మ్యూజియంపై దాడి: అనుమానితులు అరెస్ట్

మ్యూజియంపై దాడి: అనుమానితులు అరెస్ట్


ట్యూనిస్: ట్యూనిసియా రాజధాని ట్యూనిస్లోని బర్దో మ్యూజియంపై దాడి కేసులో 21 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు ఆ దేశ అంతర్గత వ్యవహరాల శాఖ మంత్రి గురువారం వెల్లడించారు. అనుమానితులను విచారిస్తున్నామని తెలిపారు. ఉత్తర ఆఫ్రికా దేశమైన ట్యూనిసియా రాజధాని ట్యూనిస్లో ప్రఖ్యాత బర్దో  మ్యూజియంలోకి గత నెల 18న ఉగ్రవాదులు చోరబడి ... సందర్శకులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.


ఈ దాడిలో 23 మంది మృతి చెందగా... వారిలో 20 మంది విదేశీ పర్యాటకులు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఘటనపై సమాచారం అందుకున్న భద్రత సిబ్బంది వెంటనే మ్యూజియంలోకి ప్రవేశించి తీవ్రవాదులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద గ్రూప్ ప్రకటించిన విషయం విదితమే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top