రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి

రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి


భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా బర్గి గ్రామంలో రేషన్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.గ్రామస్తులకు రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. రేషన్‌ దుకాణంలో కిరోసిన్‌ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Back to Top