భారత క్రికెటర్‌ తండ్రిపై కత్తితో దాడి!

భారత క్రికెటర్‌ తండ్రిపై కత్తితో దాడి!


రోహ్‌తక్‌: క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది. ఇద్దరు దుండుగులు ఆయనను కత్తితో పొడిచి.. దోపిడీకి పాల్పడ్డారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం రాత్రి68 ఏళ్ల ఓం ప్రకాశ్‌ రోహతక్‌ కాథ్‌మండి సమీపంలో తన కిరాణ దుకాణాన్ని మూసేస్తూ ఉండగా ఇద్దరు యువకులు దుకాణానికి వచ్చారు. కూల్‌డ్రింక్స్‌, సిగరెట్లు తీసుకొని వెళ్లిపోయినట్టే వెళ్లిపోయి.. తిరిగి  వచ్చి ఓంప్రకాశ్‌పై దాడి చేశారు.'వాళ్లు మొదట నా జేబులో నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. నేను వారిని అడ్డుకోవడంతో కత్తితో కడుపులో పొడిచారు. వారు దుకాణంలోని డబ్బునంతా తీసుకొని వెళ్లారు. రూ. 7వేల వరకు పట్టుకొని పోయారు' అని ఓంప్రకాశ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దుండగులు గాయపడిన శర్మను దుకాణంలోనే ఉంచి.. బయటనుంచి మూసేసి వెళ్లిపోయారు. అనంతరం స్థానికులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 2007 టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో అద్భుతంగా చివరి ఓవర్‌ వేసి.. భారత్ జట్టుకు బౌలర్‌ జోగిందర్‌ శర్మ విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.

Back to Top