగ్ విన్యాసాలు, అభిమానుల కోలాహలంతో రూపొందించిన ఈ ప్రోమో వీడియో చూస్తున్నంత సేపు సగటు క్రికెట్ అభిమాని రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే. చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు -
గప్‌చుప్‌గా ‘బుగ్గల ప్రపంచ కప్’! విన్నర్ ఎవరంటే..
Baloon World Cup 2021: బుగ్గలతో(బెలూన్స్)తో ఆడుకోవడం పిల్లలకు సరదా. మరి పెద్దవాళ్లకో!. కొందరికి ఉండొచ్చు కూడా. అలాంటి ఆసక్తి గనుక మీకు ఉంటే.. ఛాంపియన్ అయ్యేందుకు అవకాశమూ ఉంది. ఎందుకంటే.. ప్రపంచంలో మొట్టమొదటి ‘బెలూన్ వరల్డ్ కప్’ను ఈ మధ్యే విజయవంతంగా నిర్వహించారు. ఇకపై క్రమం తప్పకుండా నిర్వహిస్తారంట!. స్పెయిన్ టర్రగోనా సిటీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్‌లో ఈ టోర్నీ జరిగింది. గప్‌చుప్‌గా పోయిన వారంలో.. వారంపాటు మొట్టమొదటి బెలూన్ వరల్డ్ కప్‌ను నిర్వహించారు. మొత్తం 32 దేశాలు ఇందులో పోటీపడగా.. జర్మనీ, పెరూలు ఫైనల్‌కి చేరాయి. ఫైనల్ పోరులో పెరూకి చెందిన ఫ్రాన్సెస్కో డె లా క్రూజ్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. దానికింద సరదా కామెంట్లూ కనిపిస్తున్నాయి. PERÚ 🆚 ALEMANIA Primera FINAL de #BalloonWorldCup pic.twitter.com/3oFqZxFYZ5 — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 ఎలా ఆడతారంటే.. Balloon Keep Up.. సింపుల్.. బెలూన్ కిందపడకుండా ఆడాలి. కిందపడితే ప్రత్యర్థి వ్యక్తికి ఒక పాయింట్ వెళ్తుంది. 8X8 మీటర్ కోర్టులో ఈ గేమ్‌ను నిర్వహిస్తారు. కాకపోతే లివింగ్ రూం లాంటి ఆ కోర్టులో కారు, సోఫా, కుర్చీలు.. ఇలా రకరకాల వస్తువులు ఉంటాయి. మరి బెలూన్ పగిలిపోతే పరిస్థితి ఏంటి? అని మాత్రం అడగకండి ప్లీజ్!. Revive los últimos segundos de la final que ha coronado a Perú como campeona del mundo! Enhorabuena @efedufran #BalloonWorldCup pic.twitter.com/cY36WikPTp — Balloon World Cup (@BalloonWorldCup) October 14, 2021 పుట్టింది ఇలా.. బార్సిలోనా సాకర్ ప్లేయర్ గెరార్డ్ పిక్యూ, స్పానిష్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇబయ్ లానోస్‌లు ఈ టోర్నీని నిర్వహించారు. అయితే ఈ ప్రపంచ టోర్నీ పుట్టింది టిక్‌టాక్‌లోని సరదా వీడియోల ఆధారంగా!. యస్.. ఓరేగావ్(యూఎస్)కు చెందిన అర్రెన్డోండో ఫ్యామిలీ టిక్‌టాక్‌లో సరదాగా గేమ్స్ వీడియోలను పోస్ట్ చేసేది. ఆ వీడియోల ఆధారంగా గెరార్డ్ పిక్యూ, ఇబయ్ లాబీ లానోస్‌లు ఈ టోర్నీని రూపొందించారు. అంతేకాదు గెరార్డ్ పిక్యూ డేవిస్ కప్ టెన్నిస్ టోర్నమెంట్‌ను కొత్త రూపంలో మార్చే ప్రయత్నంలో ఉన్నాడు కూడా. Ziggy is just waiting for the Dog Balloon World Cup pic.twitter.com/Jb6sOZqJ7G — shitscaredmum 💙 (@shitscaredmum) October 18, 2021 చదవండి: సంచలన ఆరోపణలు: ఆ బాక్సింగ్ మ్యాచ్‌లు ఫిక్సింగ్? -
డ్యాన్స్‌తో అదరగొట్టిన స్మృతి మంధాన... నెటిజన్లు ఫిదా
Smriti Mandhana Dance Video Viral: ఎప్పుడూ మ్యాచ్‌లు, టూర్లతో బిజీగా ఉండే క్రికెటర్లు అప్పుడప్పుడు వాళ్ల ఆటతోనే కాదు డ్యాన్స్‌లతోనూ సరదగా అభిమానులను అలరిస్తుంటారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఆమె సహచరులతో కలిసి చేసిన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆమె సహచరులు హర్మన్‌ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ , రాధా యాదవ్‌తో కలిసి 'ఇన్ డా ఘెట్టో' అనే పాటకు డ్యాన్స్ వేసింది. ఈ వీడియోను మంధాన తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. స్మృతి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియో షేర్ చేసిన మంధాన.. వీడియో చేయాలనే ఆలోచన తనది కాదంటూ క్యాప్షన్ పెట్టింది. దీనిపై స్పందించిన ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హీథర్ నైట్... ఇది కచ్చితంగా స్మృతి మంధాన పనేని ఫన్నీగా కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరింతా మహిళల బిగ్ బాష్ లీగ్ కోసం ఆస్ట్రేలియాలో ఉన్నారు. చదవండి: భారత్‌తో తలపడే పాక్ జట్టు ఇదే: ఆకాష్ చోప్రా View this post on Instagram A post shared by Smriti Mandhana (@smriti_mandhana) -
‘బీరు’బలి.. ఒక్కపనితో హీరో అయ్యాడు
నెదర్లాండ్స్: మనం మన చేతుతలతో వాటర్ గ్లాస్‌లని ఒకేసారి రెండూ, మూడో మహా అయితే నాలుగు కూడా పట్టుకోవచ్చు. ఇంకా మరింత ప్రయత్నం చేసి ట్రై ఉపయోగించో లేక మరో విధంగానైనా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాం. కానీ ఒకేసారి ఎక్కవ గాజు గ్లాస్‌లతో వాటర్ లేదా కూల్ డ్రింక్ లాంటి వాటిని తీసుకువెళ్లడం అసాధ్యం. కానీ ఇక్కడొక వ్యక్తి హీరో మాదిరి ఏకంగా 48 బీర్ గ్లాస్‌లను తీసుకొచ్చేశాడు. (చదవండి: అక్టోబర్ 20 ప్రపంచ గణాంకాల దినోత్సవం) నెదర్లాండ్స్‌కి చెందిన క్రిస్టియాన్ రోట్గెరింగ్ ఫుట్‌బాట్ అభిమాని. అతను తన కుటుంబ సభ్యులు, స్నేహిలతులతో కలసి ఫుట్‌బాట్ స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. ఆ తర్వాత అతను తనవాళ్ల కోసం బీర్‌ను కొనుగొలు చేసి తీసుకువెళ్తున్నాడు. ఎవరైనా డిస్పాజుబుల్ గ్లాస్‌తో ప్యాక్ చేసి ఉంటే సులభంగా తీసుకెళ్లగలం. కానీ క్రిస్టియాన్ ఓకేసారి ఐదు ట్రైలో బీరుగ్లాస్లను ఒకదానిపై ఒకటి పెట్టి మొత్తం 48 గ్లాస్‌లను ఒకేసారి హీరోలా తీసుకువెళ్లడంతో అక్కడ ఉన్న స్టేడియంలోని ప్రేక్షక్షుల అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీంతో అతను ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ పొందాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్ వావ్ యు ఆర్ సో గ్రేట్ అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: అదో వింతైన రంగురంగుల బల్లి.. ప్లీజ్ కాపాడండి) View this post on Instagram A post shared by Veronica Inside (@veronica.inside) -
డ్రీమ్ హౌస్ షిఫ్టింగ్.. సముద్రంపై పడవలతో గమ్యానికి చేర్చి..!
డ్రీమ్ హౌస్‌ను కూల్చేసే పరిస్థితొస్తే మీరైతే ఏం చేస్తారు? గుండె రాయి చేసుకుని వేరే ఇంటికి మారిపోతారు. కానీ ఈ జంట మాత్రం ఆరునూరైనా సరే తమ ఇళ్లు కూల్చడానికి వీల్లేదనుకున్నారు. పడవలపై సముద్రం దాటించిమరీ వేరే చోటుకి తమ కలల ఇల్లుని షిఫ్ట్ చేసుకున్నారు. దీనికి సంబంధించని వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. లండన్‌లోని న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన డానియేలి పెన్నీ రెండు అంతస్థుల ఇంటిని ద్వీపకల్పంలో కట్టుకుంది. చుట్లూ అందమైన పర్వతాలతో ఆహ్లాదకర వాతావరణంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో యజమాని ఇంటిని కూల్చివేస్తున్నాడనే పెనువార్త తెలిసింది. దీంతో పెన్నీ, ఆమె భర్త కిర్క్ లోవెల్ ఒక పథకం ప్రకారం ఇంటిని అక్కడి నుంచి షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంటిని ఒక మెటల్ ఫ్రేమ్‌పై అమర్చారు. తర్వాత టైర్లు కట్టి, రెండు చిన్న పడవల సహాయంతో సముద్రం దాటించి గమ్యస్థానానికి తీసుకెళ్లారు. ఇది అంత సులువుగా జరగలేదట. సముద్రం దాటించేటప్పుడు మధ్యలో ఒక పడవ విరిగిపోవడంతో ఇళ్లు నీళ్లలో మునగడం ప్రారంభించింది. ఇళ్లు ఇక దక్కదని ఆశలు వదులుకున్నారు. ఎట్టకేలకు ఇంటిని ఒక ముక్కగా అమర్చి 8 గంటల్లో వేరో చోటికి మార్చగలిగామని అక్కడి స్థానిక మీడియాకు తెలియజేశారు. ఇంటిపై మమకారం వారిని ఇంత సాహసానికి పురిగొల్పింది.! చదవండి: ఢిల్లీలో హఠాత్తుగా పెరిగిన వాయుకాలుష్యం.. కారణం అదే! -
ఒంటిచేత్తో ఆపి.. ఒక్క అడుగు వెనక్కేసి.. కళ్లు చెదిరేక్యాచ్!
మెల్బోర్న్: క్రీడాంశాల్లో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వేలాదిగా తరలివచ్చే అభిమానులు ఆటగాళ్ల అదిరిపోయే ఫీట్లకు ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బౌండరి లైన్ వద్ద ఒడిసిపట్టే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా బిగ్‌బాష్ వుమెన్స్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్ క్రీడాకారిణి బ్రిడ్జెట్ ప్యాటర్సన్ పట్టిన క్యాచ్ వహ్వా! అనిపిస్తుంది. సిడ్నీ థండర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్యాటర్సన్.. ఇసబెల్లా వాంగ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో ఒడిసిపట్టింది. సిక్సర్‌గా బౌండరీ లైన్ ఆవల పడుతున్న బంతిని ప్యాటర్సన్ అడ్డుకుంది. బ్యాలన్స్ కోల్పోతున్న తరుణంగా దానిని గాల్లోకి నెట్టి.. వెనక్కి అడుగేసింది. లిప్తపాటులో మళ్లీ తిరిగొచ్చి క్యాచ్ పట్టింది. ఇసబెల్లాను వెనక్కి పంపింది. ఈ క్యాచ్ ఫీట్‌పై నెటిజన్లు, సహచర ఆటగాళ్ల నుంచి ప్యాటర్సన్కు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగా.. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. Bridget Patterson walks the boundary tightrope - and catches a classic! #OhWhatAFeeling | @Toyota_Aus | #WBBL07 pic.twitter.com/C7FzpZket6 — cricket.com.au (@cricketcomau) October 16, 2021 -
జిమ్‌లో డ్యాన్స్ చేసి అలరించిన హృతిక్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సెట్ లేదా జిమ్‌లోనూ ఎక్కువ సేపు సరద సరదాగా గడపడానికే ఇష్టపడతాడు. ఎప్పుడు సోషల్ మాధ్యమాల్లో తన ఆనంద క్షణాలని షేర్ చేస్తుండే హృతిక్ ఈసారి జిమ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేశాడు. అందులో హృతిక్ 1979లో మిస్టర్ నట్వర్లాల్ సినిమాలోని 'పరదేశీయా' అనే పాటకు గుజరాతీ గర్బా డ్యాన్స్‌తో (దాండియా నేపథ్యం) అలరించాడు. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) ఆ తర్వాత నవరాత్రి కదా అందుకే ఈ డ్యాన్స్ అంటూ చెబుతాడు. అయితే 80 నిమిషాల నిడివిగల ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఈ వీడియోలో ఆధ్యంతం హృతిక్ డ్యాన్స్‌తో చక్కగా అలరించాడు. ఈ క్రమంలో హృతిక్ సహ నటి దీపికా పదుకొనే హృతిక మంచి హస్యగాడు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఇతర నటులు రణవీర్ సింగ్, ప్రీతి జింటా, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్ మరియు వరుణ్ ధావన్ ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం హృతిక్, దీపికా పదుకునే జంటగా 'ఫైటర్' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) -
"నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!"
న్యూఢిల్లీ: చిన్నపిల్లలు వారి ముద్దు ముద్దు మాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అంతేకాదు చిన్నారుల ముద్దులొలికే మాటలకు అప్పటి వరకు మనకు ఉన్న టెన్షన్లు, తనొప్పిలు ఎక్కడివక్కడికే ఎగిరిపోతాయి. పైగా వారి వచ్చిరాని మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయడమే కాక విస్మయానికి గురిచేస్తాయి. అచ్చం అలాంటి ఘటనే ఖతార్ హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. (చదవండి: ‘అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు) వివరాల్లోకెళ్లితే.....ఖతార్‌లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరాధ్య అనే చిన్నపాప తన అత్తకు వీడ్కోలు ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలంటూ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ గార్డ్ని కోరుతోంది. ఆ తర్వాత ఆ సెక్యరిటీ గార్డు ఆ చిన్నారి మాటలకు నవ్వుతూ అంగీకారం తెలిపిన వెంటనే తన అత్త దగ్గరకు ఆనందంగా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఈ సన్నివేశం చూపురులను తల తిప్పుకోనివ్వకుండా ఒక్క క్షణం కట్టిపడేసినట్లు ఉంటుంది. ప్రస్తుతం ఈ అందమైన వీడియోను కప్తాన్ హిందుస్థాన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. (చదవండి: రాజీనామా ఉపసంహరణ చేసుకున్న సిద్ధూ) -
బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు!
డజను గుడ్లు పగలకుండా షాప్ నుంచి ఇంటికి తీసుకురావడానికి తలమునకలైపోతాము. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 735 గుడ్లను తల టోపీపై ఉంచుకుని, అవి పగలకుండా నడిచి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్‌తో ప్రపంచ రికార్డు కొట్టాడు కూడా. గిన్నీస్ వరల్డ్ రికార్డు అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. చదవండి: లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!! పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ టౌన్‌కు చెందిన గ్రెగరీ దా సిల్వా అనే వ్యక్తి ‘ఎగ్ మ్యాన్’గా అందరికీ సుపరిచితుడు. అందుకు ఒక పెద్ద హిస్టరీనే ఉంది. ప్రపంచమంతా తిరిగి తన ట్యాలెంట్‌ను వివిధ దేశాల్లో ప్రదర్శించాడట. అంతేకాకుండా పలు టెలివిజన్ షోలలో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు. దీనితో అతడు వరల్డ్ ఫేమస్ ఎగ్‌మ్యాన్‌గా అందరికీ గుర్తుండిపోయాడు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! ఈ వీడియోలో ఇతను ధరించిన టోపీపై గుడ్లన్నింటినీ అతికించడానికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్ నిర్వహించిన గిన్నీస్ వరల్డ్ రికార్డు స్పెషల్ షోలో దీనిని తలపై పెట్టుకుని కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ ప్రదర్శించాడు. దీనిని చూసిన గిన్నీస్ రికార్డు అధికారులు ‘వావ్’అనకుండా ఉండలేక పోయారు. దీంతో ప్రపంచంలోనే అత్యధిక గుడ్లు సింగిల్ టోపీపై ధరించిన మొదటి వ్యక్తిగా గిన్నీస్ రికార్డులో స్థానం సంపాధించుకున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ‘ఇది చాలా ఇమ్ప్రెస్సివ్గా ఉంది’ అని ఒకరు, ‘మొత్తం ఎగ్స్ బరువు ఎంత ఉంటుందని’ మరొకరు సరదాగా కామెంట్ చేశారు. వేల సంఖ్యలో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఏకంగా రొటేటింగ్ హౌస్ కట్టించాడు!!
ప్రేమకు చిహ్నం చూపమంటే.. షాజహాన్ తన భార్య కోసం కట్టిన తాజ్‌మహల్ వెంటనే మదిలో మెదులుతుంది. ఐతే తరాలుగా ఎందరో తమకు ఇష్టమైన వారికోసం ఎన్నో కట్టారు. కానీ అంతగా గుర్తింపుకు నోచుకోలేదు. తాజాగా ఉత్తర బోస్నియాకు చెందిన 72 యేళ్ల వ్యక్తి భార్య కోసం రొటేటింగ్ హౌస్‌ను కట్టించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆకు పచ్చ ముఖభాగం, రెడ్ మెటల్ రూఫ్‌తో 360 యాంగిల్లో తిరిగే ఈ రొటేటింగ్ హౌస్‌ను వోజిన్ కుసిక్ అనే వ్యక్తి, తన భార్య లుబికా కోసం నిర్మించాడు. కాలేజీ చదువుకూడా లేని కుసిక్ ఈ రొటేట్ హౌస్‌ను స్వయంగా డిజైన్ చేశాడట. కేవలం ఎలక్ట్రిక్ మోటార్లు, పాత మిలిటరీ రవాణా వాహన చక్రాలను ఉపయోగించి కట్టాడని అక్కడి స్థానిక మీడియాకు వెల్లడించాడు. జీవిత చరమాంకానికి చేరుకున్న తర్వాత, పిల్లలు కుటుంబ బాధ్యతలు తీసుకున్న ఇన్నేళ్లకి నా భార్య కోరిక తీర్చడానికి సమయం దొరికిందని చెప్పుకొచ్చాడు. కుసిక్ వివాహం చేసుకున్నాక భార్య, బిడ్డల కోసం అప్పట్లో ఒక ఇంటిని నిర్మించాడట. ఐతే ఆ టైంలో బెడ్ రూం సూర్యునికి ముఖాముఖిగా ఉండాలని భార్య కోరడంతో, భార్య అభీష్టానికి తగినట్లుగా గదుల నిర్మాణాన్ని మార్చాడు. రోడ్డుకి ఎదురుగా ముఖ ద్వారం వచ్చింది. దీంతో రోడ్డు మీద వెళ్లేవారందరినీ చూడాలనుకోవడం లేదని భర్తకు పిర్యాదు చేసింది భార్య. చాలా కష్టమైన పనైనప్పటికీ భార్య కోరుకున్నట్లు ప్రతిదీ మార్చవలసి వచ్చేదట. ‘ఇప్పుడైతే, మా ముందు తలుపు కూడా తిరుగుతుంది. రోడ్డు మీద వ్యక్తులెవరైనా కనిపిస్తే, ఆమె ఇంటిని తనకిష్టం వచ్చిన వైప్పుకు తిప్పుకోవచ్చు’అని సరదాగా మీడియాతో తన అనుభవాలను పంచుకున్నాడు. దీంతో ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: అలాంటప్పుడు.. తాళం ఎందుకేసుకున్నావయ్యా!! -
Viral Video: దాహంగా ఉంది.. కొంచెం నీళ్లు ఇస్తారా.. వామ్మో కోబ్రా..!!
మీకు పాములంటే చచ్చేంత భయమా? ఏమడుగుతున్నారండి.. పాములంటే భయపడనివారెవరన్నా ఉంటారా? ఇదేనా మీ సమాధానం.. ఐతే ఈ వీడియోను మీరు చూడాల్సిందే.. అట్లాంటి ఇట్లాంటి పాము కాదు కింగ్ కోబ్రా.. జంతువులు మనుషులకు సహాయం చేసే వీడియోలు వందలకొద్దీ చూసుంటారు. కానీ ఈ వీడియోలో మనిషే కింగ్ కోబ్రాకి హెల్ప్ చేస్తున్నాడు. అంత కష్టమేమొచ్చిందా పాముకు..! అసలేంజరిగిందంటే.. వాతావరణం బాగా వేడిగా ఉండటంతో దాహమేసిన కోబ్రా ఒక కాలనీలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన వారంతా భయంతో పరుగులు తీశారు. ఐతే ఒకతను మాత్రం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బకెట్‌తో నీళ్లు నింపి కోబ్రాకి స్నానం చేయించాడు. అంతేకాకుండా తాగడానికి నీళ్లు కూడా అందించడం ఈ వీడియోలో కన్పిస్తుంది. ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం కామెంట్ల రూపంలో అతన్ని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. పాముకు సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గత యేడాది జరిగిన సంఘటన ఇది. ఇప్పటికీ ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఏకంగా 33 లక్షల మంది వీక్షించారు. మానవత్వం ఇంకా బతికేఉందని దీనిని చూసిన వారంతా అంటున్నారు. ఐతే ఇటువంటి విషపూరిత జంతువులతో కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే వ్యవహారం బెడిసికొట్టి మొదటికేమోసం వస్తుందనేది వాస్తవం. మీ అభిప్రాయమేమిటి..!! చదవండి: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! View this post on Instagram A post shared by Sachin Sharma (@helicopter_yatra_) -
నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్!
న్యూయార్క్: ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌తో పాటు పలు సోషల్ మీడియా యాప్‌ల ద్వారా ఫేమస్ అవ్వాలని ప్రయత్నించే వారు పెరుగుతున్నారు. ఇలా ప్రయత్నిసస్తున్న వారిలో కొందరు విజయం సాధించి.. రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంటున్నారు. ఇదే కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీనిలో ఒక అమెరికన్ యూ ట్యూబర్ చాలా విచిత్రంగా "నేను గిటార్ వాయిస్తాను ఒక పాట పాడతారా" అని కనిపించిన వారందర్నీ అడుగుతున్నాడు. అతడి అభ్యర్థనను ఎవరైనా అంగీకరించాలా లేదా తెలియాలంటే ఇది చదవాల్సిందే. (చదవండి: మిస్ వరల్డ్ అమెరికాగా తొలి భారత సంతతి అమెరికన్) న్యూయార్క్‌లోని వీధుల్లో దారి పోడవున తనకు కనపించిన వాళ్లందర్నీ "నాతో పాడతారా ప్లీజ్" అంటూ అమెరికన్ గిటారిస్ట్ రెజినాల్డ్ గుయిలౌమ్ అడగటం మొదలుపెట్టాడు. ఒక భారతీయ వ్యక్తి గౌరంగ్ రాఖోలియా మాత్రమే అతని అభ్యర్థనను అంగీకరించాడు. పైగా నాకు హిందీ పాటు మాత్రమే వచ్చు అన్నాడు. దీంతో అతన పర్వాలేదు తాను ట్యూన్ నేర్చుకోవడానికీ కొద్ది నిమిషాలే తీసుకుంటానని గుయిలౌమ్ చెప్పాడు. ఆ తర్వాత గౌరంగ్ 1982లో వచ్చిన సినిమా 'సత్తె పే సత్తా' లోని లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ పాట దిల్బర్ "మేరే కబ్ తక్ ముజే, ఐస్ హాయ్ తాడ్పాగే" అనే పాటను తన ముబైల్లో వినిపించాడు. కొద్ది నిమిషాల్లోనే రెజినాల్డ్ రెడీ అని అనడంతో గౌరంగ్ కూడా సరే అన్నాడు. ప్రస్తుతం వీరు పాట పాడిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పైగా పాట పాడటం పూర్తయ్యాక గౌరంగ్ హడావిడిగా వెళ్లిపోతుంటే అమెరికన్ యూట్యూబర్ రెజినాల్డ్ తనతో కలిసి పాడినందుకు 'ధన్యావాద్' అని హిందీలో అన్నాడు. గౌరంగ్ ఇంగ్లీష్‌లో థ్యాంక్యూ అని చెప్పాడు. వీరిద్దరి ప్రవర్తనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పైగా వారు ఒకరి సంస్కృతిని ఒకరు మార్చుకున్నట్టుగా ఉంది కదూ అంటూ కామెంట్ చేస్తున్నారు (చదవండి: ఫోటోగ్రాఫర్లు వెంటపడటంతోనే అలా చేశా.....!: గ్రిమ్స్) -
Viral Video: అబ్బే ఏం లేదు.. నాకు కొంచెం సిగ్గెక్కువ.. అందుకే!!
అడవిలో పక్షులు, జంతువులకు వేటి సహజ అలవాట్లు వాటికుంటాయి. అందుకు ప్రత్యేకంగా ఏదైనా చేస్తేనే అది వండర్ అవుతుంది. కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులైతే మామూలే అనుకోవచ్చు. కానీ అడవికే రారాజు అయిన సింహం తన అలవాట్లు మార్చుకుందేమోననే సందేహం కలిగేలా ఉన్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలేంచేసిందంటే.. ఒక కదులుతున్న కారులో నుంచి ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కారు పబ్లిక్ టాయిలెట్ దగ్గర ఆగగానే లోపల్నుంచి బయటకు వస్తున్న సింహం కనిపిస్తుంది. వాళ్లను చూసిన సింహం ‘ఇది నాకు చాలా మామూలు విషయం’ అన్నట్టుగా నింపాదిగా బయటికి వచ్చి అడవిలోకి వెళ్లిపోతుంది. ఐతే ఈ సంఘటన ఎక్కడజరిగిందో తెలియదు కానీ దీనిని చూసిన నెటిజన్లు మాత్రం భిన్న కామెంట్లు చేస్తున్నారు. ‘మగ సింహం జంట్స్ టాయిలెట్స్ నుంచి బయటికి రావడం నిజంగా అభినందించదగిన విషయమే.. చదువుకున్న సింహం’ అని ఒకరు కామెంట్ చేస్తే, ‘చాలా సేపటినుంచి ఓపిక పట్టాను.. ఇప్పుడు ప్రశాంతంగా ఉందని’ మరొకరు కామెంట్ చేశారు. పబ్టిక్ టాయిలెట్స్‌లో జంతువులు కనిపించడం ఇది మొదటిసారేమీ కానప్పటికీ జంగిల్ సఫారీ టైంలో టాయిలెట్లకు వెళ్లాలంటే కొంచెం ఆలోచించి వెళ్లడం బెటర్ అనిపిస్తుంది ఈ వీడియోను చూస్తే! దీంతో ఈ వీడియోను వేలకొద్దీ నెటిజన్లు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. చదవండి: చరిత్రలో పెద్ద మిస్టరీగా మిగిలిన మృత్యులోయ..! -
ఏటీఎం సెంటర్లో యువతి.. సడన్‌గా ఏమైందో అలా ప్రవర్తించింది!
ఇటీవల సోషల్‌మీడియోలో వీడియోల హవా పెరిగిపోయింది. ముఖ్యంగా పెళ్లికి సంబంధించినవి నెట్టింట ఓ రేంజ్లో దూసుకుపోతున్నాయి. ఇక కొన్ని వీడియోలైతే అందులోని ఫన్నీ కంటెంట్‌తో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ యువతి ఎటీఎం సెంటర్లో చిందేసిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఏటీఎం సెంటర్లోకి డబ్బులు విత్‌డ్రా కోసం మాస్క్ ధరించి ఓ యువతి వచ్చింది. అయితే అందరిలా డబ్బు తీసుకుని వెళ్లలేదు. హఠాత్తుగా ఏమైందో తెలియదు గానీ అక్కడ ఆ యువతి డ్యాన్స్ వేయడం ప్రారంభించి, మాస్ స్టెప్పులతో ఇరగదీసింది. కాసేపు గ్యాప్ ఇచ్చి డబ్బులు విత్‌డ్రా పెట్టింది. ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు రాగానే లెక్కపెట్టుకుని మరోసారి డ్యాన్స్ దులిపేసింది. చివరగా, ఏటీఎం కేంద్రం నుంచి వెళ్తూ తలవంచి నమస్కారం చేసి వెళ్లిపోయింది. అయితే ఆ యువతి అలా ఎందుకు ప్రవర్తించిందో వివరాలు తెలియదు. ఈ వీడియోను ‘ఘంటా’ అనే యూజర్ ‘ఖుషి దేఖ్ రహే హో సాలరీ కి’ అని టైటిల్ పెట్టి నెట్టింట షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి 12 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. దీన్ని చూసి.. తన జీవితంలో తొలి సాలరీ అందుకుందేమో, అందుకే అలా చేసిందని కొందరు కామెంట్ చేయగా, డ్యాన్స్ ఇరగదీసిందని మరికొందరు కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by memes | news | comedy (@ghantaa) చదవండి: Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’ -
ప్రీతితో రితేష్.. కోపంగా జెనీలియా.. అసలు నిజం ఇదేనా?
ఐఫా అవార్డ్స్ 2019 సందర్భంగా కలిసిన ప్రీతి జింటా చేతులపై రితేష్ దేశ్‌ముఖ్ ముద్దు పెట్డుకోవడం, ఆ సమయంలో ఆయన భార్య జెనీలియా డిసౌజా కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టడం తెలిసిందే. అనుకోకుండా క్యాప్చర్ అయిన ఆ వీడియో చాలాకాలం తర్వాత బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దానిపై ఎన్నో మీమ్స్, జోకులు హల్చల్ చేశాయి. తాజాగా అలా కోపంగా ఉండడానికి కారణాన్ని తెలియజేసింది జెనీలియా. తాజాగా జెనీలియా తన భర్త రితేష్‌తో కలిసి అర్భాజ్‌ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ సీజన్ 2కి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి అడగగా.. ‘చాలా కాలం తర్వాత, నేను ఓ అవార్డు ఫంక్షన్‌కు హాజరయ్యాను. కొత్త డ్రెస్ వేసుకొని, హై హీల్స్ వేసుకొని వెళ్లాను. చాలా రోజుల అనంతరం వేసుకున్న హై హీల్స్ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుండగా అలా ఉన్నాను. అలా నేను ఇబ్బంది పడుతుంటే రితేష్, ప్రీతి చేతులపై ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్యామెరాలో బంధించారు. అంతేకానీ మరేం లేదని’ జెన్నీ తెలిపింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది ఈ నటి. అందులో ఇంటికి రాగానే ఈ భామ.. భర్త రితేష్‌ను కొడుతున్నట్లు, ఆయన వద్దని వేడుకుంటున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీనిపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందించారు. కాగా వీరిద్దరూ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
Bella Ciao: ఇటాలియన్ పాట గుజరాతీ నోట
-
యువతిపై దాడి చేస్తూ వీడియో చిత్రీకరణ
నెల్లూరు(క్రైమ్): తనను దూరంగా ఉంచడాన్ని జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఓ యువతిపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. పైగా ఆ వ్యవహారాన్ని స్నేహితుడి ద్వారా వీడియో తీయించాడు. ఆ వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు బుధవారం మీడియాకు వెల్లడించారు. నెల్లూరు రామకోటయ్యనగర్‌కు చెందిన పల్లాల వెంకటేష్, కె.శివకుమార్ స్నేహితులు. వెంకటేష్ టిప్పర్ డ్రైవర్. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య అతనిని విడిచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో వెంకటేష్ ఓ యువతితో సన్నిహితంగా ఉండేవాడు. అయితే అతని ప్రవర్తన నచ్చక ఆమె అతనిని దూరంగా ఉంచుతూ వచ్చింది. దీనిని అతను జీర్ణించుకోలేకపోయాడు. సుమారు మూడు నెలల కిందట మాట్లాడుకుందామని యువతిని కొత్తూరు సమీపంలోని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో, చేతులతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. గాజులు పగిలి రక్తస్రావం అవుతున్నా కనికరించలేదు. బాధిత యువతి తనను వదిలేయాలని కన్నీటి పర్యంతమైనా పట్టించుకోకుండా దాడి చేస్తూ ఆ వ్యవహారాన్ని స్నేహితుడు శివకుమార్ ద్వారా వీడియో తీయించి పైశాచికానందం పొందాడు. అయితే ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. గంటల వ్యవధిలో నిందితుల అరెస్ట్ మూడు నెలల అనంతరం బుధవారం వాట్సాప్, ట్విట్టర్, పలు చానళ్లలో యువతిని చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్ అయింది. దీనిపై ఎస్పీ విజయారావు స్పందించి.. నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. సాంకేతికత సాయంతో వీడియోలోని నిందితులను గుర్తించి, తెగచర్లలో వారిని అరెస్ట్ చేశారు. నిందితులిద్దరిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఏడు రోజుల్లోపు చార్జ్‌షీటు వేసి శిక్షపడేలా చేస్తామని చెప్పారు. గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్ట్‌చేసిన నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, వేదాయపాళెం ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులను ఎస్పీ విజయారావు అభినందించారు. -
బుల్లెట్ బండికి బామ్మ అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ వీడియో
సోషల్‌మీడియాలో ఏది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో చెప్పలేం. అలా ఏదైనా ఓసారి నెటిజన్లను ఆకట్టుకుంటే అవి వైరల్‌గా మారి నెట్టింట రచ్చ చేస్తుంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే వాటి హవా కొంత కాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక ‘బుల్లెట్ బండి’ పాట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజలే గాక సెలబ్రిటీల సైతం ఈ పాటకి చిందేస్తున్నారు. తాజాగా ఓ బామ్మ తన భర్త ముందు ‘బుల్లెట్ బండి’ పాటకు స్టెప్పులతో ఇరగదీసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం.. శ్రావణమాసంలో పెళ్లిళ్లతోపాటు ‘బుల్లెట్ బండి’ పాట ట్రెండ్ కూడా నడుస్తోంది. ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభించినప్పటి నుంచి బరాత్ అయ్యే వరకూ ఎక్కడ చూసినా ‘డుగ్గు డుగ్గు’ అంటూ ఒకటే మ్యూజిక్ వినిపిస్తోంది. దీంతో ఈ పాటకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ అంతకంతకు క్రేజ్ పెరుగుతోంది. అయితే ఓవైపు ‘బుల్లెట్టు బండి’ వీడియోలతో పెళ్లికూతుళ్లు, యువతీయువకులు అలరిస్తుంటే మరోవైపు తాను కూడా తక్కువకాదంటూ ఓ వృద్ధురాలు ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఆ వీడియోలో.. దాదాపు 60 ఏళ్లకు పైగా వయసున్న ముసలావిడ .. ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కి అద్భుతమైన స్టెప్పులేసింది. తన భర్త మంచంపై కూర్చొని చూస్తుండగా.. సరిగ్గా సాంగ్‌లో రిథమ్‌కి తగ్గట్టు ఆమె డాన్స్ చేసింది. అయితే అతను మాత్రం కదలకుండా అలా చూస్తూనే ఉండిపోయాడు, బహుశా షాక్‌లో ఉన్నాడేమో! ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్ బామ్మ అంటున్నారు. కొందరు ఫన్నీగా ఉందని కామెంట్ పెడుతుంటే.. మరికొందరు ‘బామ్మ నువ్వు గ్రేట్’ అని కామెంట్ పెడుతున్నారు. చదవండి: Cat Drink Pig Milk: పంది పాలు తాగిన పిల్లి.. వైరల్ అవుతున్న వీడియో -
కుమ్మేసిన కుండపోత: వైరలవుతోన్న ఫోటోలు, వీడియోలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో గురువారం రాత్రి పలుచోట్ల కుండపోత వర్షం కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, కుత్బుల్లాపూర్, రంగారెడ్డి నగర్, షాపూర్‌నగర్, మూసాపేట, అమీర్‌పేట, మైత్రీవనం, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, పంజాగుట్ట మెట్రో, ఎర్రగడ్డ, శ్రీనగర్ కాలనీ, రాజ్‌భవన్ రోడ్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్, ఖైరతాబాద్, హబ్సిగూడ, టోలిచౌకి, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, నారాయణగూడ, హిమాయత్ నగర్ ప్రాంతాల్లో వర్షం భారీగా కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ప్రస్తుతం నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. రాత్రి 7.50 నుంచి 9 గంటల వరకు కుంభవృష్టి కుమ్మేసింది. వరదనీటితో రోడ్లన్నీ జలమయమయ్యాయి. మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాత్రి 11 గంటల వరకూ రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు క్లియర్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. నగరంలో సుమారు వంద ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల వరకు జూబ్లీహిల్స్‌లో 9.8, మూసాపేటలో 9.6, చందానగర్‌లో 8.8, సరూర్‌నగర్‌లో 8.3, మోతీనగర్‌లో 7.9, మాదాపూర్‌లో 7.7, యూసఫ్‌గూడలో 7.6, బాలానగర్‌లో 7.1, చాంద్రాయణగుట్టలో 6.9, శ్రీనగర్ కాలనీలో 6.8, ఫాతిమానగర్‌లో 6.5, ఎల్బీనగర్లో 6.3, రంగారెడ్డి నగర్లో 5.9, జీడిమెట్లలో 5.8, ఆసిఫ్‌నగర్, కేపీహెచ్‌బీలలో 5.7, గాజులరామారంలో 5.4, అత్తాపూర్‌లో 4.5 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదయ్యింది. రంగంలోకి జీహెచ్ఎంసీ బృందాలు జీహెచ్ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి రోడ్లపై నిలిచి నీటిని తోడివేశాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయక చర్యల కోసం 040 21111111 నంబర్‌కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇళ్లలోంచి బయటికి రావద్దని ప్రజలను అప్రమత్తం చేసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Watch 😱😱 #hyderabadrain #hyderabadflood #heavyrains @HiHyderabad @HiWarangal @balaji25_t @HYDmeterologist pic.twitter.com/8JMkPvlTBd — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 It’s not #istanbul means Old City of #Hyderabad it’s #Dallas of #Telangana #YousufGuda #KrishnaNagar #HyderabadRains pic.twitter.com/lIjQRhCxZK — Mubashir.Khurram (@infomubashir) September 2, 2021 #hyderabadrain #hyderabadflood#hyderabad #StayHomeStaySafe@HiWarangal @HiHyderabad @DonitaJose pic.twitter.com/yFNrlek4VV — Mohammad fasahathullah siddiqui (@MdFasahathullah) September 2, 2021 -
షారుక్ పాటకు.. స్టెప్పులు వేసిన అమెరికన్ జంట
గతంలో భోజపూరీ పాట లాలీపాప్ లాగేలు, తెలుగులో అల్లుఅర్జున్ బుట్టబొమ్మ పాటకు స్టెప్పులు వేసి అదరగొట్టిన అమెరికన్ జంట మళ్లీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ నటించిన రావన్ సినిమాలోని చమ్మక్ చల్లో పాటకి డ్యాన్స్ చేసి ఈ జంట నెటజన్లను ఫిదా చేస్తోంది. 25 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా రీకీపాండ్ తన భార్యతో కలిసి చమ్మక్ చల్లో పాటకు స్టెప్పులు వేశాడు. కాగా సోషల్ మీడియాలో "డ్యాన్సింగ్ డాడ్" అని పిలువబడే రికీ పాండ్, అతని భార్య భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించారు. రికీ పాండ్ పైజామా ధరించగా.. అతని భార్య కుర్తా, గాగ్రా ధరించారు. ఈ వీడియోని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసి చమ్మక్ చల్లో.. 25వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఇప్పుడు ఈ వీడియో వైరల్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటజెన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Ricky Pond (@ricky.pond) -
Viral Video: అక్కడ జాన్ సీనా అయితే ఇక్కడ సురేశ్ రైనా..
దుబాయ్: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు సురేశ్ రైనా మైదానంలోనూ, వెలుపల ఫుల్ జోష్‌లో ఉంటాడు. ఐపీఎల్ మలిదశ మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం దుబాయ్‌లోని ప్రాక్టీస్ సెషన్లలో బిజీగా ఉన్న అతను.. తాజాగా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. అందులో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ జాన్ సీనా మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా, స్విమ్మింగ్ పూల్ వద్ద సహచరుడు కేఎమ్ ఆసిఫ్‌తో రైనా జాన్ సీనా స్టంట్‌ను ప్రదర్శిస్తాడు. దీనికి 'దట్ నేమ్ ఈజ్ జాన్ సీనా.. మై నేమ్ ఈజ్ సురేశ్ రైనా' అని క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. రైనా అద్భుతంగా స్టంట్‌ను ప్రదర్శించాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకెండ్ లెగ్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. అదే రోజు సీఎస్కే జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో జరిగిన తొలి ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో సీఎస్కే పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండగా, ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. అయితే, మొదటి 7 మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీ సహా కేవలం 123 పరుగులు మాత్రమే చేసిన రైనా.. చెన్నై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చదవండి: ఆండర్సన్‌కు ఇదే ఆఖరి సిరీస్.. ఐదో టెస్ట్ అనంతరం రిటైర్మెంట్..? View this post on Instagram A post shared by Suresh Raina (@sureshraina3)