ఆన్ లైన్ మోస్ట్ సెర్చ్ డ్ నేతగా నరేంద్ర మోడీ!

ఆన్ లైన్ మోస్ట్ సెర్చ్ డ్ నేతగా నరేంద్ర మోడీ! - Sakshi


న్యూఢిల్లీ: గూగుల్ సెర్చింజన్‌లో ఈ ఫిబ్రవరి నెలలో ఎక్కువ మంది అన్వేషించిన రాజకీయ నాయకుల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలవగా.. ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు ఆ తర్వాత స్థానాల్లో నిలిచారని గురువారం గూగుల్ కంపెనీ వెల్లడించింది. నెటిజన్లు టైప్ చేసే పదాలను బట్టి గూగుల్ ట్రెండ్స్ నమోదుచేసిన రికార్డుల ప్రకారం... ఫిబ్రవరి నెలలో ఇప్పటిదాకా 0-100 పాయింట్లకుగాను మోడీకి 65 పాయింట్లు, కేజ్రీవాల్‌కు 52 పాయింట్లు, రాహుల్‌కు 41 పాయింట్లు వచ్చినట్లు గూగుల్ తెలిపింది. జనవరి నెలలో గూగుల్‌లో ఎక్కువ మంది కేజ్రీవాల్(72 పాయింట్లు) కోసం అన్వేషించగా.. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్ (64 పాయింట్లు), మోడీ (56 పాయింట్లు) ఉండటం గమనార్హం.


 


అలాగే దేశంలోని యువ నాయకుల్లో రాహుల్ కోసం ఎక్కువ మంది అన్వేషించగా.. ఆ తర్వాత టాప్ టెన్ స్థానాల్లో యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, ప్రియాంకా వాద్రా, సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా, నవీన్ జిందాల్, సుప్రియా సూలే, ప్రియా దత్, మిలింద్ దేవ్‌రా, దుష్యంత్ సింగ్ ఉన్నారు. గత మూడునెలల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బీజేపీ నేత అద్వానీ, ఎస్పీ చీఫ్ ములాయం సింగ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ల కోసం కూడా ఎక్కువ మంది అన్వేషించారు.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top