26వ వారం మేటి చిత్రాలు

 • బాబుకు ఏమైంది బాబులూ..! తల బరువు దించుతున్నట్టున్నారు..! (ఫోటో: బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • బాల్యం బజారున పడింది. వీధి అరుగులపై లెక్కలేసుకుంటోంది..! (ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

 • బాడర్లో సైనికుడా..! దారిచూపే దయగలవాడా..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ)

 • కలియుగ ప్రత్యక్ష దైవం కల్యాణానికి దేవతలే దిగొచ్చిన వేళ..! (ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • ఆటో అటో ఇటో..! ఇంధనం కొనాలంటే ధనమంతా వ్యయం కావాల్సిందేనా..! (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • వర్షానికి వెరవను. విధికి విరామమివ్వను..! : కమిషనర్‌ అంజనీకుమార్‌ (ఫోటో: ఎం.రవికుమార్‌, హైదరాబాద్‌)

 • గాలిమోటర్‌లో కేసీఆర్‌.. జర ఇక్కడ దిగరాదు ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • బుల్లి గణపయ్యకు రామన్న రంగులు..! (ఫోటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్‌)

 • ప్రళయమా..! ప్రకృతి తెరవబోతున్న మూడో నేత్రమా..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • అధినేత అడుగులు పరుగల్లే సాగగా.. అభిమానుల గుండెల్లో ఆనందం ఉప్పొంగే..! (ఫోటో: బాషా, అనంతపురం)

 • పాటల పల్లవికి నీ పద్మపాదములు పరుగెత్తే మయూర నాట్యమై..! (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 • ఒకే చోట చేరాయి. అందాల రెక్కలతో మూకుమ్మడి ముచ్చట్లకు..! (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 • పండగని రంగుల్లో మురిసిపోతున్నారు. పడ్డారో హుషారు పరారే..! (ఫోటో: మురళి, చిత్తూరు)

 • మరో ప్రపంచం కాదు. ఒకే చోట చేరిన పొగ పిశాచి. బతుకుల్ని చీకటి చేసే మహమ్మారి..! (ఫోటో: ఎంవీ.రమణ, గుంటూరు)

 • వాన కురిస్తే రోడ్డు తీరు మారాల్సిందే. బురదమయం కావాల్సిందే..! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • తాగి పడిపోయిన వారికి వసతి గృహమా..? తాగే వసతి కల్పించే గృహమా...! (ఫోటో: నోముల రాజేష్‌రెడ్డి, హైదరాబాద్‌)

 • పిట్ట కొంచమే. కూత ఘనం..! రెండిళ్ల నిర్మాణం పూర్తయిన తరుణం..! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • సరికొత్త పడవ ప్రయాణానికి సిద్ధమయ్యారా..! అయితే గుర్రం డెక్కలపై స్వారీయే..! (ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • యువతా మేలుకో..! బండిపై ఫోటో తీస్కో.! ఫోటోకి దండేసుకో..! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • నీ గమ్యం స్పష్టమైనప్పుడు.. మిగతావన్నీ అగమ్యమై నీ దారికి దూరంగా పోవాల్సిందే..! (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • ప్రమాదం ఎక్కడో లేదు. మూడు చక్రాల మాటున పాతికమందిని చూస్తూ పరుగెడుతోంది..! (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • నీ లక్ష్యం సెల్ఫీ అయినప్పుడు నువ్వెక్కడున్నా..అదే ధ్యాస..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • పసికూన ప్రాణాలను రోడ్డున పడేయొద్దు తల్లీ..!! (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • సెల్ఫీ విత్‌ ఫ్రెండ్స్‌..! నవ్వులెందుకు దాచుకున్నారు ఫ్రెండ్స్‌..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • సుందర పచ్చిక బయళ్ల అందాలలో..! రాములోరి పుణ్యక్షేత్రం..!! (ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూలు)

 • గూడ్స్‌ రైలు వచ్చే..! ఎరువుల సంచులు తెచ్చే..!! (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • అందరూ చేరండి అందంగా బందిస్తా..! తలా ఒకటి పంచేస్తా..!! (ఫోటో: కె.సతీష్‌, సిద్దిపేట)

 • భజ గోవిందం..! రంగుల్లో మెరిసిపోతున్న వెంకన్న అందం..!! (ఫోటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • యోగా డే స్పెషల్‌... విద్యార్థుల ఆసనాలు ( ఫోటో: చంక్రపాణి, విజయవాడ)

 • చిట్టి చిలకమ్మా... మామిడికాయ తియ్యనా.. పుల్లనా..! ( ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • ఫిష్‌.. తింటారో లేరో ఆజ్‌ యువర్‌ విష్‌..! ( ఫోటో: విశాల్‌, విజయవాడ)

 • ఆకు కూర పంట.. తింటే ఆరోగ్యమే అంటా..! ( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • చెట్టంత సాయం.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు నీడనిస్తున్న భారీ వృక్షం ( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • విచిత్ర వేషధారణ.. వీళ్లూ మనుషులేనోయ్‌ ( ఫోటో: మోహన్‌, వైజాగ్‌)

 • సంతకాల వంతెన.. ఇంకెంత కాలం..! ( ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top