20వ వారం మేటి చిత్రాలు

 • చల్ల, చల్లగా.. సమ్మర్‌ స్పెషల్‌గా ఉందామా...! శీతల పానీయాలకే జై కొడదామా..!! (ఫోటో: ఎస్‌.ఎస్‌. టాకూర్‌, హైదరాబాద్‌)

 • సినిమా సెటింగ్‌ కాదు..! వాయు, వరుణ దేవుల బీభత్సానికి సాక్ష్యంగా నిలిచిన చిత్రం..! (ఫోటో: ఎం. రవికుమార్‌)

 • ప్రభుత్వాన్ని నిరసిస్తే... కృష్ణ నివాసం చేరాల్సిందే..!! అది ఢిల్లీ అయినా.. గల్లీ అయినా..!! (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • చెక్కులతో వచ్చిన చిక్కు..! కౌలు రైతుపై తుమ్మల గరం గరం..!! (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • అరణ్య పర్వం కాదిది.. అల్లరి మూకల చిల్లర వేశాలకు ఆహుతవుతున్న ద్విచక్ర వాహనాలు..! (ఫోటో: ఎంవీ రమణ, గుంటూరు)

 • ‘దుమ్ము లేపుతున్న’ చంద్రబాబు.. తట్టుకోలేక అధికారుల ఆపసోపాలు..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • జల ప్రళయం కాదిది..! కాసింత వర్షానికే కట్టలు తెంచుకున్న నాలా ప్రవాహంలో చిక్కిన షట్చక్ర వాహనం..! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • కూచిపూడి నృత్యంలో పూసిన ‘కళా’కారులు.. మీ అభినయానికివే మా కరతాళ ధ్వనులు..! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • తరగని అభిమానం.. జనహృదయ నేతకు క్షీరాభిషేకం (ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • నీట మునిగిన స్కూటీ..! వాట్‌ ఎ పిటీ..!! (ఫోటో: ఎం. రవికుమార్‌)

 • ఎర్రటి ఎండలో.. ఎర్రపూల నీడలో.. సరదాల రాదారి ప్రయాణం చేద్దామా...!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • ఇది ఆర్బీఐ నోట్ల కొట్టం కాదు సుమండీ..! చేతి రుమాళ్ల విక్రయ కేంద్రం..!! (ఫోటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • ఉపాధి బోలెడు.. వసతులు మూరెడు..!! (ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • బ్యాంకుల తోటలో విరగ కాసిన ‘రైతు బంధు’ చెక్కులు.. ఒకేసారి ఎగబడితే తప్పవు తిప్పలు..!! (ఫోటో: అరుణ్‌ గౌడ్‌, కామారెడ్డి)

 • గర్జించిన ప్రతిపక్షం.. వంచనపై ప్రజా పోరాటం.. (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • తృటిలో తప్పిన ప్రమాదం.. మినీ వ్యాన్‌లో గ్యాస్‌ బండ పేలుడుతో కలకలం..! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • ఇది వింతైన బాల్య వివాహం..! చిన్న వయసులో బాలుడి గొంతు కోసే యత్నం..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • క్యూ కట్టిన రైతులు.. చెక్కుల విడుదలకై పడిగాపులు..! (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • ఈ దాహం తీరనిది..! చెక్కుల పంపిణీలో నీరసించిన నేతలు.. (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • తెట్టు పడాలంటే.. ఒడ్డు దాటాల్సిందే..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • అన్నా..! నిన్ను కాదే.. నువ్‌ పడుకో..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • ఎదురైన ప్రమాదం.. నేల కొరిగిన ఐకేపీ ధాన్యం..!! (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • సెల్ఫీ విత్‌ సెలబ్రిటీ..!! (ఫోటో: భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • గొడుగు నీడన మేముండగా..మాడు పగిలే ఎండైనా.. మాకేంటి..! (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • చేపలు పట్టుకొని చెప్తున్నాం..గంగపుత్రులకు అండగా నిలుస్తాం.. (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • నింగిలో నిప్పురవ్వ.. పిడుగుగా మారి ప్రాణాలు హరించదు కదా..!! (ఫోటో: ఎం. సతీష్‌కుమార్‌, పెద్దపల్లి)

 • సంసార నౌక ఇది..! సాగనీ ఊరురా..!! (ఫోటో: కె. సతీష్‌, సిద్దిపేట)

 • కారు మబ్బులు కమ్ముకున్నయ్‌.. కాయ కష్టాన్ని కల్లం దాటించు..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • భద్రకాళీ..! రుద్ర రూపం..! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

 • కొండల దారుల్లో.. చెట్టూ,చేమల్లో.. చెలిమె నీరు తాగుతున్న పవర్‌ స్టార్‌..!! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

 • స్పృశించి ధన్యం కండి..! పాపాలు బాపే బంగారు బల్లి ఇది..!! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

 • జగన్‌కు తోడుగా..భూమన కరుణాకర్‌ రెడ్డి పాదయాత్ర..! (ఫోటో: రఫి, తిరుపతి)

 • మండుటెండలో ఫ్రెండ్లీ ఫైట్‌..!! (ఫోటో: రఫి, తిరుపతి)

 • రాదారి ఎక్కిన రాధా గోపాలుడు.. శిరస్త్రాణం లేదు మరి జర జాగ్రత్త..!! (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)

 • అమ్మ ఆశిస్సులు అందరికీ అందుతాయండీ.. తోసుకుని ఆమె ఆగ్రహానికి గురికాకండి..!! (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)

 • పొద్దు గుంకింది.. నీరెంత దూరం.. నువ్‌ చేరే దారెంత దూరం..!! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • రంజాన్‌ షురూ హోగయా..! అల్లాహ్‌ దీవెనలు అందుకోండి..!! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • విదేశం కాదు.. బాంబు దాడి అసలే కాదు.. ప్లాస్టిక్‌ పరిశ్రమలో పేలుడుతో ఎగిసిన కాలుష్య వాయువు..!! (ఫోటో: మాధవ రెడ్డి, విజయవాడ)

 • ఓ వైపు పెట్టుబడికి సాయం.. మరోవైపు పకడ్బందీ పాసు పుస్తకాలు..అందుకే ఈ దరహాసాలు..!! (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • ఉయ్యాలలో పాపాయి.. హాయిగా నువ్‌ బజ్జోవోయి (ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • తెప్పలో పోదాం చలో చలో.. చేపలు పడాం చలో చలో.. (ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • జపాన్‌ ముద్దుగుమ్మ .. కుండలు చేస్తోందమ్మా .. (ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top