బాలికపై అత్యాచారం చేసిన 15 ఏళ్ల బాలుడి అరెస్టు
ఠాణే: ఏడేళ్ల బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతినగర్ మురికివాడ ప్రాంతంలోని నల్లసోపరాలో 15 ఏళ్ల బాలుడు నవంబర్ 22న అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్టు చేశారు. నిందితుడిపై భారత శిక్షా స్మృతితోపాటు లైంగిక దాడుల నుంచి బాలల రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చగా భివండీలోని రిమాండ్ హోమ్‌కు తరలించాల్సిందిగా ఆదేశించారు.