నేను పన్ను ఎగొట్టలేదు: సానియా మిర్జా

నేను పన్ను ఎగొట్టలేదు: సానియా మిర్జా

సేవా పన్ను కట్టకుండా ఎగవేశారంటూ తనపై వచ్చిన ఆరోపణలను తెలంగాణ బ్రాండు అంబాసిడర్, టెన్నిస్ క్వీన్ సానియా మిర్జా ఖండించారు. తాను సర్వీసు పన్నును ఎగొట్టలేదని సానియా మిర్జా స్పష్టంచేశారు. సర్వీసు ట్యాక్స్ సక్రమంగా చెల్లించనందుకు విచారణ కోసం సానియా లేదా ఆమె చార్టెడ్ అకౌంటెండ్ కాని తమ ముందు హాజరుకావాలని సర్వీసు ట్యాక్స్ శాఖ అధికారులు సమన్లు జారీచేశారు. ఈ విషయంపై స్పందించిన సానియా మిర్జా తను పన్నును సక్రమంగానే చెల్లించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయలు, ట్రైనింగ్ ప్రోత్సహకం కింద ఇచ్చినట్టు ఆమె తెలిపారు.

 

దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సానియా ప్రతినిధి అదికారులకు సమర్పించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వమిచ్చిన కోటి రూపాయల ట్రైనింగ్ ప్రోత్సహకంగానే సానియా మిర్జా అందుకున్నారని, రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ గా తాను అవి తీసుకోలేదని అధికార వర్గాలూ పేర్కొంటున్నాయి. 2014 జూలైలో తెలంగాణ ప్రభుత్వం సానియాను బ్రాండు అంబాసిడర్ గా నియమించి, మేజర్ టోర్నమెంట్ల ప్రిపరేషన్ కోసం కోటి రూపాయలను అందించింది. ప్రస్తుతం సానియా మిర్జా ప్రతినిధి సమర్పించిన డాక్యుమెంట్లపై సర్వీసు ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు పరిశీలిస్తున్నారు. 
Back to Top