ఉబర్ డ్రైవర్ ఆగడం

ఉబర్ డ్రైవర్ ఆగడం - Sakshi


న్యూఢిల్లీ: ఉబర్ క్యాబ్ డ్రైవర్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. గుర్గావ్ కు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని పట్ల ఉబర్ డ్రైవర్ ఒకడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వినోద్ అనే డ్రైవర్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని బాధితురాలు రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్నేహితురాలు ఇంటికి వెళ్లేందుకు శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆమె ఉబర్ క్యాబ్ ఎక్కింది. కారు దిగిన తర్వాత వినోద్ బలవంతంగా ముద్దు పెట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి పారిపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.  గుర్గావ్ సన్ సిటీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.


బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం ఎట్టకేలకు నిదితుడ్ని అరెస్టు చేశారు.  అయితే ఈ ఘటనపై ఉబర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. ఉబర్ కు బాధితురాలి సోదరుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇది కేవలం ఆరోపణ మాత్రమేనని, వాస్తవం ఇంకా నిరూపణ కాలేదంటూ సమాధానమిచ్చింది. ఆరు నెలల క్రితం ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పై ఉబర్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం రేపడంతో ఢిల్లీలో ఈ క్యాబ్ సంస్థపై నిషేధం విధించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top