టుడే న్యూస్‌ రౌండప్‌






<<<<<<<<<<<<<<<< రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>

పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్‌ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు.

 

కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలేని శాఖలను మూసేస్తామని, వాటి స్థానంలో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తామని అన్నారు.



ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రముఖ దర్శకుడు రాజమౌళి బుధవారం ఉదయం భేటీ అయ్యారు.


 

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త వేముల శ్రీనివాస్ హత్యకు స్థానిక టీఆర్ఎస్ నేతలే కారణమని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. 

 

<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>

మినీ మోదీగా ప్రసిద్ధి చెందిన యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆర్నెళ్లు అవుతోంది.

 

పారిస్‌ ఒప్పందానికి తమ దేశం కట్టుబడి ఉందని.. భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ స్పష్టం చేశారు. గ్రీన్‌ హౌస్‌ ఉద్గారాల తగ్గింపు విషయంలో పరిమితులకు లోబడి.. పనిచేస్తామని ఆమె చెప్పారు. 

 

అత్యాచారం కేసులో డేరా బాబా గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన హింసాకాండలో పాల్గొన్న పదిమంది ఫొటోలను హరియాణా పోలీసులు విడుదల చేశారు.

 

<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>

మీరు 'మేడం గిసెల్లె యాజ్జి'ని కలిస్తే మాత్రం ఔరా అంటారు. ఆమె ఒక దేశాధ్యక్షుడికి రహస్య భార్య.

 

<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>

‘ఆత్మను అస్త్రములు, శస్త్రములు చేధింపజాలవు, నీరు తడుపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయు సామర్థనీయముకాదు’ అంటూ ఆత్మలక్షణాలను చెబుతూ రాజుగారి గది 2 ట్రైలర్‌ వచ్చేసింది.

 

నవరాత్రి సందర్భంగా గుజరాత్‌లో బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌తో ఏర్పాటుచేయించిన కండోమ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటన హోర్డింగ్‌ వివాదాన్ని తీసుకొచ్చింది.

 

<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>

పాకిస్థాన్‌ బ్యాట్స్‌మన్‌ ఖలీద్‌ లతీఫ్‌పై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఐదేళ్లపాటు నిషేధం విధించింది.

 

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని పేరును ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారానికి బీసీసీఐ సిఫారసు చేసింది.

 

<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>

దిగ్గజ భారతీయ వ్యాపార వేత్తలకు ఫోర్బ్స్‌ మేగజైన్‌ మరో కితాబునిచ్చింది. ఫోర్బ్స్‌ మేగజైన్‌ తాజాగా హండ్రెడ్‌ గ్రేటెస్ట్‌ లివింగ్‌ బిజినెస్‌ మైండ్స్‌ పేరుతో ఒక జాబితాను రూపొందించింది.

 

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  ఫెడ్‌  రిజర్వ్‌ భేటీ నేపథ్యంలో వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిశాయి.

 

అంతర్జాతీయ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌లో కూడా పండుగ సీజన్‌ ప్రారంభమైంది. నేటి నుంచి గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌ను ప్రారంభించింది.

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top