సకల రంగాల్లో బాబుది వైఫల్యమే!

సకల రంగాల్లో బాబుది వైఫల్యమే!


కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి అంబటి రాంబాబురాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రంగాల్లోనూ చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అంటున్నారు. పాలనలో కానీ, ప్రజలకిచ్చిన వాగ్దా నాలు నెరవేర్చడంలో కానీ, బాబు పూర్తిగా ఫెయిలయిపోయారని.. అవినీతి, కమీషన్లు పరా కాష్టకు చేరుకున్నాయని ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం పెరిగిందని చెప్పారు. ఏ ప్రభుత్వం పైనా లేనంతగా బాబు పాలనపై ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని, దీని పరిణామాలు వచ్చే ఎన్నికల్లో అధికార పక్షం చవిచూడక తప్పదంటున్నారు. ఇప్పుడు తమలపాకుతో కొడుతున్న ట్లుగా సుతిమెత్తగా విమర్శిస్తున్న పపన్‌ కల్యాణ్‌ సైతం కీలక సమయంలో బాబు అసమర్థత గురించి మాట్లాడకపోతే తన గౌరవం కూడా పోతుందని హెచ్చరిస్తున్న అంబటి రాంబాబు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.సోనియాగాంధీనే ఎదుర్కొనే శక్తి వైఎస్‌ జగన్‌కి ఎలా వస్తుందనుకున్నారు?

ప్రజాబలం. ఆ బలంతోటే సోనియాగాంధీని ఎదుర్కోగలిగారు కదా. ఉపఎన్నికల్లో గెలుపు అనేకాదు. సోనియాను ఎదుర్కొవడం వల్ల 16 మాసాలు జైలు కెళ్లి ఉండవచ్చు కానీ, రాజకీయంగా సోనియాగాంధీ ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయిందా లేదా? పదేళ్లపాటు ఉమ్మడి రాష్ట్లంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి వైఎస్‌ జగన్‌ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాలేదు కదా. 175 సీట్లలో ఆరో, ఏడో సీట్లలో తప్ప మిగతా అన్ని చోట్లా డిపాజిట్లు పోయాయి కదా?జగన్‌పైనే కాదు మీపైన కూడా సీబీఐ కేసు పెట్టింది కదా?

జగన్‌ తరఫున నిలబడ్డాను కాబట్టి నాపై కూడా కేసు పెట్టారు. ఇవేవీ నిరూపణ అయ్యే కేసులు కాదు. జగన్‌ మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగారు. సోనియా గాంధీని లెక్క చేయలేదు. అధిష్టానం మాట విన లేదు. కాబట్టి సీబీఐని ప్రయోగించారు. అందరికీ తెలిసిన విషయం ఇది. కోర్టులో ఎవరో సుమోటోగా లెటర్‌ రాసిస్తే సీబీఐ ఎంక్వయిరీ చేస్తుందా. ఇప్పుడు వెయ్యరే, అప్పుడెందుకు వేశారు? కాకపోతే జగన్‌పై కేసులనేవి పూర్తిగా అధిష్టానం మేనేజ్‌ చేసిన కేసులు. అధిష్టానం ఏ వ్యవస్థనైనా మేనేజ్‌ చేయగలదు అని చెప్పడానికి జగన్‌పై కేసులు తాజా ఉదాహరణ. జగన్‌ తన తండ్రి కేబినెట్లో మంత్రి కాదు. పైగా ఈ ప్రాంతం లోనే లేరు. బెంగళూరులో ఉన్నారు. వైఎస్సార్‌ చనిపోగానే జగన్‌ నేరస్తుడైపోయాడా కాంగ్రెస్‌ పార్టీ దృష్టిలో? వైఎస్‌ మరణించగానే జగన్‌ వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిపోయాడా? వైఎస్‌ మరణించిన తర్వాత అధిష్టానం చెప్పినట్లు జగన్‌ వినలేదు కాబట్టి అతడిని ఇబ్బంది పెడితే లైన్‌లోకి వస్తాడు అనుకున్నారు. ఇబ్బంది పెట్టినా వినలేదు. లైన్లోకి రాలేదు. జైలుకు వెళ్ళాడు. బయటికి వచ్చాడు, ప్రజల్లో తిరిగాడు. నా ఉద్దేశంలో జగన్‌ పట్లా, దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల కాంగ్రెస్‌ అధిష్టానం వ్యవహరించిన తీరును ప్రజలు ఈసడించుకున్నారు.సీబీఐ లక్ష్మీనారాయణనే విమర్శించారే?

అవి విమర్శలు కాదు. వాస్తవాలు. ఆరోజు కేంద్రప్రభుత్వం ఏవిధంగా ఆడిస్తే సీబీఐ ఆవిధంగా ఆడిందనడంలో సందేహం లేదు. జగన్‌ వ్యతిరేకులందరికీ లక్ష్మీనారా యణ చాలా హానెస్ట్‌గానే కనబడతాడు. తనకు సన్మానాలు కూడా చేసారు. దీంట్లో సందేహమేముంది. ఎవరో పిచ్చి శంకరరావో మరొకరో లెటర్‌ రాస్తే సీబీఐ ఎంక్వయి రీలు జరిగిపోతాయా? ఈ రాష్ట్రంలో మరే అన్యాయాలు జరగటం లేదా? ఈ రాష్ట్రంలో దోపిడీలు ఏవీ జరగటం లేదా? వాటిపై సీబీఐ ఎంక్వయిరీకి రాదే, కోర్టు పూనుకోదే.. అందుకే చెబుతున్నాను. ఇది ఒక ముందస్తు వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఆడించిన నాటకంలో ఇవన్నీ భాగమే. ఆ నాటకంలో జేడీ లక్ష్మినారాయణ కూడా ఒక భాగమే.ఉపఎన్నికల్లో బ్రహ్మండంగా గెలిచారు. కాని సాధారణ ఎన్నికల్లో ఎలా దెబ్బతిన్నారు?

చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన అమోఘమైన వాగ్దానాలు. తాను నెరవేర్చుతాడా నెర వేర్చడా అనేది ఆరోజు ఎవరూ ఆలోచించలేదు. రుణమాఫీ అన్నారు. డ్వాక్రా రుణ మాఫీ అన్నారు. నిరుద్యోగ భృతి అన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఏది కనబడితే అది చేసేస్తాను. మీరు నన్ను అధికారంలోకి తీసుకొచ్చేయండి చాలు అన్నాడు బాబు. సైకిల్‌ గుర్తుకు ఓటెయ్యడం, మీ బంగారం మీరు ఇంటికి తీసుకెళ్లిపోవడం. బ్యాంకులో డబ్బు కట్టేస్తాము, మీ నగలు మీ ఇంటికి తీసుకెళ్లచ్చు అనే రేంజిలో హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ కూడా ఇలాగే మాఫీపై హామీ ఇస్తే మన బంగారం మన ఇంటికి వచ్చింది. ఇప్పుడూ అలాగే ఇంటికొస్తుంది అని నమ్మి భర్తకు కూడా చెప్పకుండా టీడీపీకి ఓటేసిన మహిళలు చాలామంది ఉన్నారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పి వాడుకోగలిగారు. మేం అబద్ధాలు చెప్పడానికి సందేహించాం. ముక్కుసూటిగా వెళ్లాం. దెబ్బతిన్నాం.ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు?

ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. మధ్యలోనే ఉన్నాం కాబట్టి చాలా ముందే చెప్పినట్లవుతుందేమో కానీ, ఇప్పుడున్న పరిణామాల బట్టి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. పాలనలో కానీ, ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, పూర్తిగా ఫెయిలయిపోయారు. అవినీతి పరాకాష్టకు చేరుకుంది. కమీషన్లు పెరి   గాయి. ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడం పెరిగింది. శాసనసభ్యులనుంచి, మంత్రుల నుంచి, లోకేష్‌ బాబు దగ్గరనుంచి బాబు వరకు అంతా దోచుకోవడమే జరుగుతోంది.కాపు సామాజిక వర్గం చంద్రబాబు పట్ల ఇప్పుడెలా ఉంటోంది?

 బాబు అంటేనే కాపులు భగ్గుమంటున్నారు. ఆరునెలల్లో కాపులను బీసీల్లో చేరుస్తా నన్నాడు. కమిషన్‌ వేస్తానన్నాడు. సంవత్సరానికి వెయ్యికోట్లు చొప్పున అయి దేళ్లలో 5 వేల కోట్లు కాపులకు కేటాయిస్తానన్నాడు. ఎంత ఇచ్చాడో లెక్క లేదు. మూడేళ్లు కావస్తోంది. కనీసం 3 వేల కోట్లు అయినా ఇవ్వాలి కదా. దీన్నే ఎత్తి చూపుతూ ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తే అప్రజాస్వామికంగా ఆయన్ని అణిచివేశారు. చంద్రబాబు చర్య నీచాతి నీచమైన ప్రయత్నం. నిరాహారదీక్ష చేస్తున్న ఉద్యమకారుడిని కుటుం బంతో సహా తీసుకెళ్లి ఆసుపత్రిలో పెట్టి పేపర్‌ లేకుండా చేసి సౌక ర్యాలు లేకుండా నిర్బంధించి, బెదిరించడం కాపులు మర్చిపోరు.పవన్‌ పల్లెత్తు మాట అనలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన ప్రభావం ఉంటుందా?

కాపు సామాజిక వర్గాన్ని పవన్‌ ఓన్‌ చేసుకోవడంలేదు. అలాగే కాపులు ఇప్పుడు పవన్‌ని భుజాన వేసుకుంటారు అని కూడా నేననుకోవడం లేదు. వాస్తవమేదంటే పవన్‌ మాట విని కాపులు చంద్రబాబును భుజాన వేసు కున్నారు. పవన్‌ తాను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అని ముందుకొస్తే కాపులు ఆయన్న భుజాన వేసుకుంటారేమో కాని చంద్రబాబును ముఖ్యమంత్రి కావా లనుకుంటున్నానని అని వస్తే కాపులు పవన్ని భుజాన వేసుకోవడం అసాధ్యమే అనుకుంటాను. చంద్రబాబుకు ఉపయోగపడటానికి కాపులు ఈసారి సిద్దంగా లేదు. పవన్‌ కల్యాణ్‌ బాబు పక్షం వహించినా సరే కాపులు అందుకు సిద్ధంగా లేరు. ఎందు కంటే కాపులను కనీవినీ ఎరుగని వేధిపులకు గురిచేస్తున్నారు.జనసేన ఎన్నికల బరిలోకి వస్తే ఈసారి ఏపీలో పరిస్థితి ఎలా ఉంటుందంటారు?

జనసేన పోయినసారి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడంలో దోహద పడి ందని నమ్ముతున్నాను. చంద్రబాబు అలా నమ్ముతున్నాడో లేదో తెలీదు. ఈ మధ్య చింతమనేని ప్రభాకర్‌ నేరుగా అనేస్తున్నాడు. పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని గెలిపించడం ఏమిటి? వాళ్ల అన్ననే గెలిపించు కోలేనివాడు మమ్మల్ని గెలిపిస్తాడా అంటూ హేళనగా మాట్లాడాడు. చంద్రబాబు పవన్‌ వల్ల లబ్ధిపొందాడో లేదో ఆయనకు తెలుసు. కానీ వాళ్ల నాయకులు మాత్రం పవన్‌ మమ్మల్ని ఏంది గెలిపించేది అని ఎద్దేవా చేస్తుండటం మాత్రం నిజం. నా దృష్టిలో పోయినసారి పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు గెలుపుకు చాలా కీలకంగా ఉపయోగపడ్డారు. ఈసారి ఆయన దూరం జరిగితే చంద్రబాబుకు తప్ప కుండా నష్టం జరుగుతుందనేదే నా అభిప్రాయం.పవన్‌ ఇప్పుడు బీజేపీని ఘాటుగా విమర్శిస్తూ  చంద్రబాబును వదిలేస్తున్నట్లుంది కదా?

చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ తమలపాకుతో కొడుతున్నట్లుగా కనిపిస్తోంది. మీరు మీ సామాజిక వర్గానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అవినీతి పెరుగుతోందని, కమీ షన్లు తీసుకుంటున్నారని జనం అంటున్నారు అలోచించండి అని పవన్‌ చెబుతున్నారు. పాత మిత్రులు కాబట్టి జాగ్రత్తగా, మర్యాదగా చెబుతున్నారు మరి. అయితే ఏపీలో క్షేత్రస్థాయిలో ఇవ్వాళ జరుగుతున్న అవినీతి, అక్రమాలు పవన్‌ కల్యాణ్‌కి తెలియదని నేననుకోను. ఆయన సరైన సమయంలో మాట్లాడాతారని అనుకుంటున్నా. ఇప్పుడంటే మిత్రుత్వం ఉంది కాబట్టి గట్టిగా మాట్లాడకపోవచ్చు కానీ కీలక సమయంలో నిక్క చ్చిగా మాట్లాడకపోతే పవన్‌ని గౌరవించేవారు కూడా ఉండరు.చంద్రబాబునాయుడు అంటేనే ప్రస్తుతం కాపులు భగ్గుమంటున్నారు. కాపు లకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చవేం అని ఎత్తి చూపుతూ ముద్రగడ పద్మ నాభం ఉద్యమం చేస్తే అప్రజాస్వామికంగా ఆయన్ని అణచివేశారు. నిరా హార దీక్ష చేస్తున్న ఒక ఉద్యమకారుడిని కుటుంబంతో సహా తీసుకెళ్లి ఆసు పత్రిలో ఉంచి.. పేపర్‌తో పాటు కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి నిర్బంధించిన  ఆనాటి ఘాతుక చర్యను కాపులు ఎన్నటికీ మర్చిపోరు.(అంబటి రాంబాబుతో ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి)

https://goo.gl/sF5heU

https://goo.gl/ipJ7rK


 

Back to Top