కేంద్ర మంత్రి ట్విటర్ ఎకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: కేంద్ర కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికార ట్విటర్ ఎకౌంట్ గురువారం హ్యాకింగ్ కు గురైంది. ఒక ఉత్పత్తి ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని పోస్టు చేశారు. ఆమె ట్విటర్ ఖాతాలో @CimGOI టాగ్ తో పదే పదే అవాంఛిత సమాచారం పోస్టుకావడంతో హ్యాకింగ్ కు గురైనట్టు గుర్తించారు. దీని గురించి నిర్మలా సీతారామన్ ను ఆమె ఫాలోవర్లు అప్రమత్తం చేశారు.
దీంతో తన ఎకౌంట్ హ్యాకింగ్ కు గురైనట్టు ఆమె తెలుసుకున్నారు. తనను అప్రమత్తం చేసినందుకు ఫాలోవర్లకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన అధికారిక ట్విటర్ ఖాతాలో అవాంఛిత సమాచారం ఎవరు పోస్ట్ చేశారనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె తెలిపారు.