చర్మానికి 'ఎల్ ఈ డీ' కాంతులు

చర్మానికి 'ఎల్ ఈ డీ' కాంతులు


మిల మిల మెరిసే చర్మ సౌందర్యం కోసం అనేక సౌందర్య సాధనాలను వాడతారు. స్కిన్ గ్లో తెచ్చిపెట్టే మసాజ్ లు, మేకప్ లు వేయించుకుంటారు. కానీ ఆ జర్మనీ కుర్రాళ్ళు అలా చేయలేదు. కాంతులీనే చర్మానికి ఏకంగా ల ఎల్ ఈ డీ లైట్లనే వాడకంలోకి తెచ్చేశారు. రిస్ట్ వాచ్ పెట్టుకున్నట్లుగా ఏకంగా ఎల్ ఈ డీ  లైట్లను చేతికి ఇంప్లాంట్ చేయించేశారు. ఓ పెద్ద కాయిన్ సైజులో ఉండే చిప్ ను చర్మంలో ఇమిడ్చేశారు. మిరుమిట్లు గొలిపే కాంతులు... చర్మం నుంచి బయటకు వెదజల్లేలా ప్రోటోటైప్ పరికరాన్ని డిజైన్ చేశారు.  



జర్మనీకి చెందిన బయోహ్యాకర్స్ బృందం... నార్త్ స్టార్ వీ1 చిప్ తో ఎల్ ఈ డీ లైట్లను చర్మంకింద అమర్చుకున్నారు. ఒక్కొక్కరి చేతికి వాచ్ పెట్టినట్లుగా అరచేయి పై భాగంలో చిప్ ను అందంగా అమర్చారు. రింగ్ ఆకారానికి జెల్లీ ఫిష్ లా డిజైన్ చేసిన ఎల్ ఈ డీ లైట్లు చర్మం కిందినుంచీ పచ్చ బొట్టు పొడిచినట్లుగా ఏర్పాటు చేశారు. పిట్స్ బర్గ్ లోని గ్రిండ్ హౌస్ వెట్ వేర్... ఎటువంటి సమస్యలు రాకుండా ఉండే ఓ  సురక్షితమైన టెక్నాలజీని వినియోగించి పదిహేను నిమిషాల శస్త్ర చికిత్సతో ఇలా రూపొందిస్తున్నారు. దీన్ని వారంతపు రోజుల్లో జర్మనీలో నిర్వహించే సైబోర్గ్ ఫెయిర్ లో స్వీడిష్ పచ్చబొట్టు కళాకారుడు జోవాన్ ఆస్టెర్లండ్ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ బృందం ఇటువంటి ప్రత్యేక పరికరాన్ని తయారు చేయడానికి కారణం బయోహ్యాకింగ్ టీమ్ లోని వ్యక్తులు కోరుకోవడమేనని చెప్తున్నారు. వారి టాటూలు కాంతివంతంగా వెలిగిపోవాలంటే ఇలా ఇంప్లాంట్ చేయమంటూ తమను సంప్రదించారని బృందంలోని సభ్యుడొకరు చెప్తున్నారు.



తాజాగా తయారుచేసిన పరికరంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ కు గుండ్రని ఆకారంలో ఐదు ఎల్ ఈ డీ లైట్లను బిగించి, అయస్కాంత సెన్సార్ వాటి దగ్గరకు వచ్చినపుడు అవి పది సెకన్లపాటు వెలిగేలా అమర్చారు. ఈ పరికరం సిలికాన్ కవర్ కలిగి, మూడు వోల్ట్ ల బ్యాటరీతో పనిచేస్తుంటుంది. కనీసం పదివేలసార్లు లైట్లు వెలిగేందుకు ఈ బ్యాటరీ శక్తి సరిపోతుంది. ఈ ఇంప్లాంట్స్  వచ్చే ఏడాది మర్కెట్లోకి రావచ్చునని భావిస్తున్నారు. బ్లూ టూత్ కనెక్టివిటీ తో ఉన్న నార్గ్ స్టార్ వెర్షన్ 2 తో ప్రస్తుత ఈ ట్రయల్ పరికరం నడుస్తోంది. ముందు ముందు ఈ వైర్ లెస్ పరికరం లోని  రిసీవర్స్ చేతి కదలికలను బట్టి.. టీవీ వంటి వాటిని నియంత్రించే గాడ్జెట్ లా కూడ పనిచేసే అవకాశం ఉండొచ్చునని చెప్తున్నారు.   


Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top