ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!

ఇకపై పెట్రోల్ డోర్ డెలివరీ..!


న్యూఢిల్లీ:   మే 14నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్‌  పంపుల మూత నిర్ణయానికి చెక్‌ చెప్పిన చమురు మంత్రిత్వ శాఖ మరో సంచలన నిర్ణయం  తీసుకోనుంది.   ఇకపై వినియోగదారులవద్దకే నేరుగా పెట్రోల్‌ డెలివరీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. వినియోగదారులు ప్రీ-బుకింగ్ చేస్తే హోం డెలివరీ  చేస్తమాని, ఇంధన స్టేషన్లలో సుదీర్ఘ క్యూలను తగ్గించటానికి ఇదిసహాయపడుతుందని ట్వీట్‌ చేసింది.

పెట్రోల్‌ స్టేషన్ల వద్ద సుదీర్ఘ క్యూలను నిరోధించే  క్రమంలో  ఇంటికే పెట్రోల్‌ను పంపించే యోచనలో ఉంది.  ఈ మేరకు  శుక్రవారం చమురు మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.  ముందస్తు బుకింగ్ చేసినట్లయితే పెట్రోలియం ఉత్పత్తులను  వినియోగదారులకు నేరుగా ఇంటికే  ప్రభుత్వం సరఫరా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వరుస ట్వీట్లలో ప్రకటించింది.  పెద్ద క్యూలలో  వేచి వుండడం వల్ల   వృధా అవుతున్న వినియోగదారులు  సమయం ఆదా అవుతుందని భావించింది. 

Back to Top