breaking news
Colorful
-
కలర్‌ఫుల్ శారీలో ధగధగ మెరిసిపోతున్న హీరోయిన్ హన్సిక (ఫోటోలు)
-
కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఆదిపురుష్ భామ కృతి సనన్.. ఫోటోలు
-
Pragya Jaiswal: కలర్‌ఫుల్ డ్రెస్‌లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
-
సమ్మర్లో కంఫర్టబుల్‌గా... కలర్ఫుల్గా! (ఫోటోలు)
-
వెలుగులతో ముస్తాబైన హైదరాబాద్ (ఫొటోలు)
-
చుక్..చుక్.. చిత్రాలెన్నో ! మారిన రైల్వేస్టేషన్ రూపు రేఖలు
సాక్క్షి, హైదరాబాద్(శేరిలింగంపల్లి): నగర శివారులోనే అతిపెద్దది అయిన లింగంపల్లి రైల్వేస్టేషన్ ఒకప్పుడు కళాహీనంగా ఉండేంది. నిత్యం ప్రయాణికులతో కళగా ఉండే ఈ స్టేషన్ ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. స్టేషన్‌లోని గోడలకు వేసిన వివిధ చిత్రాలు వచ్చిపోయే ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. చిత్రం చెప్పే అర్థం.. జంతువులు..పక్షులు..పర్యావరణం..స్వచ్ఛభారత్..ఇలా ఎన్నెన్నో చిత్రాలు కొలువుదీరాయి. రైల్వేస్టేషన్‌లోని ప్రతి గోడకు రకరకాల జంతువులు, పక్షులతోపాటు రాజుల కాలం నాటి వైభవాన్ని ప్రతిబింబించేలా ఆకట్టుకుంటున్నాయి. పులి, ఏనుగు, నెమలి, ఇతర పక్షుల చిత్రాలు అలరిస్తున్నాయి. గ్రామీణ వాతావరణంతోపాటు జలపాతాలు, పడవలు, సూర్యుడు ఉదయించే దృశ్యాలు ఇలా ఎన్నో చిత్రాలు ప్రయాణికుల హృదయాలను హత్తుకునేలా ఉన్నాయి. శివారులోనే అతిపెద్దది నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్‌కు గుర్తింపు ఉంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్ల రాకపోకలు ఇక్కడి నుంచే సాగుతాయి. పలు కొత్త రైళ్లు కూడా ఇక్కడి నుంచే ఆరంభించాలనే ఆలోచన కూడా ఉంది. ఎంఎంటీఎస్ ఇక్కడి నుంచే... ఎంఎంటీఎస్ రైళ్లను నగరంలోని నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఇక్కడి నుంచే బయలుదేరతాయి. దీంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐటీ కారిడార్‌కు కేంద్రంగా ఈ ప్రాంతం మారడంతో రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. పలు ఐటీ సంస్థలు తమ సంస్థ ఉద్యోగుల కోసం లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు ప్రత్యేక బస్సులు, ఇతర వాహనాలు సైతం నడుపుతున్నాయి. నగర శివారులోనే అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా లింగంపల్లి స్టేషన్ అభివృద్ధికి నోచుకుంది -
రంగుల ఎక్స్‌రే...
వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది అనుకున్న ఈ కాలంలో కూడా ఎక్స్‌రే నలుపు తెలుపుల్లోనే ఉండటం ఏమిటని మీకెప్పుడైనా అనిపించిందా? త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. శరీరం లోపలి భాగాలను రంగుల్లో చూసుకునేందుకు రంగం సిద్ధమైంది. మార్స్ బయో సెన్సింగ్ అనే న్యూజిల్యాండ్ కంపెనీ పరిశోధనల పుణ్యమా అని అందుబాటులోకి రానున్న త్రీడీ స్కానర్ ఎముకలు, కండరాలతో పాటు కొవ్వులను కూడా రంగుల్లో చూపుతుంది. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల సీఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు ఈ స్కానర్ కోసం ప్రత్యేకమైన మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడం విశేషం. సంప్రదాయ సీటీ స్కాన్ల ద్వారా శరీరం లోపలికి ఎక్స్‌రే కిరణాలు ప్రసరించినప్పుడు దాని తీవ్రతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా ఎక్స్‌రే తయారవుతుంది. ఎముకల గుండా ప్రయాణించినప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతం తెల్లగానూ, తగ్గని కండరాల ప్రాంతం నల్లగానూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లోపలి పదార్థాన్ని బట్టి తగు తరంగ దైర్ఘ్యమున్న కిరణాలను పంపగల స్పక్ట్రల్ స్కానర్లను వాడటం ద్వారా మార్స్ బయో సెన్సింగ్ కలర్ ఎక్స్‌రే యంత్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించిన ఈ కంపెనీ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
పున్నమి వసంతం..రంగుల ప్రపం
నగరం సప్తవర్ణ శోభితమైంది. రంగుల లోకంలో మునిగితేలింది. సిటీలో హోలీ వేడుకలు ఆదివారం అంబరాన్నంటాయి. యువ జోష్.. కలర్‌ఫుల్ కిక్‌తో పబ్బులు, క్లబ్బులు, రిసార్ట్స్ ఉర్రూతలూగాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సందడి చేశారు. -
‘మిస్ సౌత్ ఏసియా-2014’
గ్లామర్‌కి సోషల్ రెస్పాన్సిబిలిటీ తోడైతే వరల్డ్ మరింత కలర్‌ఫుల్ అవుతుందని అంటోంది త్రిష గూడూరు. రంగుల లోకంలో విహరించడమే కాదు.. హంగులన్నీ పక్కన పెట్టి.. పేదరికంతో బాధపడే చిన్నారుల కన్నీళ్లూ తుడవాలనేది ఈ అమ్మడి మాట. ఇటీవలే అమెరికాలోని అట్లాంటాలో ‘మిస్ సౌత్ ఏసియా-2014’గా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ హైదరాబాద్ వచ్చిన సందర్భంగా తన ఆశలు.. ఆశయాల్ని ‘సాక్షి సిటీప్లస్’తో ఇలా పంచుకుంది. ..:: శిరీష చల్లపల్లి మాది కరీంనగర్. అక్కడే పుట్టాను. పన్నెండో ఏట వరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. చిన్నప్పటి నుంచి చారిటీ యాక్టివిటీస్ అంటే ఇంట్రెస్ట్. డాక్టర్నై గ్రామీణ ప్రాంత పేదల కోసం ఏమైనా చేయాలని ఆశయం. ప్రస్తుతం అమెరికాలో వైద్యవృత్తిని అభ్యసిస్తున్నాను. చదువు.. చిన్నారులు నాన్న బ్యాంకు ఎంప్లాయ్. తరచూ బదిలీలు కావడంతో పలు ప్రాంతాలకు మారే వాళ్లం. ఈ సమయంలోనే పల్లెలకు-పట్నాలకు మధ్య తేడాలను గమనించే దానిని. నన్ను అప్పుడు ఇప్పుడూ బాగా కలవరపరిచే విషయం.. పల్లెల్లోని చిన్నారులు చదువుకు దూరమైపోవడం. వారికి చదువు ప్రాముఖ్యాన్ని వివరిస్తే మంచి ఫలితాలు ఉంటాయని నమ్మి.. ఆ దిశగా నా వాలంటీర్‌షిప్ ప్రారంభించాను. క్రమశిక్షణతోనే.. నేను అందాల టైటిల్ గెల్చుకున్నానంటే.. దాని వెనుక హార్డ్‌వర్క్ ఉందని చెప్పను. క్రమశిక్షణ, ప్లానింగ్‌తోనే ఈ కిరీటాన్ని గెల్చుకున్నా. లైఫ్‌లో డిసిప్లెయిన్ ముఖ్యమని నాన్న చెప్పిన మాటల్ని అనుసరించాను. నన్ను నేను మెరుగు పరుచుకున్నా. నా రోల్‌మోడల్ ఐశ్వర్యరాయ్. నా పేరెంట్స్‌కి నన్ను నేను గిఫ్ట్‌గా ఇచ్చుకోవాలనున్నా. చారిటీలో నిమగ్నమయ్యా. రోజూ రెండు గంటల చొప్పున పల్లెల్లో పనిచేశాను. నీటి కాలుష్యం, దాని దుష్పరిణామాలపై ప్రచారం చేశా. పిల్లలకు చదువు ఇంపార్టెన్స్ గురించి వివరించాను. న్యూయార్క్‌లా ఉంది.. హైదరాబాద్‌ను వదిలి పదేళ్లయింది. రింగ్‌రోడ్, ఫ్లైఓవర్స్, మాల్స్.. ఇవన్నీ అప్పుడు లేవు. ఇప్పుడెంతో మారిపోయింది. ఈ డెవలప్మెంట్ మంచిదే. హైదరాబాద్‌కి న్యూయార్క్‌తో చాలా పోలికలున్నాయి. మెట్రో రైల్ వస్తే సిటీ ఇంకా మారిపోతుంది. ఎంత మారినా.. ఈ నగరం తన సంస్కృతిని, సంప్రదాయాన్ని పదిలంగా కాపాడుకుంటోంది. అదిరేటి డ్రెస్ మనదే.. నేను అమెరికాలో ఉన్నా, మన సౌతిండియన్ సంప్రదాయ వస్త్రధారణనే ఇష్టపడతాను. ముఖ్యంగా లంగా-ఓణీ, చీరలో మన తెలుగుదనం ఉట్టిపడుతుంది. అక్కడ జరిగే ఏ పార్టీకైనా నేను ఈ డ్రెస్‌లో అటెండ్ అవుతా. స్వచ్ఛంద సంస్థలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించే యోచనలో ఉన్నాను. అదే పనిపై ప్రస్తుతం నేను సిటీకి వచ్చాను.


