జీలుగుమిల్లిలో ఏసీబీ సోదాలు
జీలుగువిుల్లి: పోలవరం భూసేకరణ అధికారి కా ర్యాలయంలో దొరికిన నగదును జీలుగువిులి్లకి చెం దిన వడ్డీ వ్యాపారి ఇచ్చినట్టుగా తెలియడంలో ఏసీబీ అధికారులు ఇక్కడ సోదా లు చేశారు. జిల్లా ఏసీబీ డీఎస్పీ వేణుగోపాల కృష్ణ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు స్థానిక వ్యాపారి కక్కిరాల రాము ఇంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏసీబీ సీఐ సూర్యమోహనరావు ఎన్ జీఓ అధికారుల సమక్షంలో సోదాలు చేశారు. ప్రాంసరీ నోట్లు, ఖాళీ స్టాంప్ పేపర్లు, భూసేకరణ కార్యాలయంలో నగ దు ఇచ్చిన కొర్స బుచ్చిరాజుకు చెందిన ఆధార్ కార్డు, స్టాంప్ పేపర్లు సీజ్ చేసి కోర్టుకు సమర్పిస్తామని సీఐ సూర్యమోహనరావు చెప్పారు.