18వ వారం మేటి చిత్రాలు

 • మెరుపు మెరిస్తే.. వాన కురిస్తే.. అన్నదాత వెన్నులో వణుకే..!! (ఫోటో: వేణు గోపాల్‌, జనగాం)

 • సమ్మర్‌లో సరదా సర్కస్‌ అనుకుంటే.. బురదలో కాలేసిట్టే.. అది గుంతల దారుల్లో టిప్పర్‌ తిప్పల్‌..!! (ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • రండి చల్లని వేడుక చేస్కుందాం..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • నా పేరు సూర్య, నేనుండేది హైదరాబాద్‌..!! (ఫోటో: ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అన్నానికి అరటాకు.. అధికారానికి చంద్రబాబు పాదం తాకు తాకు తాకు (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • హా..! రిలాక్స్‌ రిలాక్స్‌..! అసలే ఎండలు మండిపోతున్నాయ్‌. మళ్లీ నా ప్రకోపమేలా..! (ఫోటో: భాషా, అనంతపూర్‌)

 • నేరుగా చెప్పొచ్చుగా బహిరంగా కానిచ్చేయండనీ.. ఎందుకో ఈ ‘భారీ’ ఏర్పాట్లు...! (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 • పేరుకేమో అత్యవసర సేవలు..! కానీ, కనీస వసతులు అనవసరమా..? (ఫోటో: మురళీ, చిత్తూరు)

 • ఓవైపు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, మరోవైపు ప్రకృతి కన్నెర్ర..! వెరసి మిర్చిరైతు గోస నీట కలిసిపోతోందిలా..! (ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • భగభగల భానుడి తాపానికి గొడుగులతో హాయ్‌..! అందాం.. లేదంటే మాడిపోయే జాబితాలో మనమూ ఉంటాం..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • కూలర్‌ తీసుకెళ్తున్నారు.. బాగు బాగు. కానీ, మాడు పగిలి పోకుండా జాగ్రత్తపడితే బహు బాగు..!! (ఫోటో: ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • ఎండల్లో ఎవరైనా రెక్కలు విచ్చుకోవాల్సిందే.. వేడి గాలులకు చల్లని నీరు తారసపడితే..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • నీలాకాశంలో సహజ బింబం.. అమ్మ తలపై భక్తి ప్రకాశం..!! (ఫోటో: వేణు గోపాల్‌, జనగాం)

 • ఎండల్లో హాయ్‌ హాయ్‌.. ఇళ్లంతా జాయ్‌ జాయ్‌..!! (ఫోటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • గురి చూసి కొట్టండి.. పన్నెండు‘గురి’ విన్యాసం పదుగురికి దారి చూపాలి..!! (రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • గురి కుదరాలంటే ఏక నేత్రాభినయం చేయాల్సిందే..!! (రాదారపు రాజు, ఖమ్మం)

 • ఆకాశానికి కేగిన బాల హనుమాన్‌ కాదు.. బంతి కోసం పైకెగిరిన కుర్ర మారుతి..!!

 • ప్రాబ్లమ్‌ వస్తే పోలీస్‌ జీపైన ఆగాల్సిందే.. నలుగురు తొయాల్సిందే.. (ఫొటో: మురళీ మోహన్‌, మహబుబబాద్‌)

 • నువ్వు మోరగడం తప్ప, మాలాగా గోడలెక్కలెవ్‌ రా.. ఇంగ ఉకో ఉకో.. (ఫొటో: భాస్కరా చారీ, మహబుబ్‌నగర్‌)

 • బర్డ్‌ కిసింగ్‌.. తల్లితో పిల్లలు (ఫొటో: నర్సయ్య, మంచిర్యాల)

 • మార్కెట్‌ నిండిన పంట.. వర్షం వస్తే రైతన్నకు తంట (ఫొటో: సుధాకర్‌, నాగర్‌కర్నుల్‌)

 • వామ్మో సుడిగాలి మొదలైంది.. చినుకు పడక ముందే ఇంటికి చేరాలే (ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • దుమ్ములేపుతున్న సుడిగాలి.. ఇంటికెళ్లే దారేది (ఫొటో: ఎం. సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • తాత జోల పాట.. చల్లని నీడ కింద చంటి పాప నిద్ర (ఫొటో: ఎం. సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి)

 • రిక్షా రాంబాబు.. మేడే సందర్భంగా రిక్షా తొక్కుతున్న అంబటి రాంబాబు.(ఫొటో: ప్రసాద్‌, రాజమండ్రి)

 • తెలంగాణ తల్లిని మర్చిన బిడ్డలు (కె.సతీష్‌, సిద్దిపేట్‌)

 • కాంక్రీట్‌ జంగల్‌లో సుదరమైన సడక్‌ (ఫొటో: మోహన కృష్ణ)

 • హోదానే ఆటోవాలా ఎజెండా.. తోడుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జెండా (ఫొటో: మహమ్మద్‌ రఫీ, తిరుపతి)

 • మోదీ తెచ్చిన మట్టి మా నోట్లో నీళ్లు మా ఆశలపై.. హోదా కోసం ఆంధ్రుడి ఆవేదన (ఫొటో: మహమ్మద్‌ రఫీ, తిరుపతి)

 • నింగికి నిచ్చేన.. ఇలాంటి మెరుపు మళ్లీ మళ్లీ వచ్చేనా (ఫొటో: నడిపూడి కిశోర్‌, విజయవాడ)

 • లారీల పడవ ప్రయాణం.. జాలర్ల ఆసక్తి వీక్షణం (ఫొటో: నడిపూడి కిశోర్‌, విజయవాడ)

 • ముస్తాబైన ఒంటెల జంట (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • తడవకుండా ఉండేందుకు తాటాకు గొడుగు.. (ఫొటో: సత్యనారాయణ, విజయనగరం)

 • దివినుంచి భూవికి దిగివచ్చిన మెరుపు తీగ (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • వరి రాశి రైతన్న ఇంట సిరిలు కురిసి.. వరిని రాశిగా పోస్తున్న రైతక్కా (ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top