ప్రాణాలు తీసిన ఇసుక దందా


 ఏర్పేడు: చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పేడు వచ్చారు. అదే సమయంలో అటువైపుగా  లారీ భారీ వేగంతో నిరసన కారుల వైపు దూసుకొచ్చింది.  లారీ ఢీకొనడంతో మొత్తం 20మంది చనిపోగా, మరికొంతమందికి గాయాలయ్యాయి.శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి ఈ మేరకు తీర్మానించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది అసువులు బాసిన విషయం విదితమే. నిరసన వ్యక్తం చేయడానికి ఏర్పేడుకు వచ్చిన మృతుల బంధువలు.  వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి  క్షతగాత్రుకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. ఈ ప్రమాదంపై వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి  తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆ సమయంలో లారీ డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడని తెలిసింది. పోలీసులు వెంటనే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.​

Back to Top