తెలంగాణపై వెనక్కి తగ్గం: పి.సి.చాకో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి పి.సి.చాకో స్పష్టం చేశారు. ఈ సమస్య 50 ఏళ్లుగా పరిష్కారం కాలేదంటే ఎంత జటిలమైందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకుందని, దానికి యూపీఏ ఆమోదం లభించిందని చాకో తెలిపారు.
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో ఇబ్బందులున్నాయని చెప్పారు. సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ వద్ద తగిన విధానాలున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగుతోందని, సమస్యల పరిష్కారంపై ఆంటోనీ కమిటీ దృష్టి సారిస్తోందని చాకో చెప్పారు.