ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం

ఇక హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం


ఛండీగఢ్‌: ఇక హైవేలపై ఉండే దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లలోనూ మద్యం అందుబాటులో రానుంది. ఆయా ప్రదేశాల్లో లిక్కర్‌ అమ్మకాలకు అనుమతినిస్తూ పంజాబ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టసవరణ చేసింది. సోమవారం ఛండీగఢ్‌లో నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో పంజాబ్‌ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది.కొద్ది నెలల కిందటే సుప్రీం కోర్టు.. జాతీయ రహదారులు, ఇతర హైవేలపై మద్యం అమ్మకాలను నిషేధించిన సంగతి తెలిసిందే. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా పంజాబ్‌ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏమరకు అమలవుతుందో వేచిచూడాలి.రైతుల రుణాలు మాఫీ

ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన రైతులకు హామీ ఇచ్చిన విధంగా పంజాబ్‌ సర్కార్‌ రుణమాఫీ ప్రకటించింది. రాష్ట్రంలోని 8.75 లక్షల మంది చిన్నకారు, మధ్యతరహా రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్లు సీఎం అమరీందర్‌సింగ్‌ కేబినెట్‌ భేటీలో ప్రకటించారు.

Back to Top