‘కాబోయే రాష్ట్రపతి’ నివాసంలో కోలాహలం

‘కాబోయే రాష్ట్రపతి’  నివాసంలో కోలాహలం


- పట్నాలోని రాజ్‌భవన్‌కు పోటెత్తిన జనం

- కేరితల నడుమ అభివాదం చేస్తూ హస్తినకు పయనమైన రామ్‌నాథ్‌
పట్నా:
ప్రస్తుత బిహార్‌ గవర్నర్‌ రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించన తర్వాత పట్నాలో సీన్‌ పూర్తిగా మారిపోయింది. గవర్నర్‌ అధికారిక నివాసం రాజ్‌భవన్‌కు గతంలో ఎన్నడూ లేనంతలా ప్రజలు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడంతా కోలాహలంలా మారింది. ‘కాబోయే రాష్ట్రపతి’ అని కోవింద్‌ను సంబోధిస్తూ కొందరు నినాదాలతో సందడి చేశారు.బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సైతం సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వచ్చి గవర్నర్‌ కోవింద్‌ను కలుసుకుని, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. నితీశ్‌తో భేటీ అనంతరం సాయంత్రం సుమారు 6:10 గంటలకు గవర్నర్‌ రామ్‌నాథ్‌ ఢిల్లీకి పయనం అయ్యారు. రాజ్‌భవన్‌ బయట నిలబడిన ప్రజలకు చిరునవ్వుతో అభివాదం తెలుపుతూ ఆయన కారు ఎక్కారు. నేటి రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో రామ్‌నాథ్‌ భేటీకానున్నట్లు సమాచారం.

Back to Top