దుప్పిని ఢీ కొట్టిన విమానం..

దుప్పిని ఢీ కొట్టిన విమానం..


నార్త్‌ కరోలినా(అమెరికా):

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అమెరికన్‌ ఈగల్‌ విమానం 5320 చార్లొట్టే డగ్లస్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మిస్సిసిపీలోని గల్ఫ్‌పోర్ట్కి బయలు దేరింది. టేక్‌ ఆఫ్‌ అయ్యే సమయంలో రన్‌వే పై దుప్పి అడ్డుగా వచ్చింది. దాన్ని విమానం ఢీకొట్టడంతో ఇంధనం లీక్‌ అవ్వడం ప్రారంభమైంది. దీన్ని గుర్తించిన పైలెట్‌, కంట్రోల్‌ రూంకు సమాచారాన్ని అందించి విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. విమానం ఇంధనం పెద్ద మొత్తంలో లీక్‌ అవ్వడంతో పేలుడు సంభవించకుండా ఫైర్‌ సిబ్బంది ముందుగానే రన్‌పైకి చేరుకొంది.విమానం ల్యాండింగ్ పూర్తవ్వగానే వెంటనే సిబ్బంది భారీ మొత్తంలో ఫోమ్‌ను విమానంపైకి స్ప్రే చేశారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్టయింది. విమానంలో నలుగురు సిబ్బంది, 44 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరిని సురక్షితంగా రక్షించగలిగారు.

అయితే భారీ పరిమాణంలో ఉండే జంతువులు రన్‌వేపైకి రావడం చాలా అరుదైన విషయమని చార్లొట్టే డగ్లస్‌ విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. వేలాది ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టు మొత్తం ఫెన్సింగ్‌తో చుట్టి ఉన్నా దుప్పి రన్‌వేపైకి ఎలా వచ్చిందనే విషయంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

 

Back to Top