యువతి డెత్ మిస్టరీ.. పరువు హత్యా?

యువతి డెత్ మిస్టరీ.. పరువు హత్యా?


ఛండీగఢ్‌: పంజాబ్ లోని టరన్‌ తరన్‌ ప్రాంతంలో 17 ఏళ్ల యువతి మృతి కేసు పోలీసులకు పెద్దతలనొప్పిగా మారింది. 9 రోజులు గడుస్తున్నా ఇంకా ఏం తేల్చలేకపోతున్నారు. మరోపక్క ఇది పరువు హత్య అయి ఉంటుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం ఆ యువతికి ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉండటమే.వీరమ్‌ గ్రామానికి చెందిన ఆ యువతి తన ఇంట్లో 23 ఏళ్ల గుర్‌సాహిబ్‌తో అభ్యంతరకర స్థితిలో తండ్రి కంటపడింది. ఆగ్రహించిన ఆయన అతనిపై దాడి చేయగా పారిపోయాడు. ఆ ఘటన జరిగిన మరుసటి రోజే యువతి కనిపించకుండా పోయింది. దీంతో తండ్రి ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.అయితే రెండు రోజులకే ఊరి చివర ఉన్న కొలనులో యువతి శవమై తేలింది. అనుమానాస్పద మృతి కింద కేసు విచారణ ప్రారంభించిన పోలీసులకు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నట్లు డీఎస్పీ ఎస్‌ఎస్‌ మన్న్‌ తెలిపారు.

Back to Top