సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Sankranthi Special Trains - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే డీసీఎం ఎల్‌.అశోకరావు తెలిపారు.
కాచిగూడ–విశాఖపట్నం(07016)వీక్లీ స్పెషల్‌ రైలు కాచిగూడలో ప్రతీ మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు బుధవారం ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఫిబ్రవరి 27వ తేదీ వరకు నడుస్తుంది.

విశాఖపట్నం–తిరుపతి(07479) వీక్లీ స్పెషల్‌ రైలు విశాఖపట్నంలో ప్రతీ బుధవారం రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మరుసటి రోజు గురువారం ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈనెల 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నడుస్తుంది.

హైదరాబాద్‌–విశాఖపట్నం(07148)ప్రత్యేక రైలు ఈనెల 10,12 తేదీల్లో హైదరాబాద్‌లో సాయంత్రం 5.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07147)విశాఖపట్నంలో ఈనెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

చెన్నై సెంట్రల్‌–సాంత్రగచ్చి(06058) ప్రత్యేక చార్జీతో నడిచే ప్రత్యేక రైలు ప్రతీ బుధవారం చెన్నై సెంట్రల్‌లో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు గురువారం ఉదయం 5.10 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 5.30 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 7 గంటలకు సాంత్రగచ్చి చేరుకుంటుంది. ఈవిధంగా జనవరి 10వ తేదీ నుంచి మార్చి 28వ తేదీ వరకు ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో (06057) సాంత్రగచ్చిలో ప్రతీ గురువారం రాత్రి 11.50 గంటలకు బయల్దేరి శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడి నుంచి 2.45 గంటలకు బయల్దేరి శనివారం ఉదయం 5.30 గంటలకు చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ విధంగా జనవరి 11 నుంచి మార్చి 29 వరకు ప్రయాణిస్తుంది.

పుదుచ్చేరి–సాంత్రగచ్చి(06010) వీక్లీ స్పెషల్‌ రైలు ప్రతీ శనివారం పుదుచ్చేరిలో రాత్రి 7.15 గంటలకు బయల్దేరి శనివారం మధ్యాహ్నం 1.43 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. దువ్వాడ నుంచి 1.45 గంటలకు బయల్దేరి సోమవారం ఉదయం 4.30 గంటలకు సాంత్రగచ్చి చేరుకుంటుంది. జనవరి 6 నుంచి మార్చి 31 వరకు ఈ విధంగా నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(06009) సంత్రాగచ్చిలో ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 3.55 గంటలకు దువ్వాడ చేరుకుని, దువ్వాడ నుంచి 3.57 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.45గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది.

విశాఖపట్నం–కొల్లాం(08567)బై వీక్లీ విశాఖపట్నంలో ప్రతీ శని, బుధవారాలలో రాత్రి 11 గంటలకు బయల్దేరి కొల్లాం సోమ, శుక్రవారాల్లో తెల్లవారు(ఉదయం)3.45గంటలకు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలును జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు పొడిగించా రు. తిరుగు ప్రయాణంలో (08568)కొల్లాం లో ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉదయం 5.45గంటలకు బయల్దేరి మంగళ, గురువారాల్లో మధ్యాహ్నం 12.30గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈవిధంగా జనవ రి 12 నుంచి జనవరి 22 వరకు నడుస్తుంది.

తిరుపతి–విశాఖపట్నం(07487) వీక్లీ ఏసీ స్పెషల్‌ తిరుపతిలో ప్రతీ ఆదివారం రాత్రి 10.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 10.45గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 25వ తేదీ వరకు ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో (07488) విశాఖపట్నంలో ప్రతీ సోమవారం రాత్రి 7.20గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top