ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..

ముఖ్యమంత్రి అభ్యర్థి గద్దర్‌..


హైదరాబాద్‌ : ప్రజాగాయకుడు గద్దర్‌ అలియాస్‌ గుమ్మడి విఠల్‌రావును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించనున్నట్లు ‘మన తెలంగాణ’ పార్టీ అధ్యక్షుడు కె. వీరారెడ్డి తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేయనుందని స్పష్టం చేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మేధోమధన కార్యక్రమ కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు.‘‘మా తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29వ తేదీన మేధోమధన కార్యక్రమం నిర్వహిస్తుస్తున్నాం. ఆ సమావేశంలోనే సీఎం అభ్యర్థిగా గద్దర్‌ పేరును ప్రకటిస్తాం. ప్రజలకు సామాజిక న్యాయం, మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు, కార్మికులు, కర్షకులకు భీమా సౌకర్యం, నిరుపేదల ఇండ్లకు ఉచిత విద్యుత్తు, తాగు, సాగు నీరు, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తదితర ప్రధానాంశాలే ఎజెండాగా మన తెలంగాణ పార్టీ ముందుకు వస్తుంది’’ అని వీరారెడ్డి పేర్కొన్నారు.

Back to Top