మైక్రోమ్యాక్స్ తొలి 4జీ స్మార్ట్ ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన తొలి 4జీ స్మార్ట్ ఫోన్ 'కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 4జీ'ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీర్ఘకాలిక 4జీ డివైసెస్ ప్రణాళికను కూడా వెల్లడించింది. మార్కెట్ లో ఇప్పుడు 4జీ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోందని, దానికి అనుగుణంగా కొత్త ఫోన్లు తీసుకువస్తున్నామని మైక్రోమ్యాక్స్ సీఈవో వినీత్ తనెజా తెలిపారు.
ఆన్ లైన్ లో అమ్ముడవుతున్న వాటిలో 40 శాతం 4జీ ఫోన్లే అని చెప్పారు. తమ పోర్ట్ పోలియాలో 4జీ డివైసెస్ 13 ఉన్నాయని, వీటిలో చాలావరకు మిడ్-రేంజ్ సెగ్మెంట్ లోనివేనని తెలిపారు. 'కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 4జీ' స్టార్ట్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభ్యమవుతుందని వెల్లడించారు.
'కాన్వాస్ ఎక్స్ ప్రెస్ 4జీ' స్పెసిఫికేషన్స్
1 గిగాహెర్ట్జ్ మీడియా టెక్ ఎంటీ 6735 ప్రాసెసర్
2జీబీ డీడీఆర్ఎం3 ర్యామ్
5 అంగుళాల తెర,
8 ఎంపీ రియర్ కెమెరా,2 ఎంపీ ఫ్రంట్ కెమెరా
16 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ
ధర రూ. 6,599