దుబాయ్ ఎన్నారైలు భారత్ గౌరవం నిలబెట్టారు

దుబాయ్ ఎన్నారైలు భారత్ గౌరవం నిలబెట్టారు - Sakshi


దుబాయ్: రెండు రోజుల పర్యటనలో భాగంగా యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ )లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. మోదీ ప్రసంగాన్ని వినేందుకు 70 వేల మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.  దుబాయ్ లోని క్రికెట్ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది.  దుబాయ్ క్రికెట్ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ భారత్ మాతాజీకి జై అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. భారత్లోని అన్ని ప్రాంతీయ భాషల్లో మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.  ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. దుబాయ్లో మినీ ఇండియాను చూసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. దుబాయ్లో ఎన్నారైలు భారత్ గౌరవాన్ని ఇనుమడింప చేశారని ప్రశంసించారు. ప్రపంచంలో అందరినీ దుబాయ్ ఆకర్షిస్తోందని చెప్పారు.


మోదీ ప్రసంగంలోని కీలక అంశాలు



► భారత్ నుంచి దుబాయ్కు 700 కు పైగా విమానాలు వస్తున్నాయి

► భారత్ నుంచి దుబాయ్కు 700 కు పైగా విమానాలు వస్తున్నాయి

►భారత ప్రధాని మోదీ దుబాయ్కు రావడానికి 34 ఏళ్లు పట్టింది

► ఈ నిర్ణయం చాలా గొప్పది

► నాకు స్వాగతం పలకడానికి యువరాజు, ఐదుగురు సోదరులతో కలిసి వచ్చారు

► ఇంత ఆలస్యంగా వచ్చిన దుబాయ్ అందరూ నన్ను ప్రేమగా ఆహ్వానించారు

► భారత్లో కొన్నిప్రాంతాలు దుబాయ్లా ఉన్నాయి

► భారత్లోని అన్నిప్రాంతాల వారు దుబాయ్లో ఉన్నారు

► గల్ఫ్లోని అత్యధిక కార్మికులు భారతీయులే

► దుబాయ్లో ఎన్నారైలు భారత్ గౌరవాన్ని ఇనుమడింప చేశారు

► దుబాయ్లో మినీభారత్ను చూస్తున్నా

► నా పర్యటనతో రెండు దేశాల మధ్య విశ్వాసం పెరిగింది

► భారత్లో వర్షం పడితే దుబాయ్లో ఉన్నవారిలో హృదయం ఉప్పొంగుతోంది

ఈ గౌరవం నా ఒక్కరికే కాదు.. యావద్ భారతీయులందరికి దక్కుతుంది

► ఇండియాలో ఏం జరిగినా దుబాయ్లోని భారతీయులందరూ స్పందిస్తారు

► ఉగ్రవాదం విషయంలో దుబాయ్ రాజు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు

► ప్రపంచంలో అందరినీ దుబాయ్ ఆకర్షిస్తోంది

► 40 ఏళ్లుగా మనమంతా ఉగ్రవాద బాధితులం. అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు

► మంచి ఉగ్రవాదమైనా, చెడు ఉగ్రవాదమైనా సాధించేది ఏమీ ఉండదు.

►అందుకే ఇప్పుడు అంతా నిర్ణయం తీసుకోవాలి ఉగ్రవాదం వైపు ఉండాలో మానవత్వం వైపు ఉండాలో అని

► మంచి తాలిబన్ అయినా చెడు తాలిబన్ అయినా అవేం పనిచేయవు

► ప్రపంచ మౌనవాళికి శాంతి, సౌభాగ్యం కావాలి

► ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తాం

► సార్క్ దేశాలను ఏకతాటిమీదకు తెచ్చాం. దీంతో కొన్ని దేశాలకు సమస్యగా అనిపించొచ్చు. కానీ మేం ముందుకు వెళతాం

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top